23, నవంబర్ 2015, సోమవారం

నాగేశ్వర్, ద్వారక గుజరాత్

నాగేశం. ద్వారక, గుజరాత్  
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మరో జ్యోతిర్లింగం.





ఈ జ్యోతిర్లింగం కుడా గుజరాత్  లో,  ద్వారకా  పట్టణానికి దగ్గరలో వుంది.  
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారే పరమేశ్వరమ్ ||
కేదారం హిమవత్ప్రుష్ఠే డాకిన్యాం భీమశంకామ్ |
వారాణస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ||
వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే |
సేతుబంధే చ రామేశం ఘశ్మేశంచ శివాలయే ||
ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తస్సర్వ సిద్ధిఫలం లభేత్ ||


నాగేశం  దారుకావనే  - నాగేశ్వరుడు.

  అమర్తసంజ్నే నగరేచ రంయే, విభూశితంగం వివిధైశ్చ భోగైహి
సాధ్భుక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీ నాగానాతం శరణం ప్రపద్యే||
 గుజరాత్  రాష్ట్రంలో ద్వారకా నగరానికి పదిహేడు కి.మీ. దూరంలో ఉన్న ఈ మహా జ్యోతిర్లింగం పదవది. దారుకుడు అనే రాక్షసుడి బారి నుంచి మహా భక్తుడైన సుప్రియుడిని రక్షించాడు ఆ పరమ శివుడు.
శివపురాణంలో  ఈ నాగేశ్వర్ గురించిన కధ మరింత వివరంగా వుంది.   ఈ దారుకా వనంలో  దారుకుడు, దారుకి  అనే రాక్షస దంపతులు వుండేవారు. దారుకుడు పరమ శివుడి భక్తుడు. వారు ఎక్కడ వుంటే వారున్న వనం కూడా వారితో పాటే వుంటుందని వారం కుడా వుంది. అయితే దారుకుడు గర్వంతో ఆ అడవిలో వుండే  ఋషి వాటికలను, యజ్ఞాలను  ధ్వంసం చేస్తూ...  ఋషులను, అడవిలో  వచ్చే వారినందరినీ హింసిస్తూ వుండేవాడు. వారంతా అడవిలో వున్న ప్రసిద్దుడైన మహర్షి ఔరకుడు (Ourava)కి మొర పెట్టుకున్నారు. ఈ మహర్షి చవనుడు, మనువు కుమార్తె అయిన అరుషిల పుత్రుడు. ఆయన దారుకుని దంపతులకి శాపం ఇచ్చాడుట. ఈయన దారుకుడు భూమి మీద ఎవరినైనా హింసిస్తే, వారు మరణిస్తారని శాపం ఇచ్చాడు, అందుకే వారు సముద్రంలో నివసిస్తూ (వారితో పాటు అడవి కూదా ), సముద్రంలో ప్రయాణించే వారిని హింసించే వారుట.  అలా ఒకసారి వ్యాపారి అయిన సుప్రియుడు అనే వైశ్యుడు వారి చేత చిక్కాడుట.  దారుకుడు పెట్టె బాధలు భరించలేక సుప్రియుడు  శివుని శరణు వేడగా,  శివుడు సుప్రియునికి తన పాసుపతాస్త్రాన్ని ఇచ్చాడని, ఆ అస్త్రంతో సుప్రియుడు ఆ దారుకుడిని, మిగతా రాక్షసులని  సంహరించాడు. అలా సుప్రియుడు పూజించి, అర్చించిన శివలింగమే  ఈ నాగేశ్వర్.

ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని అంటారు.
నాగేశ్వర్ ద్వారకా నగరానికి, బేట్ ద్వారకాకి మధ్య మైదానంలో వుంది.  
ఇక్కడ వున్న శివలింగం అన్ని చోట్లా వున్నట్లు నున్నగా వుండదు. ద్వారకాశిలతో చేయబడింది. చిన్న చిన్న చక్రాలు వుంటాయి లింగం మీద. అంతే కాదు మూడు ముఖాల రుద్రాక్షాలు వున్నట్లు వుంటుంది ఈ లింగం.
ఇక్కడ ఆలయ ఆవరణలో చిన్న నీటి గంగాళం వంటి పాత్రలో ఒక రాయి తేలుతూ వుంటుంది. ఈ రాయి హనుమంతుడు లంకకు వేసిన వారధి లోని రాయిగా చెబుతారు.

    ఈ ఆలయంలో భక్తులు జంట నాగులని భక్తితో సమర్పిస్తారు. నాగేశ్వర్  అంటేనే నాగుపాము అని. అవి ఆభరణాలుగా ధరించిన శివుడు నాగేశ్వరుడుగా కొలుస్తారు.  నాగేశ్వర్ ఆలయంలోని అమ్మవారిని నాగేశ్వరిగా పిలుస్తారు.  
        ఈ ఆలయం లో నందీశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తూ వుంటే, శివుడు దక్షిణ దిక్కుని చూస్తూ వుంటాడు.  నలమహారాజు  ఇక్కడి శివలింగాన్ని పూజించటం వల్ల  చక్రవర్తి అయ్యాడని కూడా అంటారు.
విశాలమైన ఆవరణలో ఎత్తైన  శివుడి విగ్రహం  వుంది. ఆలయ ఆవరణ లో చెట్టుకింద శనేశ్వరుడు వున్నాడు. అక్కడ భక్తులు తిలాభిషేకం చేస్తారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేయాలని అనుకున్నాడుట. ఈ ఆలయాన్ని ద్వంశం చేస్తుండగా వేలాది తేనెటీగల గుంపు వారిపై దాడి చేసిందిట. అప్పటికే సగం కూల్చిన ఆలయాన్ని వదిలివేసి వెనక్కి తిరిగి వెళ్లారు. ఆ తరువాత ఆలయాన్ని భక్తులు తిరిగి నిర్మించారు.
ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని T-సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత శ్రీ గుల్షన్ కుమార్ మరణానంతరం వారి కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక్కడ ఆకర్షనీయమైనది 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు తో వున్న శివుని విగ్రహం. మూడు కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది.
ఈ ఆలయం లోపలే విశాలమైన హాలు గుండా ప్రవేశించి స్వామి దర్శనానికి వెడుతుంటేనే బల్లలపై ఆకర్షణీయమైన వస్తువులు, లింగాలు, వస్తువులు, పూజా సామాగ్రి, నాగుపాముల ప్రతిమలు, కొబ్బరికాయలు వంటి వస్తువులు అమ్ముతుంటారు. ఒకరకమైన చిన్నపాటి షాపింగ్ సెంటర్ ఇది.
అరేబియన్ సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలో వున్న నాగేశ్వర్ పుణ్య క్షేత్రం భక్తులతో నిత్యమూ అలరారుతూ వుంటుంది.  భక్తులు స్వయం గా అభిషేకాలు చేసుకోవచ్చు.
శనేశ్వరుడు 
ద్వారకకి వచ్చే భక్తులు ఆ ద్వారకాదీసునితో పాటు  ఇక్కడికి వచ్చిఈ  పరమేశ్వరుని దర్శించుకుంటారు. నాగేశ్వర జ్యోతిర్లింగం మన భారత దేశంలో రెండు చోట్ల వుందని ఆయా భక్తుల నమ్మకం. 
1. హిమాలయాలలోని అల్మోరాకు దగ్గరలో వున్న జాగేశ్వర క్షేత్రం
2 గుజరాత్ లోని నాగేశ్వర్ అసలైన జ్యోతిర్లింగం అని కుడా అంటారు.  
ఉత్తరాఖండ్ లోని జాగేస్వర్ ఆలయం ఆల్మోరా ప్రాంతంలో వుంది. అల్మోరా ప్రాంత మంతా దారు వృక్షాలతో నిండి వుంది. ఇక్కడ కూడా ప్రసిద్ధమైన పురాతనమైన శివాలయం వుంది. అసలైన జ్యోతిర్లింగం విషయం లో భిన్నాభిప్రాయాలున్నాయి.
మేము చూసిన నాగేశ్వర్, ద్వారక, గుజరాత్ లో వున్న ఆలయ విశేషాలు ఇవి.....
ఏది ఏమైనా విశిష్టమైన ఈ శివాలయం భక్తులని విశేషం గా ఆకర్షి స్తోంది.
ద్వారకనుండి  గోపితలాబ్   అనే గ్రామం  వెళ్ళే  బస్సులో  వెళ్లి ఈ  జ్యోతిర్లింగమును  దర్శించవచ్చు. ప్రైవేటు వాహనాల్లో అయితే చుట్టుపక్కల 
మరి కొన్ని ప్రదేశాలు చూడవచ్చు.

నాగేశ్వర్, నాగనాధ్ ,  ద్వారక,  గుజరాత్ 



21, నవంబర్ 2015, శనివారం

బ్రెడ్ సాండ్ విచ్ 2

బ్రెడ్ సాండ్ విచ్ 2


 బ్రౌన్  సాండ్ విచ్ బ్రెడ్        :     1 
టమేటా సాస్  :  1/2 కప్ 
కారట్     :   1   తురిమినది. 
ఉల్లిపాయ   :  2  సన్నగా తరిగినవి
టమాటో     :   2 సన్నగా ముక్కలు తరిగినవి 
కాప్సికమ్   :   2  సన్నగా ముక్కలు తరిగినవి 
ఉప్పు         :  2  tsp (లేక రుచికి తగినంత)
పచ్చిమిర్చి  :  2
కారం           :  1 tsp 
గరం మసాలా  :  1 tsp 
పంచదార        :  2  tsp 
కొత్తిమీర          :  1 కట్ట సన్నగా తరగినది.  
బటర్              :  1 పాకెట్ అముల్ బటర్ ( బ్రెడ్ కాల్చడానికి)  
తయారీ విధానం :
1. ముందుగా సన్నగా తరిగిన వెజిటేబుల్స్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
2. ఉప్పు, పంచదార, గరం మసాలా,  కారం, సన్నగా తరిగిన్బ పచ్చిమిర్చి,  కొత్తిమీర వేసి బాగా కలపాలి. 
3. టమేటా సాస్ ఒక కప్ లోకి తీసుకుని,  కొంచెం నీళ్ళు పోసి పలచగా కలపాలి.
4.బ్రెడ్ స్లైసు కి ఒక వేపు టమేటా సాస్ రాయాలి. దాని మీద తరిగిన వెజిటబుల్ ముక్కలు పరవాలి. 
5. రెండో బ్రెడ్ స్లైస్ దీని మీద పెట్టి అటు ఇటూ బట్టర్ రాసి toaster లో కాల్చుకొవాలి.  బటర్ లేకపోతె నూనె రాసి కుడా పెనం మీద  కాల్చుకోవచ్చు.. 
capsicum వాసనతో   ఘుమ ఘుమ లాడే సాండ్ విచ్  రెడీ 








    



15, నవంబర్ 2015, ఆదివారం

సోమనాథ్, గుజరాత్

ఇవాళ కార్తీక సోమవారం. ఈ సందర్భంగా గుజరాత్ లోని అరేబియన్ సముద్ర తీరాన వెరావాల్ లోని సోమనాథ్ ఆలయ విశేషాలు.


సోమనాథ్  ఆలయం 

సోమనాథ్ గుజరాత్

కార్తీక మాసం సందర్భంగా జ్యోతిర్లింగాలలో ప్రధమ జ్యోతిర్లింగమైన సోమనాథ్ గురించి న విశేషాలు
సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్.....
శివుడు లింగ రూపధారి. జ్యోతిస్వరూపుడు.


శైవ భక్తులు శివలింగాన్ని పూజిస్తారు.   శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని భక్తుల నమ్మకం. భక్తులు ఆరాధించే 12 జ్యోతిర్ లింగాలలో మొదటిది అయిన సోమనాధుని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు..   ద్వాదశ స్త్రోత్రం లో ముందుగా చెప్పేది సౌరాష్ట్రం లో వున్న సోమనాధుడు.  ఈ ఆలయం అరేబియన్ సముద్ర తీరాన వేరావాల్ తీరాన, ప్రభాస్ తీర్ధం లో వుంది.  
 ఎంతో విశేషమైన ఈ సోమనాధుని ఆలయం పురాణ కథనాల ప్రకారం చంద్రుడు కట్టించాడు అని అంటారు. చంద్రుడు అంటే సోముడు. సోముడు కట్టించాడు కనుక సోమనాధీశ్వరుడుగా కొలుస్తారు. మహా పుణ్య క్షేత్రం ఇది.
దక్షుడి కుమార్తెలు 27 మందిని వివాహం చేసుకున్న చంద్రుడు ఎక్కువగా రోహిణి మీదే అభిమానం చూపుతుండటం తో మిగిలిన వారు దక్షునితో విన్నవించుకోగా దానికి దక్షుడు ఆగ్రహించి చంద్రుని శపించాడుట. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణకై చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్తాపించి శివుని పూజించి శాప విమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్దం. శివుని ఆజ్ఞ మేరకు చంద్రుడు అందరినీ సమానంగా చూసుకునే వాడని చరిత్ర కథనం.   శివుడు  చంద్రుడు స్థాపించిన లింగంలో తానూ కొలువై వుంటానని మాట ఇచ్చాడుట.  అందుకే ఇక్కడి శివుడిని సోమనాధుడు అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తరువాత రావణుడు వెండితో కట్టించాడని , అనంతరం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కొయ్యతొను, భీముడు రాతితోను తిరిగి నిర్మించారని చరిత్ర కధనాలు చెబుతున్నాయి.  
అపారమైన సంపద ఉన్న ఈ ఆలయాన్ని 1024లో ఘజని మహమ్మద్ ధార్ ఎడారి ప్రాంతం గుండా ఇక్కడికి  చేరుకొని దండయాత్ర చేసి సంపదని కొల్లకొట్టి,  ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఆలయం తిరిగి నిర్మించారు. అయితే 1308లో అల్లయుద్దీన్ ఖిల్జీ సైన్యంచే నాశనమయింది. ఔరంగజేబుతో సహా ముస్లిం రాజులచే ఈ ఆలయం అనేక మార్లు  నిర్మింప బడుతూ,  దండయాత్రలకి గురవుతూ  వుంది.
శిధిలమైన పురాతనమైన సోమనాథుని ఆలయం 
    ప్రస్తుతమున్న ఈ ఆలయం భారత స్వాత్రంత్ర్యానంతరం  1950 తరువాత సర్దార్ వల్లభాయ్  పటేల్ చే నిర్మితమైంది.  
      సౌరాష్ట్రాలో అరేబియన్ సముద్ర తీరాన వెలసిన ఈ ఆలయం ఎంతో సుందరమైనది.
ఆలయం లోపల అంతా సువర్ణమయమై, అందమైన శిల్ప కుడ్యాలతో అలరారుతూ వుంది.
ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన, అందమైన గుండ్రటి గోపురం ఆలయ లోపలి నుంచి అందంగా కనిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం చాలా పెద్దది.  శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది.  ద్వారానికి కుడిపక్క వినాయకుడి విగ్రహం, ఎడమ పక్క ఆంజనేయ విగ్రహం వున్నాయి.  ఆలయం లో విశాలమైన గర్భగుడి,   బంగారు గోడలు, తలుపులు, వివిధ రకాలుగా అందమైన అలంకరణలో శివుడు, సుగంధ పరిమళాల మధ్య  ధూప దీప కాంతులతో  హారతుల మధ్య, శివనామ స్మరణం తో మారుమ్రోగే ఆలయ ప్రాంగణం,  ఆలయాని తాకే సాగర కెరటాలు, ఆ వాతావరణమే ఎంతో అద్భుతం. చూడవలసిన ప్రదేశం ఈ ఆలయం.  అహ్మదాబాదు నుంచి 410  కి.మీ. దూరంలో  వుంది.
జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే వారికి తప్పనిసరిగా ఈ ఆలయం చూడాల్సిందే!

ఆలయం లో శివుని హారతి విశేషం. సాధారణంగా భక్తులు ఈ హారతిని చూడాలని కోరుకుంటారు. ఆ సమయం లో జన రద్దీ కూడా ఎక్కువే!     


సోమనాథ్ పాత ఆలయం 

 
        సోమనాథ్ ఆలయానికి సమీపంలో పురాతనము, అసలైన  జ్యోతిర్లింగం వున్నది అని చెప్పబడుతున్న ఇంకో సోమేశ్వరుడున్న ఆలయం వుంది.  ఈ ఆలయమ 20 మెట్లు దిగి వెళ్ళాలి.  ఇక్కడి శివుడికి పాలతో అభిషేకం భక్తులే చేసుకోవచ్చు. మారేడు దళాలతోను మనచే చేయిస్తారు అక్కడి పూజారులు.  ఈ ఆలయం లో చిన్న చిన్న ఆలయాలు వున్నాయి.  ఇది కుడా ప్రతి ఒక్కరు దర్శించుకునే ఆలయం. గర్భ గుడి చిన్నది కావటంతో ఎక్కువ మంది పూజ చేయటానికి వీలు కాదు.  
లక్ష్మి నారాయణ ఆలయం 
సోమనాథ్ వున్న ఊరుని ప్రభాస తీర్థం అంటారు.  ఇక్కడ శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందిన వూరు.  ఇక్కడి సముద్రం లో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తున్నాయి.  ఇక్కడి సంగమం లో స్నానం చేస్తే పుణ్య గతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

సోమనాధుని ఆలయానికి సమీపం లోనే లక్ష్మి నారాయణ ఆలయం వుంది. ఇక్కడ కూడా వసతి సత్రం వుంది.  ఇది కొంచెం పాతది. కాని ఆధునిక వసతులతో లీలావతి హోటల్ (మేము దిగినది) బాగుంది. (రోజుకి 300/- మాత్రమే )  


లీలావతి హోటల్ 

ఇక్కడ ఉదయాన్నే బ్రేక్  ఫాస్ట్ మనలాగా ఇడ్లి, దోసె తక్కువ  ఎక్కువగా డోక్లా, పోహా   తీసుకుంటారు.  
ఇక్కడ వసతి కుడా అందుబాటు ధరల్లోనే లోనే వుంటుంది.  గుజరాతి ఫుడ్ ఇష్టపడే వారికి అన్ని రకాల పదార్ధాలు లభిస్తాయి. ఎందుకంటే గుజరాతీ వంటలలో ఎక్కువగా తీపి వుంటుంది.


సోమనాధునికి ఇచ్చే హారతిని లైవ్ గా కుడా చూడచ్చు. ఈ లింక్ ఇదిగో http://www.somnath.org/live-darshans.aspx


 

12, నవంబర్ 2015, గురువారం

Jo Jo Mukunda - 1 Album Songs || Jukebox

లలిత గీతాల రాణి శ్రీమతి వేదవతి ప్రభాకర్  పాడిన  లాలి పాటలు వినండి.  ఆ రోజుల్లో ప్రతి ఇంటా ఈ లాలి పాటలు వినిపిస్తుండేవి.  










11, నవంబర్ 2015, బుధవారం

త్రివేణి సంగమం , సోమనాథ్ గుజరాత్

త్రివేణి సంగమం , సోమనాథ్  గుజరాత్ 
అందరికీ  దీపావళి శుభా కాంక్షలు 
దీపావళి సందర్భంగా గుజరాత్ లోని సోమనాథ్ పట్టణం దగ్గరలో వున్న ఆలయ విశేషాలు గురించి ఫొటోలతో వివరించాలని పించింది. 

సాగరం లో కలిసే సంగమ ప్రదేశం సోమేశ్వరుడి ఆలయానికి  సమీపం లోనే వుంది. 
ఇక్కడ సాగరం లో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తున్నాయి.  ఈ సంగమ ప్రదేశానికి దగ్గరలో విష్ణుమూర్తి ఆలయాలు వున్నాయి. ముందుగా మనకి కనిపించేది శ్రీకృష్ణ మందిర్. ఇక్కడ మూలవిరాట్   శ్రీ కృష్ణుడు. ఆలయం బాగుంది. ఆలయంలో ఉయ్యాలలో శ్రీకృష్ణుడి ప్రతిమని వుంచి చక్కగా పూలతో అలంకరించి పూజలు, భజనలు చేస్తారు. ఈ అల్లయానికి పక్కనే బలరాముడి ఆలయం, ఆది శేషుడి ఆలయం, లక్ష్మి నారాయణ ఆలయాలు కుడా వున్నాయి.   ఈ ఆలయం విశాల ప్రాంగణం తో సంగమ నదీ తీరాన వుంది. సోమనాథ్ వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాలను కుడా దర్శిస్తారు. 



శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ సంగమం, సోమనాథ్ 

లక్ష్మీనారాయణ మూర్తులు 

త్రివేణి సంగమ ముఖద్వారం 

త్రివేణి సంగమం 


శ్రీ కృష్ణ 

అలంకారం తో శ్రీకృష్ణుడు ఊయలలూగుతూ 


నదీ తీరం , సంగమ  ప్రదేశం 

మురుకులు

మినపప్పు మురుకులు   
మినపప్పు     :      1 గ్లాస్   
బియ్యం        :      4 గ్లాసులు 
 (రెండు  కలిపితే 1 kg పిండి )
వెన్న             :     1 కప్ 
నువ్వులు      :        100 grams
వాము          :         4  tsp
నూనె            :       వేయించడానికి సరిపడినంత  (1 Lit Packet)
పచ్చిమెరపకాయలు  :  1/4 kg  (కారం కావాలనుకునే వారికి )
ఇంగువ        :       2  tsp 
తయారి విధానం  :  
1. ముందుగా మినపప్పు దోరగా   వేయించి పెట్టుకోవాలి. 
2.  బియ్యం కడిగి వెంటనే నీడలోనే  ఆరబెట్టాలి. బియ్యం నానకూడదు.
    ఎండిన వెంటనే (అంటే  బాగా గల గల మనేల  ఎండకూడదు.)
3. బియ్యం, మినపప్పు కలిపి గిర్నీ లో  మెత్తగా పిండి ఆడించాలి.
4.  పెద్ద పళ్ళెంలో మినపప్పు, బియ్యం కలిపి మరాడించిన పిండి వేయాలి.  అందులో ఉప్పు, వెన్న, వాము, నువ్వులు వేసి బాగా కలపాలి.   ఆతరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ కొద్దిగా గట్టిగా కలపాలి. 
5. పిండి మొత్తం ఒకేసారి కలపకుండా జంతికల గొట్టం లో పిండి వేసి బాగా కాగిన నూనెలో చక్రాల్లా పిండిని వత్తాలి. 
6.  తెల్లగా ఉన్నపుడే వాటిని తీయాలి.  చల్లారాక అవి కర కర మంటూ బాగుంటాయి. 
7   కారం కావాలనుకునే వారు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి, ఆ పేస్ట్ కలపాలి. అవి కుడా తెల్లగా వుండి చూడటానికి బాగుంటాయి.

టిప్స్ : 
1. పిండిని ముందు బాగా కలుపుకోవాలి. తరువాతే నీళ్ళతో కలపాలి. 
2, ఎర్రగా కావాలనుకునే వారు పచ్చి మిరపకాయలకి బదులు ఎండు కారప్పొడి వేసుకోవచ్చు.  
3. వెన్న ఇంట్లో లేనపుడు అముల్ బటర్ కూడా వేయచ్చు. 
4.  అన్ని ఒకే కలర్ వచ్చేలా చూసుకోండి.
5. తెల్లగా వున్నా చల్లారాక  గట్టి పడతాయి.



పచ్చిమిర్చి వేసిన మురుకులు 

5, నవంబర్ 2015, గురువారం

సున్నుండలు

సున్నుండలు 
మినపప్పు     :     1 గ్లాస్
బెల్లం             :     1 గ్లాస్ 
నెయ్యి            :    1కప్పు   
ఏలక్కాయ పొడి :   1 tsp 

తయారీ విధానం :

1. మినపప్పు దోరగా వేయించి మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి 
2. బెల్లం కత్తిపీటతో కాని, చాకుతో కాని తరగాలి.
3. కరిగిన నెయ్యి , ఏలక్కాయ పొడి, బెల్లం, మినపప్పు పొడి అన్నీ వేసి కలపాలి.
4. నెయ్యి గడ్డ కట్టకుండా ఉన్నపుడే లడ్డులు కట్టాలి. 
అంతే సింపుల్ అయిన మినప సున్నుండలు రెడీ 

టిప్స్ 


  • ఈ సున్నుండలు పిల్లకే కాదు పెద్దలకి కూదా బలవర్ధకం 
  • మినుములు, బెల్లం కాబట్టి వంటికి చాలా మంచిది .
  • లడ్డులు పూర్తిగా నేయి తోనే కట్టాలి. పాలు వంటివి కలపకూడదు. 
  • చాలా మంది బెల్లానికి బదులుగా పంచదార వేస్తారు.
  • కొలతలు కూడా వేరుగా వుంటాయి. 
  • నేను వేసి చేసాను ఈ కొలతలు కరెక్ట్ గానే వచ్చాయి.

3, నవంబర్ 2015, మంగళవారం

బాదం హల్వా

   స్వీట్స్


 బాదాం హల్వా 
కావలసిన పదార్ధాలు 
బాదం పప్పులు  :       1 కప్పు (నానపెట్టి పై తొక్క తీసినవి )
పాలు                :        1 కప్పు 
పంచదార           :        3/4 కప్పు 
ఏలక్కాయలు     :        3
నెయ్యి                :       1/2 కప్పు 
కుంకుమ పువ్వు :       కొద్దిగా 
ఫుడ్ కలర్          :      కేసరి కాని లైట్ పసుపు రంగు (optional 



తయారు చేసే విధానం :
  • బాదం పప్పులని నీటిలో నానబెట్టాలి. తరువాత పైన వున్న తొక్కని తీసేయాలి. తొందరగా తొక్క తీయాలంటే వాటిని  నీటిలో వుడికించితే తొందరగా వస్తుంది
  • వాటిని మిక్సీలో వేసి  పాలు పోసి  పేస్ట్ చేయాలి.
  • పంచదారని పావు కప్పు నీటిలో కరిగించి లేత పాకం వచ్చేదాక పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. 
  • పంచదార పాకంలో రుబ్బి వుంచుకున్న బాదం పేస్ట్ ని వేసి కలుపుతూ వుండాలి. లేకపోతే మాడి పోతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి.
  • దంచిన ఏలక్కాయ పొడి వేయాలి.
  • కరిగించిన నేతిని పోస్తూ కలుపుతూ వుండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ వుండాలి.
  • కొద్ది పాలలో కుంకుమ పూవు వేసి బాగా కలిపి కరిగాక వుడుకుతున్న బాదం పేస్ట్ లో వేయాలి.
  • వుడుకుతున్నప్పుడు నెయ్యి సెపరేట్ అయ్యినట్లుగా వుంటే హల్వా అయిపోయినట్లే!
  •  వెంటనే  స్టౌ కట్టేయాలి. లేకపోతే తొందరగా అడుగంటడమో, మాడటమో జరుగుతుంది.
  • కలుపుతుంటే బాళికి అంటుకోకుండా వున్నపుడు అయిపోయినట్లు.      
  • వేయించిన బాదం పప్పులు, పిస్తా సన్నాగా కట్ చేసి   హల్వా పైన అలంకరిస్తే బాగుంటుంది. 
  • ముద్దగా కాకుండా పీసెస్ లాగా కావలంటే నెయ్యి రాసిన పళ్ళెంలో  బాదం   హల్వా   వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. 
టిప్స్ 
  • బాదాం పప్పు పది నిముషాలు ఉడికిస్తే తొక్క తొందరగా వస్తుంది.
  • కొంతమంది బాళిలో ఒకేసారి బాదాం పేస్టు, నెయ్యి, పంచదార, ఏలక్కాయ పొడి అన్నీ ఒకేసారి వేసి ఉడికిస్తారు.
  • హల్వా పూర్తీ అయ్యే వరకు కలుపుతూనే వుండాలి.  
  • పిన్నలు, పెద్దలు ఇష్టం గా తినే బాదాం హల్వా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.





       

1, నవంబర్ 2015, ఆదివారం

వెజ్ పోహ బాత్

 వెజ్  పోహ  బాత్


అటుకులు    : 2 కప్పులు  వెజిటబుల్స్ : 2 కప్పులు 
                       (కారట్, టమేటో, కాప్సికం, ఆలుగడ్డ మీడియం సైజు, బటాణి తరిగినవి)
ఉల్లిపాయ     : మీడియంసైజు 
 పచ్చిమిరపకాయలు : 4
 కరివేపాకు               :  2 రెమ్మలు
 పసుపు                  : 1/4 tsp 
పోపు సామాను       :  2 tsp (ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి)
నూనె                     :   2 Tbs  
ఉప్పు                    : తగినంత or  2 Tsp  
నిమ్మరసం             :   4 Tsp
కొత్తిమీర                 : 1 కట్ట (కడిగి సన్నగా తరగాలి)


తయారి విధానం :


  • బాళీలో నూనె వేసి పోపు వేసి వేయించాలి. 
  • పోపు వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి.  
  • తరిగిన ఉల్లిపాయలు,  కూరగాయల ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. 
  • 10ని. వేయించాక ముక్కలు మెత్తపడ్డాక కడిగిన మోటా అటుకులు కడిగి వేయాలి. 
  • ఉప్పు, పుసుపు వేసి బాగా కలిపి 5 ని. మూత పెట్టి మళ్ళీ స్టవ్ మీద వుంచాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద నుంచి దింపి కొత్తిమీర చల్లాలి. 
ఘుమ ఘుమ లాడే పోహా బాత్ రెడీ!చల్లటి పెరుగుతో  వేడి వేడిగా వడ్డించండి. 

టిప్స్:
  • ఇది ఉపవాసాల సమయం లో కొంతమందికి  ఎటువంటి అభ్యంతరం వుండదు. 
  • పులుసటుకుల బదులు వెజిటబుల్స్ వేసిన ఈ పోహా బాత్ కూడా రుచి గా వుంటుంది. 
  • తొందరగా కుడా తయారవుతుంది. 
  • అటుకులు ఎక్కువసేపు నానపెడితే పేస్ట్ లాగా అవుతుంది. 
  • కడిగి కొద్దిగా నీళ్ళు వుంటే చాలు. అవి పీల్చుకుని పొడి పొడిగా అవుతాయి 

కొత్తిమీర ఖారం


కొత్తిమీర కారం 
పచ్చిమిర్చి             :     50 gms
కొత్తిమీర                 :     4 కట్టలు 
నిమ్మకాయలు       :     2
ఉప్పు                   :       2 tsp or  ( తగినంత)
పోపు                    :   ఆవాలు, మెంతిపిండి, మినపప్పు ఇంగువ 
తయారి విధానం    :

కడిగిన మిరపకాయలు, కడిగిన కొత్తిమీర, ఉప్పు, మెంతిపిండి, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. 
నిమ్మరసం కలపాలి 
ఇంగువ పోపు వేయాలి
అంటే కొత్తిమీర ఖారం రెడీ 

నోట్స్ 
ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ మెరపకాయలు వేసుకోవచ్చు .
ఆపూట కారం వున్నా సాయంత్రానికి తగ్గిపోతుంది 
అన్నం లోకి , నెయ్యి వేసి కలిపిన  ఉట్టిపప్పు అన్నం లోకి, బ్రెడ్ సాండ్ విచ్ లోకి బాగుంటుంది. 
దీన్ని కుడా  పచ్చి మిరపకాయ కారం/నిమ్మకాయ కారం   అని అంటాము 
చూడటానికి  చాట్ లలో వాడే   గ్రీన్ చట్నీ లా వున్నా ఇందులో పొదినా , సోంపు , జీలకర్ర వుండవు. 

టమాటో పచ్చడి - 2 (ఊరగాయ )

టమాటో పచ్చడి:


కావలసిన పదార్ధాలు :

టమాటోలు  :  వీశే కిలోన్నర 
చింతపండు  :  100 gms 
మెంతిపిండి  :  100 గ్రాములు లేదా తమ రుచికి తగ్గట్టు. మరీ ఎక్కువైతే చేదు వస్తుంది.) 
కారం          :     డబ్బాడు (సుమారు 250
ఉప్పు          :    కొంచెం తక్కువ డబ్బాడు 200 gms   లేక తగినంత 
పోపు           :     ఆవాలు, మినపప్పు, ఇంగువ 
నూనె          :    100gms 
తయారి విధానం 
1. టమోటాలు కడిగి ముక్కలుగా తరగాలి. 
2. ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి.
3. మరునాడు   టమేటా ముక్కలు పిండి పళ్ళెంలో ఎండలో పెట్టాలి. రసంలో   చింతపండు, ఈనెలు,గింజలు తీసి నానబెట్టాలి. . 
4. ఈ రసం కూడా ఎండలో పెట్టాలి. 
5. సాయంత్రం ఎండలో నుంచి తీసి చింతపండులో కారం వేసి కలిపాలి. 
6.మిక్సీలో  కొంచెం చింతపండు, టమాటో రసంలో కలిపినకారం వేసి రుబ్బాలి.మెంతి పిండి కూడా అందులో వేయాలి.  ఆతరువాత ఎండిన టమాటో ముక్కలు (మరీ ఒరుగుల్లా ఎండ కూడదు) వేసి రుబ్బాలి. 

7. పచ్చడి మొత్తం బాగా కలిసేట్టు కలిపి జాడీలో తీసుకోవాలి. 
8. కావాల్సినప్పుడు కొంచెం కప్పులోకి తీసుకుని పోపు వేసుకోవాలి.
    మూకుడులో నూనె వేసి బాగా కాగాక ఆవాలు, మినపప్పు, ఇంగువేసి పోపు వేయాలి. 
    అంతే ఇంగువ, మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే టమేటా పచ్చడి రెడి ...