పచ్చళ్ళు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పచ్చళ్ళు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జూన్ 2019, సోమవారం

ఉసిరి కాయ పచ్చడి (ఊరగాయ)


ఉసిరి కాయ పచ్చడి (ఊరగాయ)
(కొలతలు ఉజ్జాయింపుగా రాసినవి. ఎవరి రుచులను బట్టి వారు ఉప్పు కారం వేసుకోవచ్చు) ఉసిరికాయ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది.)
ఉసిరికాయలు        :               1   కే.జి.
ఉప్పు                  :               1 చిన్న గ్లాసు లేదా 100 గ్రాములు
కారం                  :               1 చిన్న గ్లాసు లేదా 1 00 గ్రాములు
మెంతి పిండి          :               4  tsp
ఇంగువ               :               1 స్పూన్
తయారీ విధానం    :
ముంగుగా ఉసిరి కాయలు కడిగి శుభ్రంగా తుడిచి తడి లేకుండా ఎండలో ఉంచాలి.
2 .    ఉసిరి కాయలు తరగాలి. గింజలు తీసేయాలి.
3      తరిగిన ఉసిరి కాయ ముక్కలు ఉప్పువేసి దంచాలి. లేదా మిక్సీలో  వేసి మెత్తగా చేయాలి.
4.     దంచిన ఉసిరికాయ లను చేతితో మెత్తగా పిండి రసం ఒక గిన్నెలో, ఉసిరి పొట్టు ను ఇంకో         గిన్నెలో పెట్టాలి.
5.     పసుపు వేసి రసం తీసిన ఉసిరికాయ పొత్తును గిన్నెలో పెట్టి గట్టిగా నొక్కి పెట్టి మూట పెట్టాలి.  రసం ఇంకో గిన్నెలో పెట్టాలి.
6.     మరునాడు సాయంత్రం రసం లో ఉప్పు, కారం, ఇంగువ, మెంతి పిండి (వేయించి పొడి కొట్టినది)ఇంగువ వేసి బాగా కలపాలి. అంతే ఉసిరికాయ పచ్చడి రెడీ 
7.   కొంతమంది  ఉప్పు పసుపు వేసి దంచిన ఉసిరి కాయ పచ్చడిని జాడీలో వుంచి కొద్ది కొద్ది గా తీసుకుని ఎండుమిరపకాయలు పోపు వేసుకుని దంచుకుని చేసే పచ్చడిని చేసుకుంటారు.  
        ఉసిరికాయ పచ్చడి గాలి తగిలితే నల్లగా మారుతుంది. 
       నేను ఈ ఊరగాయను సీసాలో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచుతాను. అందుకే ఎర్రగా వుంటుంది. 

1, ఆగస్టు 2017, మంగళవారం

టమాటో పచ్చడి 1

టమాటో పచ్చడి:


కావలసిన పదార్ధాలు :
టమాటోలు  :  అరకిలో 
చింతపండు  :  100 gms 
మెంతిపిండి  :  3 tsp 
కారం               50 gms  లేక  తగినంత 
ఉప్పు          :    40 gms   లేక తగినంత 
పోపు           :     ఆవాలు, మినపప్పు, ఇంగువ 
నూనె          :    100gms 
తయారి విధానం 
1. టమోటాలు కడిగి ముక్కలుగా తరగాలి. 
2. నూనె లో ఆ ముక్కలు వేయించాలి. 
3. వేగుతున్న  టమేటా లలో  కడిగిన చింతపండు, ఉప్పు, కారం, మెంతి పిండి పసుపు, వేయాలి. 
4. 2 నిమిషాలు వేయించి స్టవ్ అపెయలి. 
5. ;చల్లారాక అన్నిటిని కలిపి మిక్స్ద లో వెయలి. 
6. నూనె లో పోపు సామానులు  వేసి అవి వేగాక  ఇంగువ కూడా వేసి రుబ్బిన టమేటాలో వేసి బాగా కలపాలి.. 
    అంతే ఇంగువ, మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే టమేటా పచ్చడి రెడి ... 

1, నవంబర్ 2015, ఆదివారం

కొత్తిమీర ఖారం


కొత్తిమీర కారం 
పచ్చిమిర్చి             :     50 gms
కొత్తిమీర                 :     4 కట్టలు 
నిమ్మకాయలు       :     2
ఉప్పు                   :       2 tsp or  ( తగినంత)
పోపు                    :   ఆవాలు, మెంతిపిండి, మినపప్పు ఇంగువ 
తయారి విధానం    :

కడిగిన మిరపకాయలు, కడిగిన కొత్తిమీర, ఉప్పు, మెంతిపిండి, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. 
నిమ్మరసం కలపాలి 
ఇంగువ పోపు వేయాలి
అంటే కొత్తిమీర ఖారం రెడీ 

నోట్స్ 
ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ మెరపకాయలు వేసుకోవచ్చు .
ఆపూట కారం వున్నా సాయంత్రానికి తగ్గిపోతుంది 
అన్నం లోకి , నెయ్యి వేసి కలిపిన  ఉట్టిపప్పు అన్నం లోకి, బ్రెడ్ సాండ్ విచ్ లోకి బాగుంటుంది. 
దీన్ని కుడా  పచ్చి మిరపకాయ కారం/నిమ్మకాయ కారం   అని అంటాము 
చూడటానికి  చాట్ లలో వాడే   గ్రీన్ చట్నీ లా వున్నా ఇందులో పొదినా , సోంపు , జీలకర్ర వుండవు. 

టమాటో పచ్చడి - 2 (ఊరగాయ )

టమాటో పచ్చడి:


కావలసిన పదార్ధాలు :

టమాటోలు  :  వీశే కిలోన్నర 
చింతపండు  :  100 gms 
మెంతిపిండి  :  100 గ్రాములు లేదా తమ రుచికి తగ్గట్టు. మరీ ఎక్కువైతే చేదు వస్తుంది.) 
కారం          :     డబ్బాడు (సుమారు 250
ఉప్పు          :    కొంచెం తక్కువ డబ్బాడు 200 gms   లేక తగినంత 
పోపు           :     ఆవాలు, మినపప్పు, ఇంగువ 
నూనె          :    100gms 
తయారి విధానం 
1. టమోటాలు కడిగి ముక్కలుగా తరగాలి. 
2. ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి.
3. మరునాడు   టమేటా ముక్కలు పిండి పళ్ళెంలో ఎండలో పెట్టాలి. రసంలో   చింతపండు, ఈనెలు,గింజలు తీసి నానబెట్టాలి. . 
4. ఈ రసం కూడా ఎండలో పెట్టాలి. 
5. సాయంత్రం ఎండలో నుంచి తీసి చింతపండులో కారం వేసి కలిపాలి. 
6.మిక్సీలో  కొంచెం చింతపండు, టమాటో రసంలో కలిపినకారం వేసి రుబ్బాలి.మెంతి పిండి కూడా అందులో వేయాలి.  ఆతరువాత ఎండిన టమాటో ముక్కలు (మరీ ఒరుగుల్లా ఎండ కూడదు) వేసి రుబ్బాలి. 

7. పచ్చడి మొత్తం బాగా కలిసేట్టు కలిపి జాడీలో తీసుకోవాలి. 
8. కావాల్సినప్పుడు కొంచెం కప్పులోకి తీసుకుని పోపు వేసుకోవాలి.
    మూకుడులో నూనె వేసి బాగా కాగాక ఆవాలు, మినపప్పు, ఇంగువేసి పోపు వేయాలి. 
    అంతే ఇంగువ, మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే టమేటా పచ్చడి రెడి ...    

29, అక్టోబర్ 2015, గురువారం

పచ్చిమిరపకాయల పచ్చడి

 
పచ్చిమిరపకాయల పచ్చడి
పచ్చిమిరపకాయలు       :      100 gms
కొత్తిమీర                         :      2 కట్టలు
చింతపండు :    50 gms (నిమ్మకాయంత)

మెంతి పొడి (వేయించి పొడి కొట్టినది):   2 స్పూన్లు
ఉప్పు                           :  తగినంత
నూనె                           :  5 Tsps
పోపు                           :  ఆవాలు, మినపప్పు, ఇంగువ

తయారి విధానం           :

1 3 చెంచాల నూనెలో పచ్చిమిరపకాయలు కడిగినవి వేసి మూతపెట్టి వేయించాలి. 

2. ఘాటు పోయి రంగు మారిన మిరపకాయలలో కొత్తిమీర, నానపెట్టిన చింతపండు,  మెంతి పిండి ఉప్పు, వేసి గ్రైండ్ చేయాలి. బౌల్ లోకి తీయాలి.

3.  2 చెంచాల నూనెలో పోపు, ఇంగువ వేసి వేయించి పచ్చడిలో కలపాలి. అంతే  ఘుమ ఘుమలాడే పచ్చి మిర్చి పచ్చడి రెడీ. 


  నోట్స్ :  

పచ్చిమిరపకాయలు  పచ్చిగా వుండకుండా వేయించాలి.   మాడకూడదు 
కారం తినేవాళ్ళే ఈ పచ్చడి చేసుకోవచ్చు. 
ఎక్కువ తింటే కడుపులో మండుతుంది. జాగ్రత్త 
ఇది గుంటూరు వేపు ఎక్కువగా చేస్తారు. 
ఇదివరకు మేము కొత్తిమీర కూడా లేకుండా పచ్చి మిరపకాయలతోనే చేసేవాళ్ళము. 
మెంతి, ఇంగువ వాసనతో చాలా బాగుంటుంది. 
పెరుగన్నం లో నంచుకుని తింటే కుడా బాగుంటుంది