యాత్రా స్థలాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
యాత్రా స్థలాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఆగస్టు 2017, గురువారం

శ్రీ రాఘవేంద్ర స్వామి


 శ్రీ  గురు రాఘవేంద్రాయ నమః 
                                         




  

పూజ్యాయ  రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయాచ!

భజతాం కల్ప వ్రుక్షాయ నమతాం కామదేనవే!!

మంత్రాలయం లో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు ఈ రోజుతో ముగిసాయి. హేవలంబి నామ సంవత్సరంలో రాయరు ఆరాధనలు 8 ఆగస్టు తారీకున స్వామి వారి పూర్వారాధన, 9 న మధ్యారాధన 10 తారీకున ఉత్తరాధన జరిగాయి. దేశ మంతా వున్న శ్రీ రాఘవేంద్ర స్వామీ వారి మఠాలలో అంగరంగ వైభవంగా జరిగాయి.
నగరంలోని బర్కత్ పురాలో ను, కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని రాఘవేంద్ర స్వామి మఠం లోనూ వైభంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జీవితం సంగ్రహంగా .....
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671) మధ్య కాలంలో జీవించారు. ద్వైత సిద్దాంత ప్రచారకులు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని ఆచరిం చారు.  రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకి రెండవ సంతానంగా 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామికి ఒక సోదరుడు (గురురాజ), సోదరి (వేంకటాంబ) ఉన్నారు.  
వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించారు.

వీరి శిష్యులు వీరిని ప్రహల్లద అవతారంగా భావిస్తారు మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు.
వీరు శ్రీ పంచ ముఖ ఆంజనేయ స్వామి  భక్తులు.  మూల రాముని పూజించేవారు. రాఘవెంద్రులు  పంచముఖిలో తపస్సు చేసారు, ఇక్కడ  హనుమంతుడు సాక్షాత్కరిం చాడు.  తమిళనాడు లోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించారు.   

  ఇతని శిష్యగణం వీరిని  ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.   ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు.. తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికులు  కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు.  మంత్రాలయంలో జీవసమాధి పొందారు. నిత్యమూ వేలాది మంది భక్తులు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతి గురువారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యెక పూజలు,అలంకార సేవ జరుగుతాయి. ఎక్కువ మంది భక్తులు గురువారం నాడు స్వామివారిని మంత్రాలయంలో దర్శించు కుంటారు.






1, ఆగస్టు 2017, మంగళవారం

త్రివేణి సంగమం సోమనాథ్ , గుజరాత్

త్రివేణి సంగమం , సోమనాథ్  గుజరాత్ 
అందరికీ  దీపావళి శుభా కాంక్షలు 
దీపావళి సందర్భంగా గుజరాత్ లోని సోమనాథ్ పట్టణం దగ్గరలో వున్న ఆలయ విశేషాలు గురించి ఫొటోలతో వివరించాలని పించింది. 

సాగరం లో కలిసే సంగమ ప్రదేశం సోమేశ్వరుడి ఆలయానికి  సమీపం లోనే వుంది. 
ఇక్కడ సాగరం లో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తున్నాయి.  ఈ సంగమ ప్రదేశానికి దగ్గరలో విష్ణుమూర్తి ఆలయాలు వున్నాయి. ముందుగా మనకి కనిపించేది శ్రీకృష్ణ మందిర్. ఇక్కడ మూలవిరాట్   శ్రీ కృష్ణుడు. ఆలయం బాగుంది. ఆలయంలో ఉయ్యాలలో శ్రీకృష్ణుడి ప్రతిమని వుంచి చక్కగా పూలతో అలంకరించి పూజలు, భజనలు చేస్తారు. ఈ అల్లయానికి పక్కనే బలరాముడి ఆలయం, ఆది శేషుడి ఆలయం, లక్ష్మి నారాయణ ఆలయాలు కుడా వున్నాయి.   ఈ ఆలయం విశాల ప్రాంగణం తో సంగమ నదీ తీరాన వుంది. సోమనాథ్ వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాలను కుడా దర్శిస్తారు. 




శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ సంగమం, సోమనాథ్ 

లక్ష్మీనారాయణ మూర్తులు 

త్రివేణి సంగమ ముఖద్వారం 

త్రివేణి సంగమం 


శ్రీ కృష్ణ 

అలంకారం తో శ్రీకృష్ణుడు ఊయలలూగుతూ 


నదీ తీరం , సంగమ  ప్రదేశం 

31, మే 2016, మంగళవారం

Hanumanji BirthPlace - Anjaneri Nasik

ఆంజనేయుడి జన్మస్థలం అంజనేరి ... 

 ఈ రోజు హనుమత్  జయంతి. 


M.S. సుబ్బలక్ష్మి పడిన  హనుమాన్  చాలీసా యు ట్యూబ్ లో )
(31  5 2016) వైశాఖ  మాసం లో వచ్చే   అంజనేయ స్వామి పుట్టిన రోజు.  ఈ  
సందర్భంగా  మహారాష్ట్ర లోని  నాసిక్ - త్రయంబకేశ్వర్ మార్గంలో  వున్న 
"అంజనేరి" అంటే  అంజనేయ స్వామి  పుట్టిన  ప్రదేశంగా  పిలువబడే పర్వత విశేషాలు 




అంజనేరి  పర్వతం పాదాల  వద్ద  ఆంజనేయస్వామి  గుడి 






Anjaneri Parwat & Temple
              

​ 

​ 

​అంజనేరి పర్వతం, కింద అంజనేయ స్వామి  ఆలయం

Lord  Hanuman



కొండమీద  జైన్  కల్చర్  లో ఒక   ఆలయం 
               

  

మహారాష్ట్ర లోని  నాసిక్  పట్టణం  యాత్రస్థలాలకి  ఎంతో  ప్రసిద్ధి  చెందింది.  

పవిత్ర గోదావరి పుట్టిన ప్రదేశం త్రయంబకేశ్వర్ నాసిక్ దగ్గరలోనే    వుంది. 
                  ఇక్కడ  ఎన్నో చూడ దగిన ప్రదేశాల్లో  నాసిక్  త్రయంబకేశ్వర్ మధ్య 
అంజనేరి అనే స్థలం ఎంతో  కూడా పవిత్రమైనది.   
అంజనేయ స్వామి పుట్టిన  ప్రదేశం "అంజనేరి: అని మన పురాణాలు  చెబుతున్నాయి.
పవనుడు అంజనీ దేవిల  పుత్రుడే మన హనుమంతుడు. తల్లి పేరుమీద  
అంజనేరి అనే పేరు వచ్చిందంటారు.  ఆంజనేయుడు చిన్నతనమంతా 
ఇక్కడే గడిపాడట.
             చుట్టూ అందమైన ప్రదేశం, కొండలు గోదావరి పుట్టిన  ప్రదేశం 
ఇవన్నీ ఈ ప్రాంతానికి  ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. ఇక్కడి పడమటి కనుమల్లో 
(western Ghats)     సముద్ర మట్టానికి 4264  అడుగుల ఎత్తులో  వున్న కొండమీద 
అంజనేరి ఫోర్ట్ కోట వుంది. మూడు కొండలు ఎక్కి దిగి వెళ్తే అంజనేయుడు జన్మించిన
 ప్రదేశం  వస్తుంది. ఈ ప్రదేశంలో ఒక చిన్న ఆలయం, అందులో అంజనాదేవి 
ఒడిలో బాల అంజనేయ స్వామి ఉన్నట్లుగా ఉన్న విగ్రహం కనిపిస్తుంది.  ఎక్కువగా 
అంజనేయ స్వామీ  భక్తులు ఈ ప్రదేశం చేరుకునే వారు. హనుమాన్ చాలీసా 
చదువుతూ ఎక్కుతారు.  కాని చాలా కొద్ది మంది  మాత్రమే  ఈ కొండపైకి చేరుకోగలరు.  
 ఈ కొండకి వెళ్ళే దారిలో మైదానాలు, జలపాతాలు, సన్నని దారులూ, ఎక్కడానికి  మెట్లు కనిపిస్తాయి.  జలపాతాలు  మెట్ల పైనుంచి  కూడా ప్రవహిస్తుంటాయి కొండపైన ఒక లేక్ వుంది. దారిలో కనిపించే  వింత జలపాతం అంటే కింద నుంచి పైకి పడే రివర్స్ వాటర్ ఫాల్స్ వున్నాయి. 
రివర్స్ లో   వాటర్ ఫాల్స్ 


ఇక్కడ కొండలు  ట్రెక్కింగ్ కి అనువుగా వుంటాయి. అందుకే ఎంతో మంది ఇక్కడ   
ట్రెక్కింగ్  కాంప్ లు నిర్వహిస్తుంటారు.  ఇక్కడ వున్న ఒక కొండ  నిట్టనిలువు గా   
"థమ్స్ అప్" లా150 అడుగుల ఎత్తులో వుంటుంది. అది ఎక్కడం  చాలా కష్టం. 
ఇలా కోసుగా నిలువుగా వుండే రెండు కొండల శిఖరాలను  నవర & నవేరి 
(Navara & Naveri) అంటారు.   అయినా  సాహసకులు ఎక్కుతుంటారు. 108  
జైన్ గుహలు, జైన్ ఆలయాలు ఈ కొండల్లో వున్నాయి. ఇక్కడి గుహలలో అందమైన  
శిల్పాలు  చెక్కి వుంటాయి. అవి జైన్ సంప్రదాయానికి  చెందినవిగా భావిస్తుంటారు. 
అక్కడే సీతాదేవి గుహ కూడా  వుంది. కొండ ఎక్కిన వారు అక్కడ విశ్రాంతి 
తీసుకోవడానికి వీలుగా వుంటుంది.  ఫోర్ట్ కు  వెళ్ళే దారిలో అంజనేరి గ్రామం  
వస్తుంది. 


        దారిలో అంజనేరి పాదాల దగ్గర  హనుమంతుడి మందిరం వుంది. 
అందులో పెద్ద హనుమంతుడి విగ్రహం ధ్యాన ముద్రలో వుంది.  కొండపైకి వెళ్ళే 
దారిలో అంజనీ దేవి ఆలయం వుంది.  అందరూ పర్వతం  పైకి చేరుకోలేని 
వారు కిందనుంచే స్వామిని దర్శించు కుంటారు. నాసిక్ నుంచి 20 కి,మీ, దూరంలో
రహదారి పైనే  ఈ  విగ్రహం  వుంది. 

జ్యోతిర్లింగాలలో  ఒకటైన  త్రయంబకేశ్వర్ నుంచి  నాసిక్  వెడుతుంటే  ఈ  కొండ 
వస్తుంది.  అక్కడి  ప్రాంత  ప్రజలు  అంజనేయ స్వామి  ఇక్కడే  జన్మించినట్లు 
ప్రగాడంగా  విశ్వ సిస్తారు. 
ఈ కొండ పైకి  వెళ్ళాక ఆలయంలో  అంజనా దేవి  ఒడిలో  పసిపాపలా 
అంజనేయ స్వామి  వున్నట్లుగా విగ్రహం  వుంటుంది.  
(భారత  దేశంలో అంజనేయ స్వామి జన్మించిన  ప్రదేశాలపై  
భిన్నాభిప్రాయాలున్నాయి.  వాటిల్లో  ఒకటి  అయిన   నాసిక్ (మహారాష్ట్రా)లోని 
అంజనేరి గురించి ఈనాటి  భక్తి పేజిలో)

 (మేము   త్రయంబకేశ్వర్ లో  దిగిన శ్రీ గజానన మహారాజ్ సంస్థాన్  ఆశ్రమం  నుంచి  
నేను తీసిన photo లలో నాకు కొన్ని కొండల శ్రేణి చూస్తుంటే నాకు పడుకుని  వున్న 
హనుమంతుడే కనిపించాడు. ఆంజనేయుడి వాహనం ఒంటె లనూ కనిపించింది.  అవి సరదాగా మీరూ  చూడండి)
                                                                     

               త్రయంబకేశ్వర్ గజానన్ మహారాజ్ సంస్థాన్ లో నుంచి  తీసిన ఫోటో   .....                                                                                     
అంజ నేయుడి నుదురు, ముక్కు, దవడలు ముఖం పక్కనుంచి (సైడ్ ) నుంచి  
అలా కనిపించింది .  
       


                                  హనుమంతుడి వాహనం ఒంటెలా లేదూ!
 (ఈ కొండనే స్ట్రెయిట్ గా వుండి ట్రెక్కింగ్ చేస్తారు అంతా ... చాలా కష్టం ఎక్కడం ... )

13, మార్చి 2016, ఆదివారం

శ్రీ సిద్దేస్వార్ మహాదేవ మందిర్, ద్వారక, గుజరాత్

శ్రీ సిద్దేశ్వర్  మహాదేవ్  మందిర్ ద్వారక , గుజరాత్
       

               ఈరోజు మహా శివరాత్రి.  ఈ సందర్భం గా శ్రీ సిద్దేస్వర్ మహాదేవ్ గురించిన విశేషాలు. 
మనం శివాలయాలు అని అన్నట్లే  మేము వెళ్ళిన  గుజరాత్ లోని శివాలయాలను  సిద్దేస్వర్ మహదేవ్ గా పిలుస్తారని పించింది.  మాతృ గయలోనూ  సిద్దేస్వర్  ఆలయం స్వయం భూ శివలింగం వుంది. ద్వారక లోనూ సిద్దేస్వర్ మహాదేవ ఆలయం వుంది. నేను వివరించే ఆలయం ద్వారకా పట్టణం లో వున్న  సిదేస్వర్  ఆలయం గురించి.
              శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్  ద్వారకా నగరం గుజరాత్  లో  వుంది.  ఇక్కడి లింగం   స్వయం భూ లింగం ఇది. ద్వారకాదీసుడైన  శ్రీ కృష్ణుడిని  దర్శించిన  అనంతరం  పట్టణంలో  వున్న ఇతర దర్శనీయ  ప్రదేశాలు,  ఆలయాలలో  శ్రీ సిద్దేస్వర్  మహాదేవ   మందిర్  ఒకటి.  ఇది  చాలా పురాతన మైన  ఆలయం.  ఆలయ  ప్రాంగణంలో అడుగిడగానే పెద్ద బావి, భూతనాథ్ ఆలయం,  కనిపిస్తాయి. ఈ బావికి సావిత్రి  బావి అని పేరు.
     

 ఇక్కడ లింగానికి  అభిషేకాదులు స్వయంగా మనమే  చేసుకోవచ్చు.  విశాలమైన ప్రాంగణం . ప్రవేశ ద్వారం  నుంచి ఆలయానికి  వెళ్ళే దారి  అంతా  సాధువులు కాషాయ వస్త్ర ధారణతో, పొడుగాటి  జడలు, ముడులతో హర హర మహా దేవ్  అంటూ  వచ్చే  వారిని బిక్ష   అడుగుతూ  కనిపించారు  మాకు.  

 
​​
 ఈ  ఆలయం  చుట్టూ  కూడా చాలా  ఆలయాలున్నాయి.  వాటిల్లో  మారుతి  మందిర్,  విగ్రహ పూజ కనిపించని  ఇతర పురాతన  ఆలయాలు.  వున్నాయి.
ఈ ఆలయం  దర్శించ టానికి  కొద్ది మందే వస్తుంటారు. రష్  వుండదు.  టికెట్స్  వుండవు.  ప్రశాంత  వాతావరణం.  
            ద్వారకలో  ప్రధాన  ఆలయం  శ్రీకృష్ణ  మందిరం.  చుట్టు పక్కల కూడా ద్వారకా దీసునికి  సంబందినిన  ఆలయాలే  వున్నాయి.  బెట్  ద్వారక,  రుక్మిణి మందిర్,  మూల ద్వారక, బాలకా తీర్థ్,  లక్ష్మి నారాయణ్  టెంపుల్, ఇలా ఎన్నో  వున్నాయి. 
         ద్వారకా పట్టణం లో  వున్న సన్ సెట్  పాయింట్, సిద్దేశ్వర్  మహాదేవ  మందిర్,  భడకేశ్వర్ మందిర్, గీతా మందిర్, లక్ష్మి నారాయణ్  మందిర్, ఇలాటి ఆలయాలు కూడా  ప్రసిద్ధి   చెందాయి.  వీటిని  దర్శించే  వారు  కొద్ది  మందే!  ద్వారకా పట్టణం  నుంచి  లోకల్  ఆటోలు  నగర దర్శనం 200 రూపాయలతో  చూపిస్తారు.  బస్ లు  వున్నా అవి అన్ని  పాయింట్స్   కవర్  చేయవు.
గుజరాత్ లోనే  వున్నా సిద్దాపూర్ లోని  (మాతృగయ) photo ఇది.
సిద్దేశ్వర్ మహాదేవ మందిర్ , మాతృ గయ, గుజరాత్  

ఈ పురాతన ద్వారకా సిద్దేస్వర్  మహాదేవ ఆలయం గురించిన స్థల వివరాలు  ఏమి లభ్యం  కాలేదు.

8, ఫిబ్రవరి 2016, సోమవారం

bet dwaraka బెట్ ద్వారక , గుజరాత్

  
బెట్ ద్వారక  (BET DWARAKA)
పురాతనమైన ఆలయం - శ్రీ కృష్ణుడు నివసించిన రాజప్రాసాదం  
ద్వారకా మహత్యం గురించి స్కంద పురాణంలో ఏడవ ప్రభాస కాండం  .లో   వివరంగా చెప్పారు.  ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడు నివసించిన ప్రదేశం బెట్ ద్వారక.  ఆ స్థల విశేషాలు.....  
బెట్ ద్వారక  ఒక  చిన్న ద్వీపం.  
ద్వారకా పట్టణానికి ఉత్తరంగా, ముఫై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున  ఓకా పట్టణం  వుంది.  అక్కడి నుంచి  ఫెర్రీ ల ద్వారా   బెట్  ద్వారకా   చేరుకోవచ్చు.  బెట్  ద్వారక అంటే  శ్రీ కృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుదాముడు (కుచేలుడు) బెట్ అంటే  బహుమతిని ఇచ్చిన ప్రదేశం అని.  పేదవాడైన కుచేలుడు గుప్పెడు అటుకులని శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించినది,  కుచేలుడి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించిన ప్రదేశం  ఇక్కడే...  బెట్  ద్వారక శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో  పరివారం తో నివసించిన ప్రదేశమని కూడా. గోమతి  ద్వారకా పట్టణం లో శ్రీకృష్ణుడు తన దర్బారుని  నడిపించాడని రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని అంటారు. ఇది  చాలా పవిత్రమైన ప్రదేశం. 
            అలనాడు శ్రీ కృష్ణుడి నిర్యాణానంతరం అసలైన ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోగా మిగిలిన చిన్న భూభాగమే  ఈ బెట్ ద్వారక.  ప్రధాన ఆలయమైన ద్వారక లో వున్న ద్వారకాధీశుడి విగ్రహం లాగానే ఈ బెట్ ద్వారకా లో కుడా ఉంటుంది.  ఈ రెండు విగ్రహాలాలో  చేతిలోని గద ధారణలో మాత్రం మార్పు వుంటుంది.  సైజు లో కూదా కొంచెం చిన్నగా  వుంటుంది విగ్రహం. 
     శ్రీ కృష్ణుడి భక్తుడైన వల్లభాచార్య   దీన్ని నిర్మించినట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి తో పాటు  ఆలయం లో ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు,   దేవకీ ఆలయాలు వున్నాయి.  ఉత్తర, దక్షిణ  దిశలో గరుడుడి ఆలయం ఉంది.  కృష్ణుడి ఆలయం సమీపంలో,  తూర్పున  సాక్షి గోపాలుడి ఉత్తరాన రుక్మిణి, రాదా దేవి  ఆలయాలు, జాంబవతిమొదలైన  మూర్తుల ఆలయాలు కూడా వున్నాయి. 
ఇక్కడ చాలా మంది భక్తులు  గోధుమపిండి, ఇతర ఆహారపదార్ధాలు దానంగా ఇస్తారు.  బెట్ ద్వారక  ఆలయంలో మధ్యాహ్నం 1 గంటకి మహా ప్రసాదం గా    భక్తులకి భోజనం పెడతారు 
    బియ్యం పళ్ళెంలో  దక్షిణ పెడితే  కొంచెం బియ్యం చేతిలో  ప్రసాదం గా ఇస్తారు.  ఆ బియ్యాన్ని ఇంట్లోని  బియ్యం లో కలుపుకోమని చెబుతారు.  బియ్యాన్ని ప్రసాదం గా ఇవ్వటం ఇక్కడే కనిపించింది.
ఇక్కడ పెద్ద గోశాల కూడా  వుంది.

బెత  ద్వారకా  ఒడ్డు 
భౌగోళికంగా ....
 బెట్ ద్వారక పురాణాల కాలం నుంచీ ఎంతో ప్రసిద్ది చెందింది.  ప్రస్తుత యుగం లో ఆ స్థల ప్రాశస్త్యాన్ని గురించి అనేక పరిశోధనలు జరిగాయి... జరుగుతున్నాయి.
ఈ అతి ప్రతి ప్రాచీనమైన బెట్ ద్వారకాలో పురా వస్తు  శాఖ వారు,  నిర్మాణ  శాస్త్ర  నిపుణుల బృందాల పరిశోధనా ఫలితాల ద్వారా  ఈ బెట్ ద్వారకలో వాణిజ్య వ్యాపారాలు విస్తృతంగా జరిగేవని తెలిసాయి.  ఇక్కడ లభించిన మృణ్మయ పాత్రలు, నాణేలు, రాగి చేపల గాలాలు,  రాతి లంగర్లు, హరప్పన్ ల కాలం నాటి మట్టి పాత్రలు పాత్రలు  ఇంకా ఇతర పాత్రలు లభించాయి.  అంతే కాదు ఈ బెట్ ద్వారక ద్వీపం, దాని చుట్టు పక్కల ప్రదేశాలు  సముద్ర తీవ్రత మూలంగా భూమి ఊచకోతకు గురయింది. 
ఇక్కడ  లభించిన రక రకాలైన రాతి లంగర్లు అక్కడ లభించే రాళ్ళతో చేసినట్లు తెలుస్తోంది.  లబించిన  సత్తు బిళ్ళలు, సత్తు లంగర్లు, ఇంకా లభించిన  నౌకా  అవశేషాలను బట్టి అక్కడ రోమన్  వ్యాపార సంబంధాలు తెలియ జేస్తున్నాయి.    బెట్ ద్వారక పురాతనమైన,  ప్రధానమైన రేవు పట్టణం అని తెలుస్తోంది.  ఈ బలమైన రాతి లంగర్ల వాళ్ళ నౌకలు కొట్టుకు పోకుండా ఆపేవి. అత్తర్లు, ద్రాక్షరసం వంటి వ్యాపారాలు క్రీ.పూ.4 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4 వ. శతాబ్దం వరకూ కూదా విస్తృతంగా జరిగేవని అక్కడ లభించిన సీలు వేసిన కూజాలు, నౌకా అవశేషాలు చూస్తె  తెలుస్తుంది .  
ఒడ్డున దిగాక  ఈ  చిన్న  బ్రిడ్జి  మీదుగా  బేట్ ద్వారకా  చేరుకోవాలి.  
ద్వారకా నగరం లోని జామ్ నగర్ జిల్లాలో  సముద్ర మట్టం లో వుంది. ఇక్కడికి రాజ్ కోట్  వరకు  కాని, అహ్మదాబాద్ వరకు కాని రైల్ లో వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ద్వారక చేరుకోవచ్చు.  ద్వారక నుంచి రానూ పోనూ మాట్లాడుకుని  ప్రైవేట్ వాహనాల ద్వారా ఒఖా చేరుకోవచ్చు.  అక్కడినుంచి సముద్రంలో ప్రయాణించి బెట్ ద్వారక చేరుకోవచ్చు.  ఈ ఆలయం సముద్రమట్టానికి కొద్దిగా ఎత్తులో గుట్ట మీద వుంటుంది.

 

మా అనుభవం :
ద్వారకా నగరి  నుండి మేము చుట్టుపక్కల ప్రదేశాలు చూడటానికి పది మంది అక్కడి లోకల్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లో బయలు దేరి ముందుగా గోపితలాబ్, నాగేశ్వర్ చూసి, బెట్ ద్వారక చేరుకున్నాము. రోడ్డు మీద నుంచి  10 ని. నడిచాక సముద్రపు పడవలు వుండే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ 20 ని.లు వెయిట్  చేసాక ఆవలి ఒడ్డున వున్న బెట్ ద్వారక ద్వీపానికి ఫెర్రీ లో చేరుకున్నాము. 
నడి సంద్రం లో నావ 
ఇక్కడ సముద్రం మీద ఎగిరే పక్షులు యాత్రికులని ఆహ్లాద పరుస్తాయి.  ఒక్కో ఫెర్రీ లో వంద మంది పైగా వుంటారు.  ఫెర్రీ లు కూదా ఒక పద్ధతిలో ఒకదాని వెంట ఒకటి వెడతాయి.  ఖాళి అని ఎవరూ వేరే వాటిల్లో  ఎక్కరు.  బోటు నెం. చెబితే అందులోనే  ఎక్కాలి.  ఎక్కే ముందు   తోపులాట జరిగింది. అందరికీ ఆత్రమే... ఎక్కాలని.   ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా కింద నీళ్ళలో  పడిపోటాము. పట్టుకోడానికి ఏమి వుండవు.  రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా బోటు మాట్లాడుకుని ఎక్కువ పే చేసి మా గ్రూప్ మాత్రమే ఎక్కి  వచ్చాము. 
మేము ఓకా రేవు మీదుగా సముద్రంలో బెట్ ద్వారక  వెళ్ళినపుడు నౌకలు, ఫెర్రీలు, బోటు లు చాల కనిపించాయి. 
చాలా మంది బోటు ఎక్కే ముందు మరుమరాల  పాకెట్ లు కొన్నారు. బోటు బయలు దేరాక ఎక్కడి నుంచో సముద్ర పక్షులు, కొంగలు మాతో పాటు వచ్చాయి.  అందరూ తమ వద్ద నున్న మరుమరాలు వేస్తుంటే అవి కింద పడకుండా క్యాచ్ పట్టుకుంటున్నాయి.  15 ని. జరిగిన సముద్ర  ప్రయాణంలో అవి అక్కడ ప్రయాణించే ఇతర ఫెర్రీ ల వద్దకు తిరుగుతూ ఆహ్లాదాన్ని  పంచాయి. 
ఫెర్రీ  దిగగానే  చిన్న పాతకాలపు  బ్రిడ్జి మీదుగా నడుచుకుంటూ  ఆలయం  చేరుకోవాలని  బయలు  దేరాం .  కాని  అక్కడ  నడవలేని  వారి కోసం  తోపుడు  బళ్ళ లాటి  బల్ల  మీద 4ని  ఎక్కించుకుని  ఆలయానికి తీసుకెడుతున్నారు. మాతో  పాటు  వచ్చిన  మా గ్రూప్  వారు  ఆ బళ్ల  మీద వెళ్ళారు.  మేము  నడుచుకుంటూ  బ్రిడ్జిని  5 ని  దాటేసి  నడుస్తుంటే  అక్కడ షేర్  ఆటోలు   కనిపించాయి .  మేము  అవి ఎక్కి  ఆలయం  దగ్గర దిగాము.  రోడ్డ్లు  మాత్రం  చాలా  ఇరుకుగా  వున్నాయి.  తిరిగి   వచ్చేటప్పుడు వన్ వే అవటంతో  ఆ చిన్న  కొండ చుట్టూ  తిరిగి రేవుకి వఛాము.  దారి పొడుగునా  చిన్న చిన్న  దుకాణాలు వున్నాయి.  విగ్రహాలు, పూసలదండలు, ఇంకా అనేక వస్తువులు  యాత్రికులని ఆకర్షించేవి అమ్ముతున్నారు. 
ఈ సారి మేము స్పెషల్ బోటు  లో  కొద్ది మందిమి మాత్రమే తిరిగి బయలుదేరి ఒఖా  రేవు తీరం  చెరుకున్నాము. 
మేము తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయం కావటంతో సముద్రం మీదనుంచి  సూర్య బింబం లేలేత ఎరుపు రంగులో కనువిందు చేసింది. 
మా బెట్ ద్వారకా యాత్ర ఒక మరపురాని అనుభవం .... 



పడవ లంగరు  లోంచి  సూర్యుడు 
సూర్యాస్తమయ వేళ    బారులు  తీరిన  పడవలు 



8, డిసెంబర్ 2015, మంగళవారం

భడకేశ్వర్ మహదేవ్ ఆలయం.ద్వారక గుజరాత్

భడకేశ్వర్ మహదేవ్ ఆలయం.ద్వారక  గుజరాత్

భడ్కేశ్వర్ర్  

ఆలయానికి  దారి 




ఆలయం చుట్టూ సంద్రమే 

ద్వారకా దీశుడి  దర్శనానంతరం ద్వారకలో చూడవలసిన మరొక ఆలయం భడ్కేశ్వర్ మందిర్.  ఈ ఆలయం సముద్రం లో  వుంది. ద్వారకా బీచ్  ఒడ్డున  కొద్దిగా మెట్లు దిగి, ఎక్కితే  చిన్న  గుట్ట మీద ఈ ఆలయం వుంది. శివలింగం చిన్నదిగా వుంటుంది.  ఇక్కడి శివుని చంద్ర మౌళీశ్వరుడిగా పిలుస్తారు. శివరాత్రికి, ఇక్కడ విశేష పూజలు చేస్తారు. సూర్యాస్తమయం ఇక్కడి నుంచి చూస్తుంటే  చాలా అద్భుతం గా వుంటుంది.  సముద్రపు    అలలు  ఎక్కువై నపుడు ఆలయం చుట్టూ నీళ్ళే ! ఆలయం చేరుకోవడం కష్టం. మేము వెళ్ళినపుడు అలలు తక్కువగా వున్నాయి.  
స్థలపురాణ విశేషాలు మాత్రం తెలియరాలేదు.

కాని గోమతి నది సాగర సంగమ ప్రాంతంలో ఈ శివలింగం దొరికిందని, సద్గురు ఆదిశంకరాచార్యులు ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు.
సముద్రంలో వున్న ఈ బీచ్ ఒడ్డునే గీతా మందిర్ వుంది.  

గీత మందిర్  కృష్ణార్జునులు 

బిర్లా వారి గెస్ట్  హౌస్ 


ఈ బీచ్ ఒడ్డునే గీతా మందిర్, వుంది.  
గీత మందిర్ ద్వారకా నగరానికి సముద్రానికి పశ్చిమ తీరాన వున్న భడకేశ్వర్ మందిరాని కి దగ్గరలోనే వుంది .
ఈ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త లైన బిర్లా వారిచే 1970 లో నిర్మించారు. ఈ ఆలయం అంతా మార్బల్ రాళ్ళ తో నిర్మించారు. ఎంతో అందంగా వుండే ఈఆలయం కృష్ణార్జునుల విగ్రహాలు ఎంతో కళాత్మకంగా కళగా వుంటాయి. భగవత్ గీతను అర్జనునికి బోధిస్తున్నట్లు వుంతాయి. ఈ మందిరం లోపల విశాలమైన హాలు, హాలు చుట్టూ గోడలకి భగవత్ గీత శ్లోకాలు వుంటాయి. అంటీ కాదు ఈ మందిరం విశేషం హాలు లోపలి సీలింగ్ నుంచి రీసౌండ్ వస్తుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడ బిర్లా వారి విశ్రాంతి గదులు లభిస్తాయి.
ప్రశాంత మైన వాతావరణం లో ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఎంతో బాగుంటుంది.


23, నవంబర్ 2015, సోమవారం

నాగేశ్వర్, ద్వారక గుజరాత్

నాగేశం. ద్వారక, గుజరాత్  
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మరో జ్యోతిర్లింగం.





ఈ జ్యోతిర్లింగం కుడా గుజరాత్  లో,  ద్వారకా  పట్టణానికి దగ్గరలో వుంది.  
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాలమోంకారే పరమేశ్వరమ్ ||
కేదారం హిమవత్ప్రుష్ఠే డాకిన్యాం భీమశంకామ్ |
వారాణస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ||
వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే |
సేతుబంధే చ రామేశం ఘశ్మేశంచ శివాలయే ||
ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తస్సర్వ సిద్ధిఫలం లభేత్ ||


నాగేశం  దారుకావనే  - నాగేశ్వరుడు.

  అమర్తసంజ్నే నగరేచ రంయే, విభూశితంగం వివిధైశ్చ భోగైహి
సాధ్భుక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీ నాగానాతం శరణం ప్రపద్యే||
 గుజరాత్  రాష్ట్రంలో ద్వారకా నగరానికి పదిహేడు కి.మీ. దూరంలో ఉన్న ఈ మహా జ్యోతిర్లింగం పదవది. దారుకుడు అనే రాక్షసుడి బారి నుంచి మహా భక్తుడైన సుప్రియుడిని రక్షించాడు ఆ పరమ శివుడు.
శివపురాణంలో  ఈ నాగేశ్వర్ గురించిన కధ మరింత వివరంగా వుంది.   ఈ దారుకా వనంలో  దారుకుడు, దారుకి  అనే రాక్షస దంపతులు వుండేవారు. దారుకుడు పరమ శివుడి భక్తుడు. వారు ఎక్కడ వుంటే వారున్న వనం కూడా వారితో పాటే వుంటుందని వారం కుడా వుంది. అయితే దారుకుడు గర్వంతో ఆ అడవిలో వుండే  ఋషి వాటికలను, యజ్ఞాలను  ధ్వంసం చేస్తూ...  ఋషులను, అడవిలో  వచ్చే వారినందరినీ హింసిస్తూ వుండేవాడు. వారంతా అడవిలో వున్న ప్రసిద్దుడైన మహర్షి ఔరకుడు (Ourava)కి మొర పెట్టుకున్నారు. ఈ మహర్షి చవనుడు, మనువు కుమార్తె అయిన అరుషిల పుత్రుడు. ఆయన దారుకుని దంపతులకి శాపం ఇచ్చాడుట. ఈయన దారుకుడు భూమి మీద ఎవరినైనా హింసిస్తే, వారు మరణిస్తారని శాపం ఇచ్చాడు, అందుకే వారు సముద్రంలో నివసిస్తూ (వారితో పాటు అడవి కూదా ), సముద్రంలో ప్రయాణించే వారిని హింసించే వారుట.  అలా ఒకసారి వ్యాపారి అయిన సుప్రియుడు అనే వైశ్యుడు వారి చేత చిక్కాడుట.  దారుకుడు పెట్టె బాధలు భరించలేక సుప్రియుడు  శివుని శరణు వేడగా,  శివుడు సుప్రియునికి తన పాసుపతాస్త్రాన్ని ఇచ్చాడని, ఆ అస్త్రంతో సుప్రియుడు ఆ దారుకుడిని, మిగతా రాక్షసులని  సంహరించాడు. అలా సుప్రియుడు పూజించి, అర్చించిన శివలింగమే  ఈ నాగేశ్వర్.

ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు పూజించాడని అంటారు.
నాగేశ్వర్ ద్వారకా నగరానికి, బేట్ ద్వారకాకి మధ్య మైదానంలో వుంది.  
ఇక్కడ వున్న శివలింగం అన్ని చోట్లా వున్నట్లు నున్నగా వుండదు. ద్వారకాశిలతో చేయబడింది. చిన్న చిన్న చక్రాలు వుంటాయి లింగం మీద. అంతే కాదు మూడు ముఖాల రుద్రాక్షాలు వున్నట్లు వుంటుంది ఈ లింగం.
ఇక్కడ ఆలయ ఆవరణలో చిన్న నీటి గంగాళం వంటి పాత్రలో ఒక రాయి తేలుతూ వుంటుంది. ఈ రాయి హనుమంతుడు లంకకు వేసిన వారధి లోని రాయిగా చెబుతారు.

    ఈ ఆలయంలో భక్తులు జంట నాగులని భక్తితో సమర్పిస్తారు. నాగేశ్వర్  అంటేనే నాగుపాము అని. అవి ఆభరణాలుగా ధరించిన శివుడు నాగేశ్వరుడుగా కొలుస్తారు.  నాగేశ్వర్ ఆలయంలోని అమ్మవారిని నాగేశ్వరిగా పిలుస్తారు.  
        ఈ ఆలయం లో నందీశ్వరుడు తూర్పు దిక్కుని చూస్తూ వుంటే, శివుడు దక్షిణ దిక్కుని చూస్తూ వుంటాడు.  నలమహారాజు  ఇక్కడి శివలింగాన్ని పూజించటం వల్ల  చక్రవర్తి అయ్యాడని కూడా అంటారు.
విశాలమైన ఆవరణలో ఎత్తైన  శివుడి విగ్రహం  వుంది. ఆలయ ఆవరణ లో చెట్టుకింద శనేశ్వరుడు వున్నాడు. అక్కడ భక్తులు తిలాభిషేకం చేస్తారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని కూల్చివేయాలని అనుకున్నాడుట. ఈ ఆలయాన్ని ద్వంశం చేస్తుండగా వేలాది తేనెటీగల గుంపు వారిపై దాడి చేసిందిట. అప్పటికే సగం కూల్చిన ఆలయాన్ని వదిలివేసి వెనక్కి తిరిగి వెళ్లారు. ఆ తరువాత ఆలయాన్ని భక్తులు తిరిగి నిర్మించారు.
ప్రస్తుతమున్న ఈ ఆలయాన్ని T-సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత శ్రీ గుల్షన్ కుమార్ మరణానంతరం వారి కుటుంబ సభ్యులు రెండు కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక్కడ ఆకర్షనీయమైనది 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు తో వున్న శివుని విగ్రహం. మూడు కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది.
ఈ ఆలయం లోపలే విశాలమైన హాలు గుండా ప్రవేశించి స్వామి దర్శనానికి వెడుతుంటేనే బల్లలపై ఆకర్షణీయమైన వస్తువులు, లింగాలు, వస్తువులు, పూజా సామాగ్రి, నాగుపాముల ప్రతిమలు, కొబ్బరికాయలు వంటి వస్తువులు అమ్ముతుంటారు. ఒకరకమైన చిన్నపాటి షాపింగ్ సెంటర్ ఇది.
అరేబియన్ సముద్ర తీరాన గుజరాత్ రాష్ట్రంలో వున్న నాగేశ్వర్ పుణ్య క్షేత్రం భక్తులతో నిత్యమూ అలరారుతూ వుంటుంది.  భక్తులు స్వయం గా అభిషేకాలు చేసుకోవచ్చు.
శనేశ్వరుడు 
ద్వారకకి వచ్చే భక్తులు ఆ ద్వారకాదీసునితో పాటు  ఇక్కడికి వచ్చిఈ  పరమేశ్వరుని దర్శించుకుంటారు. నాగేశ్వర జ్యోతిర్లింగం మన భారత దేశంలో రెండు చోట్ల వుందని ఆయా భక్తుల నమ్మకం. 
1. హిమాలయాలలోని అల్మోరాకు దగ్గరలో వున్న జాగేశ్వర క్షేత్రం
2 గుజరాత్ లోని నాగేశ్వర్ అసలైన జ్యోతిర్లింగం అని కుడా అంటారు.  
ఉత్తరాఖండ్ లోని జాగేస్వర్ ఆలయం ఆల్మోరా ప్రాంతంలో వుంది. అల్మోరా ప్రాంత మంతా దారు వృక్షాలతో నిండి వుంది. ఇక్కడ కూడా ప్రసిద్ధమైన పురాతనమైన శివాలయం వుంది. అసలైన జ్యోతిర్లింగం విషయం లో భిన్నాభిప్రాయాలున్నాయి.
మేము చూసిన నాగేశ్వర్, ద్వారక, గుజరాత్ లో వున్న ఆలయ విశేషాలు ఇవి.....
ఏది ఏమైనా విశిష్టమైన ఈ శివాలయం భక్తులని విశేషం గా ఆకర్షి స్తోంది.
ద్వారకనుండి  గోపితలాబ్   అనే గ్రామం  వెళ్ళే  బస్సులో  వెళ్లి ఈ  జ్యోతిర్లింగమును  దర్శించవచ్చు. ప్రైవేటు వాహనాల్లో అయితే చుట్టుపక్కల 
మరి కొన్ని ప్రదేశాలు చూడవచ్చు.

నాగేశ్వర్, నాగనాధ్ ,  ద్వారక,  గుజరాత్