దోశెలు
దోశెలు ఎలా చేయాలో అందరికి తెలుసు. అయినా మళ్ళి మీకు చెబుతున్నాను.
బొంబాయి రవ్వ దోశెలు
మినపప్పు : 1 గ్లాసు
బొంబాయి రవ్వ : 2 గ్లాసులు
ఉప్పు : తగినంత
జీలకర్ర : 2 స్పూనులు
నూనె : దోశెలు సరిపడినంత (సుమారుగా 1/2 కప్)
తయారీ విధానం :
- ముందుగా మినపప్పు నానబెట్టాలి.
- పప్పు నానాక మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బాలి.
- ఈ మినప్పిండి లో బొంబాయి రవ్వ, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.
- అరగంట సేపు అలాగే వుంచి పెనం మీద పలచగా దోశెలు వేయాలి.
- దోశెల చుట్టూ 1 చెంచాడు నూనెవేసి కాల్చాలి.
- చక్కటి కమ్మనైన ఎర్రగా కాలిన దోశెలు రెడి. నోట్స్
- దోశెలు ఒక వేపే కాల్చాలి.
- ఇష్టముంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర దోశమీద వేసి కాల్చండి.
- ఈ దోశెలు అప్పటికప్పుడే చేయచ్చు.
- పిండి ఎక్కువ సేపు పులవనవసరం లేదు.
- పిండి రుబ్బగానే అరగంటలో టిఫిన్ తయారు చేయచ్చు.
- దోసెల తో పాటు అల్లం పచ్చడి కాని పుట్నాల పప్పు పచ్చడి కాని వేసుకొని తినచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి