పచ్చిమిరపకాయల పచ్చడి
పచ్చిమిరపకాయలు : 100 gms
కొత్తిమీర : 2 కట్టలు
చింతపండు : 50 gms (నిమ్మకాయంత)
మెంతి పొడి (వేయించి పొడి కొట్టినది): 2 స్పూన్లు
ఉప్పు : తగినంత
నూనె : 5 Tsps
పోపు : ఆవాలు, మినపప్పు, ఇంగువ
తయారి విధానం :
1 3 చెంచాల నూనెలో పచ్చిమిరపకాయలు కడిగినవి వేసి మూతపెట్టి వేయించాలి.
2. ఘాటు పోయి రంగు మారిన మిరపకాయలలో కొత్తిమీర, నానపెట్టిన చింతపండు, మెంతి పిండి ఉప్పు, వేసి గ్రైండ్ చేయాలి. బౌల్ లోకి తీయాలి.
3. 2 చెంచాల నూనెలో పోపు, ఇంగువ వేసి వేయించి పచ్చడిలో కలపాలి. అంతే ఘుమ ఘుమలాడే పచ్చి మిర్చి పచ్చడి రెడీ.
నోట్స్ :
పచ్చిమిరపకాయలు పచ్చిగా వుండకుండా వేయించాలి. మాడకూడదు
కారం తినేవాళ్ళే ఈ పచ్చడి చేసుకోవచ్చు.
ఎక్కువ తింటే కడుపులో మండుతుంది. జాగ్రత్త
ఇది గుంటూరు వేపు ఎక్కువగా చేస్తారు.
ఇదివరకు మేము కొత్తిమీర కూడా లేకుండా పచ్చి మిరపకాయలతోనే చేసేవాళ్ళము.
మెంతి, ఇంగువ వాసనతో చాలా బాగుంటుంది.
పెరుగన్నం లో నంచుకుని తింటే కుడా బాగుంటుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి