కోపల్లె హనుమంత రావు
స్వాతి వార పత్రిక 11 12 2015 లో స్వాత్రంత్ర సమర యోధులు, జాతీయ విద్యా పరిషత్ వ్యవస్తాపకులు బందరు వాస్తవ్యులు కీ. శే. కోపల్లె హనుమంతరావ్ గారి గురించి రాసిన ఆర్టికల్ వచ్చింది .
స్వాతి వార పత్రిక 11 12 2015 లో స్వాత్రంత్ర సమర యోధులు, జాతీయ విద్యా పరిషత్ వ్యవస్తాపకులు బందరు వాస్తవ్యులు కీ. శే. కోపల్లె హనుమంతరావ్ గారి గురించి రాసిన ఆర్టికల్ వచ్చింది .
బందరు (మచిలీపట్టణం ) లోని తోలి జాతీయ విద్యా పరిషత్ వ్యవస్తాపకులు, తోలి ప్రిన్సిపాల్ అయిన కోపల్లె హనుమంత రావు గారు విద్యతో పాటు వృత్తి విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టిన జాతీయ వాది. జమిందారి వంశంలో పుట్టినా , చల్లపల్లి జమీలో దీవాన్ గా చేసి న్యాయవాది గా ప్రసిద్ది పొందిన తండ్రి కృష్ణారావు గారి బాటలో నడిచి న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న రొజులవి. ఆ రోజుల్లో జాతీయోద్యమం ఊపిరి పోసుకుని భారత జాతీయ నాయకులు లాల్, పాల్, బాల త్రిమూర్తుల స్ఫూర్తి, ఉపన్యాసాలు, మహాత్ముని అంధ్ర పర్యటన .... ఇలా ఎన్నో స్వాత్రంత్ర పోరాటా నికై దేశం యావత్తూ కదన రంగాన తెల్ల వారికి ఎదురు నిల్చి, వారిని తరిమి కొట్టే పోరాటాలు సాగుతున్న సమయం లో హనుమంత రావు గారు తన మిత్రులు పట్టాభి, ముట్నూరు ల సాయంతో బందరు లో జాతీయ విద్యా పరిషత్ ని స్తాపించారు.
కోపల్లె హనుమంతరావు గారు తన లాయరు పట్టాను చించి వేసి, జాతీయ ఉద్యమాల బాట పట్టారు. కలంకారి నేత, చిత్రలేఖనం , మెకానిజం, వడ్రంగి, ఇలా ఎన్నో వ్రుత్తి విద్యలను కళాశాలలో నేర్పించారు.ఎందరికో జీవన బృతిని అందించారు. ప్రక్రుతి ఆరాధకులు, నిరాడంబరుడు అయిన కోపల్లె వారి జీవిత చరిత్ర ఆధారంగా స్వాతి వార పత్రిక లో ప్రముఖ వ్యాస కర్త వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఈ కళాశాల నుంచి ఎందరో సాహితీ మూర్తులు, చిత్రకారులు, (అడవి బాపిరాజు వంటి వారు) ఇక్కడ చదువుకి పైకి వచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి