30, అక్టోబర్ 2015, శుక్రవారం

"విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు , పేద పిల్లలు -


పుస్తక సమీక్ష:


 "విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు"    
(బాలల కోసం మరో చిరు పుస్తకం)
-డా . గురజాడ  శోభా పెరిందేవి
                                                                                               -మణి నాథ్ కోపల్లె 
    
                   ప్రముఖ రచయిత్రి డా.  గురజాడ శోభా పేరిందేవి రచించిన "విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు "  అనే పుస్తకం అందరు చదవతగినది. ఇందులో పేద పిల్లలు, అనాధ పిల్లలు. వీధి పిల్లలు అనుభవించే బాధలు, అనుభవాలు, అనుభూతులు తెలియ చేయటం తో పాటు,  వారికి ఆశ్రయం ఇచ్చి ఆడుకునే సంస్థల గురించి వివరించారు.
       'అప్నాఘర్' అనే సంస్థను  అభినందన భవానీ గారు గత 25 సం. గా పేద పిల్లల కి నిలువ నీడ నిచ్చి, చదువులు చెప్పిస్తూ, భోజన సదుపాయాలూ చూస్తూ, వారి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చి దిద్దుతున్నారు.  అప్నాఘర్ గురించి, అందులోని పిల్లల దీన గాధలు, ఆ సంస్థ ఎదుర్కున్న సమస్యలు, అన్ని విపులంగా రచయిత్రి ఈ పుస్తకం లో వివరించారు.  సంఘంలోని దీన, హీన,పేద పిల్లలకు వారు విధిని పూర్తిగా  ఎదిరించలేక పోయినా 'అప్నాఘర్ సంస్థ' వారి జీవితాల్లో నిండిన ఆర్ధిక, సామాజిక మార్పుని తీసుకుని వచ్చే ప్రయత్నంలోను,  ఎందరో అందించే ఆర్ధిక వనరులు, విద్యా సదుపాయాలు కుడా హర్షణీయమే! వాటినన్నిటిని రచయిత్రి చక్కగా ఇందులో వివరించారు.  అవకాశం  వుంటే ఎవరైనా ఏదైనా సాధించ గలరని,  అనాధలైనా, పేదలైనా హద్దులుండవని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడగాలరని ఈ అప్నాఘర్ విద్యార్దులు నిరూపించారు. కొందరు వీధి పిల్లలు సిగరెట్, మద్యం , డ్రగ్స్ వంటి వాటికి బానిసలై అవారాలా  తిరిగే వారుంటే మరికొందరు వివిధ వృత్తులలో పట్టుదలతో రాణిస్తూ పైకి వచ్చిన పిల్లలూ వున్నారు అని వారి వివరాలూ ఈ పుస్తకం లో అందించారు. మనదేశం లోనే కాదు ప్రపంచం లో వున్న పేద పిల్లల గురించిన వివరాలూ వున్నాయి.  వీధి బాలల గురించి చెబుతూ వారిలో పట్టుదల వుంటే జీవితంలో పైకి వచ్చిన వారున్నారు, ముళ్లబాటలో నడిచిన వారున్నారు అని అంటున్నారు రచయిత్రి. 
               ఈ పుస్తకం లో అప్నఘర్ లోని పిల్లల తో తాను రచించి, వారిచే వేయించిన అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్, వారి ఆటలు, పాటలు, డ్రామాలు వాటి గురించి చాలా చక్కగా వివరించారు.  ఇటువంటి కార్యక్రమాలు  పిల్లలలో ఎంతో ఉత్సాహాన్ని, మానసిక బలాన్ని  ఇస్తాయి అని అంటారు.  
              శోభా పెరిందేవి ఈ పుస్తకం ఒక్క పేద పిల్లల కోసం రాసినదే కాదు. అందరు చిన్నారులు వారు రాసిన నాటికలు, నాటికలు, స్కిట్స్  వంటివి ఎంతో సందేసాత్మికంగా వున్నాయి.  ఈ పుస్తకం లో రాసిన 9 నాటికలలో  నగరం లోని వివిధ స్కూల్ విద్యార్దులు కుడా స్టేజి మీద వేసేవారు. బహుమతులు అందుకున్నారు. వీరు రచించిన ఈ నాటికలు ఒక్కొక్కటి ఆణిముత్యం . సందేశాలను అందిస్తాయి. 
           *  పిల్లలని పెంచేటప్పుడు తల్లి తండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దితే ఎటువంటి ఫలితాలని ఇస్తుందో 'జననీ జన్మ భూమిశ్చ' అనే నాటిక చెబుతుంది. ఇందులో పిల్లలు తమకిష్టమైనవి తీర్చుకోలేక, పెద్దల అభీష్టాలను తీర్చలేక మానసిక వత్తిడికి లోనై ఇంటినుంచి పారిపోవటం,  వారిలోని సృజనాత్మక లోపించటం వంటివి జరుగుతుంది. ఈ నాటిక బాలల నాటక పోటీల్లో బహుమతి కుడా పొందింది. 
          * పిల్లలు ఎక్కువగా ఇష్టపడే జంతువులు ముఖ్య పాత్రలుగా పిల్లలచే చేయించే నాటిక 'అడవిలో అందాల పోటి;  ఇందులో అందమైన జంతువులు ఎన్ని వున్నా నల్లగా వున్నా ఒక కాకి బహుమతి గెల్చుకోవటం దానికి కారణం వివరించే తీరు మనుషుల్లో  గతించిన  పెద్దలపై పెట్టే తీర్ధ విధులు ఒక కాకి ఎలా ఆహారంగా తీసుకుని సమాజానికి ఉపయోగ పడుతుంది అని చెబుతుంది. 
          * ఇంకో  నాటకం 'హాపీ డేస్'. సంవత్సరం లో మనం జరుపుకునే సెలవు రోజులు, వాటి ప్రముఖ్యతవి వివరిస్తుంది. దీన్ని చిన్న పిల్లలు అంటే యల్ కేజీ పిల్లలచే కూడా చేయించ వచ్చు. 
           * అలాగే మనుషులకే కాదు వారు వాడే వస్తువులకి ప్రాణం వస్తే అవి ఎలా మాట్లాడుకుంటాయో, ఎలా బాధ పడుతుంతాయో అని చెప్పే నీతి నాటకం 'మా పాట్లు వినేదేవరండి' అనే నాటిక చెబుతుంది.. 
           * టీచర్స్ డే నాడు ప్రదర్శించే నాటకం ....   ఒక విద్యార్ధి  తన టీచర్ చెప్పినవి పాటిస్తూ ఎలా పైకి వచ్చాడో 'గురు దక్షణ' అనే నాటకం చెబుతుంది. 
           * అన్నీ నాటకాలే కాకుండా గేయ రూపకం 'హైదరాబాద్ హైలైట్స్'. ఇది   వెనక పాట పాడుతూ వుంటే హైదరాబాద్ నగర విశేషాలు  అభినయించే నాటకం. 
            * 'రక్షించండి' నాటకంలో అయితే భూమాత విలాపం. ప్రజలంతా భూమి మీద చేసే దారుణం గా తనని ఎలా  హింసిస్తున్నారో, తనని రక్షించమని భూదేవి వరుణ దేవుని, వాయుదేవుని వేడుకోవటం వుంటుంది. ఇది పర్యావరణానికి సంబంధించిన నాటిక. ఇది ఒక సందేశాత్మక నాటకం. 
           *  పుట్టిన రోజు నాడు వేడుకగా పార్టీలు, పిక్నిక్ లు, సరదాగా గడపటం కన్నా అనాధ పిల్లలకి , పేద పిల్లలకి , వృద్ధులకి  ఇలా ఏదైనా ఆశ్రమాలకి వెళ్లి అన్నదానం చేయటం, పిల్లలతో ఆటలాడించటం, వారితో గడిపినపుడు ఆ పిల్లలు పొందే అనందం ఎలా వుంటుందో తెలిపే నాటిక  జన్మదిన కానుక  అనే నాటకం లో తల్లితండ్రులు తమ పిల్లలకి ఇచ్చే బహుమతి ఏదో తెలుపుతుంది. 
           * 'పుస్తక విలాపం' అనే నాటకం లో పుస్తకాలు చదవటం తగ్గిపోతున్న ఈ రోజుల్లో లైబ్రరీ లలో వుండే పుస్తకాలు ఎలా బాధ పడతాయో తెలుపుంది. గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ఈ నాటిక రచించి, ప్రదర్శించారు. ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా వేయచ్చు అనేలా వుంది.  
           ఈ నాటకాలన్నీ కూడా 15ని. లోపే వుంటాయి. తేలిక సంభాషణలతో చిన్నారులు గుర్తు పెట్టుకొని నటించేలా వుంటాయి. 
           వీటిలో  చాల నాటకాలు అప్నాఘర్ పిల్లలు ప్రదర్శించారు.          
          "భారత్ అవార్డ్" ఎంతో ప్రతిష్టాత్మక మైనది. చిన్నారులలో సాహస వీరులకి ప్రభుత్వం అందించే ఈ అవార్డుని అందుకోవటం చాలా గొప్ప విషయం. ఈ పుస్తకం లో రచయిత్రి భారత దేశం లో సాహవీర బాలుల గురించిన వివరాలు చాల విపులంగా చెప్పారు. వారిలో మన తెలుగు వారి 13సం   అమ్మాయి ఇంకొకరి ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయింది. అలాగే మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు రక్షించిన హరీష్ చంద్ర వయసు 14 సం. అతని కధనం కుడా ఇందులో పొందు పరచారు రచయిత్రి.  ఎన్నో విషయాలు తెలియ చెప్పే ఈ పుస్తకం కుడా నిజంగా చిన్నారులకి మార్గదర్శి కూడా.  
              " విధి  నెదిరుస్తున్న వీధి బాలాలు పేద పిల్లలు - పుస్తకం పరమ పాఠనీయంగా తీర్చిదిద్దింది శోభా పెరిందేవి" అని ప్రశంసించారు డా. సి. నారాయణ రెడ్డి గారు. 
         "బాలలకు స్పూర్తిగా వుండటం కోసం నాటికలు రచించి ప్రచురించారు. ఇవి తల్లి తండ్రులకి కూడా స్పూర్తిదాయకం. ఒక మంచి గ్రంధాన్ని సమాజానికి అందిస్తున్న శోభా పెరిందేవిని మనసారా అభినందిస్తున్నా" అని అంటారు డా. బి. జయరాములు గారు తన ముందు మాటలో.  వీరు ఉస్మానియా యూనివెర్సిటి ఓరియంటల్ ఫ్యాకల్టీ ఇన్ చార్జ్ డ్ డీన్ గా పనిచేసి పదవి విరమణ చేసారు. 
         "ఈ పుస్తకం - అభినందన భవాని అప్నాఘర్ ఏర్పడడానికి గల కారణాలు, ఎన్ని కస్టాలు ఎదుర్కొంది, సంస్థలోని పిల్లలు, పిల్లల మనస్తత్వం అన్నీ కూడా చక్కగా వివరిస్తూ రచయిత్రి కొన్ని నాటికలను బాలలకి  స్తూర్తిదాయకంగా వుండేలా రచించారు. 
         డా. శోభా పెరిందేవి గారు రచయిత్రే కాదు ప్రముఖ సంఘ సేవకురాలు కుడా. వృద్దులకి అవసరమైన వారికి సేవ చేస్తూ ఇటు చిన్నారులకి కుడా  తన సేవలందిస్తున్నారు.   సంఘసేవకురాలే కాదు.   తమ తండ్రి గారు, అత్తగారు మామగారు, అన్నయ్యల పేరిట స్మారక బహుమతులూ ప్రతి ఏటా అందిస్తుంటారు.  ఈ పుస్తకం కినెగే లో కుడా దొరుకుతుంది.  kinegie.com  
          

-మణినాథ్ కోపల్లె
9703044410
         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి