వెజ్ పోహ బాత్
అటుకులు : 2 కప్పులు వెజిటబుల్స్ : 2 కప్పులు
(కారట్, టమేటో, కాప్సికం, ఆలుగడ్డ మీడియం సైజు, బటాణి తరిగినవి)
ఉల్లిపాయ : మీడియంసైజు
పచ్చిమిరపకాయలు : 4
కరివేపాకు : 2 రెమ్మలు
పసుపు : 1/4 tsp
పోపు సామాను : 2 tsp (ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి)
నూనె : 2 Tbs
ఉప్పు : తగినంత or 2 Tsp
నిమ్మరసం : 4 Tsp
కొత్తిమీర : 1 కట్ట (కడిగి సన్నగా తరగాలి)
(కారట్, టమేటో, కాప్సికం, ఆలుగడ్డ మీడియం సైజు, బటాణి తరిగినవి)
ఉల్లిపాయ : మీడియంసైజు
పచ్చిమిరపకాయలు : 4
కరివేపాకు : 2 రెమ్మలు
పసుపు : 1/4 tsp
పోపు సామాను : 2 tsp (ఆవాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండుమిర్చి)
నూనె : 2 Tbs
ఉప్పు : తగినంత or 2 Tsp
నిమ్మరసం : 4 Tsp
కొత్తిమీర : 1 కట్ట (కడిగి సన్నగా తరగాలి)
తయారి విధానం :
- బాళీలో నూనె వేసి పోపు వేసి వేయించాలి.
- పోపు వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి.
- తరిగిన ఉల్లిపాయలు, కూరగాయల ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
- 10ని. వేయించాక ముక్కలు మెత్తపడ్డాక కడిగిన మోటా అటుకులు కడిగి వేయాలి.
- ఉప్పు, పుసుపు వేసి బాగా కలిపి 5 ని. మూత పెట్టి మళ్ళీ స్టవ్ మీద వుంచాలి.
- ఇప్పుడు స్టవ్ మీద నుంచి దింపి కొత్తిమీర చల్లాలి.
ఘుమ ఘుమ లాడే పోహా బాత్ రెడీ!చల్లటి పెరుగుతో వేడి వేడిగా వడ్డించండి.
టిప్స్:
- ఇది ఉపవాసాల సమయం లో కొంతమందికి ఎటువంటి అభ్యంతరం వుండదు.
- పులుసటుకుల బదులు వెజిటబుల్స్ వేసిన ఈ పోహా బాత్ కూడా రుచి గా వుంటుంది.
- తొందరగా కుడా తయారవుతుంది.
- అటుకులు ఎక్కువసేపు నానపెడితే పేస్ట్ లాగా అవుతుంది.
- కడిగి కొద్దిగా నీళ్ళు వుంటే చాలు. అవి పీల్చుకుని పొడి పొడిగా అవుతాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి