10, ఆగస్టు 2017, గురువారం

శ్రీ రాఘవేంద్ర స్వామి


 శ్రీ  గురు రాఘవేంద్రాయ నమః 
                                         




  

పూజ్యాయ  రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయాచ!

భజతాం కల్ప వ్రుక్షాయ నమతాం కామదేనవే!!

మంత్రాలయం లో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు ఈ రోజుతో ముగిసాయి. హేవలంబి నామ సంవత్సరంలో రాయరు ఆరాధనలు 8 ఆగస్టు తారీకున స్వామి వారి పూర్వారాధన, 9 న మధ్యారాధన 10 తారీకున ఉత్తరాధన జరిగాయి. దేశ మంతా వున్న శ్రీ రాఘవేంద్ర స్వామీ వారి మఠాలలో అంగరంగ వైభవంగా జరిగాయి.
నగరంలోని బర్కత్ పురాలో ను, కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని రాఘవేంద్ర స్వామి మఠం లోనూ వైభంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జీవితం సంగ్రహంగా .....
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671) మధ్య కాలంలో జీవించారు. ద్వైత సిద్దాంత ప్రచారకులు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని ఆచరిం చారు.  రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకి రెండవ సంతానంగా 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామికి ఒక సోదరుడు (గురురాజ), సోదరి (వేంకటాంబ) ఉన్నారు.  
వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించారు.

వీరి శిష్యులు వీరిని ప్రహల్లద అవతారంగా భావిస్తారు మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు.
వీరు శ్రీ పంచ ముఖ ఆంజనేయ స్వామి  భక్తులు.  మూల రాముని పూజించేవారు. రాఘవెంద్రులు  పంచముఖిలో తపస్సు చేసారు, ఇక్కడ  హనుమంతుడు సాక్షాత్కరిం చాడు.  తమిళనాడు లోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించారు.   

  ఇతని శిష్యగణం వీరిని  ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.   ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు.. తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికులు  కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు.  మంత్రాలయంలో జీవసమాధి పొందారు. నిత్యమూ వేలాది మంది భక్తులు మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతి గురువారం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యెక పూజలు,అలంకార సేవ జరుగుతాయి. ఎక్కువ మంది భక్తులు గురువారం నాడు స్వామివారిని మంత్రాలయంలో దర్శించు కుంటారు.






7, ఆగస్టు 2017, సోమవారం

సాధన

సాధన హిందీనటి శుక్రవారం కనుమూసారు 


ముంబై  సిని  ప్రపంచం లో అలనాటి అందమైన హీరోయిన్ సాధన     25 12 20 15న  కనుముసారు. 
వారికి  చిరు నివాళి ... 
"వో కౌన్ ధీ?" సినిమాతో అందరి మనసులు దోచుకున్న సాధన 74 ఏళ్ల వయసులో ముంబై లో   కనుమూశారు. 
తోలి సినిమా  "శ్రీ 420" -  రాజకపూర్  చిత్రం లో ఒక డాన్స్ లో చిన్న పాత్రలో నటించారు.     హిట్ సినిమాలలో "హమ్ దోనో", "వో కౌన్ ధీ?" లో పాటలు సూపర్  హిట్ అయ్యాయి.   వీరు నటించిన   "లవ్  ఇన్  సిమ్లా", "ఎక్  ముసాఫిర్  ఎక్ హసీనా" , "మేరే  మెహబూబ్" వంటి సినిమాలు  కూడా విజయం  సాధించాయి. 
మేరా సాయా మేరా సాయా .... పాట ఎంత హిట్టో అందరికీ తెలుసు. చక్కనైన  సాహిత్యానికి  తోడు , చక్కని రాగం,  అభినయం, కధాంశం అన్నీ జతకలిపితే ఇలాటి చక్కటి  పాటలే పుడుతుంటాయి.
    సాధన ఓ సింధీ కుటుంబంలో పాకిస్తాన్ లోని కరాచి లో జన్మిం;చారు . దేశ విభజన అనంతరం  వీరి కుటుంబం  ముంబైలో స్థిర పడ్డారు.   పూర్తి  పేరు శివదాసాని.  
వీరి  తొలి సారిగా సింధీ చిత్రం లో నటించారు. 
"వక్త్", "అస్లీ నకలీ", "పరఖ్", మొదలైన సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సాధన హెయిర్ కట్ ఎందరో అమ్మాయిలు ఫాలో అయ్యేవారు. అలాగే వస్త్ర ధారణ కూడా ...  
తొలి సినిమా డైరెక్టర్ రామకృష్ణ నయ్యర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు.  అయన 1995 లో కనుమూసారు. ఆ దంపతులకి సంతానం లేదు .  నుదుటిమీద ముంగురులు, కరెక్ట్  గా పట్టే డ్రెస్సెస్ తో ఒక మోడల్ గా అలనాడు భాసిల్లిన సాధన   ఫోటోలు తీయించు కోవడానికి సుముఖత చూపలేదుట. 
    రెండు దశాబ్దాలుగా నటించి ఎంతో పేరు తెచ్చుకుని అందరి హృదయాలలో నిలిచిన సాధన ఎప్పటికీ అలానేసుస్థిర  స్థానం సంపాదిం  చుకున్నారు. 
*మేరా సాయా లో టైటిల్ సాంగ్ మేరా సాయా...  మేరా సాయా పాట లింక్ 

మరో పాట అదే సినిమాలోది 

* Naino Mein Badra Chhaye - Mera Saaya 


వో కౌన్ ధీ? - తెలుగులోనూ ఆమె ఎవరు? సినిమా చాలా హిట్ అయింది. ఆ సినిమాలోని  పాటలు లింక్ 

*Lag Jaa Gale - Sadhana, Lata Mangeshkar, Woh Kaun Thi
https://www.youtube.com/watch?v=TFr6G5zveS8 

*మేరె మెహబూబ్ లోని ఈ పాట 
https://www.youtube.com/watch?v=xzPGBnKt8z0

* ఆర్జూ సినిమాలోని మరో హిట్ సాంగ్ 
https://www.youtube.com/watch?v=W13DasXAZ4g

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో హిట్ సాంగ్స్ వున్నాయి. 

అన్ని పాటలు  ఈ కింది లింక్ లో
https://www.youtube.com/watch?v=gpTtZYmp3So


చాలా తరచుగా లభించే సాధన  చిత్రాలు ... Indian EXPRESS సౌజన్యం తో ... 
http://indianexpress.com/photos/entertainment-gallery/sadhna-passes-away-a-look-at-her-journey/

బాదం హల్వా

   స్వీట్స్


 బాదాం హల్వా 
కావలసిన పదార్ధాలు 
బాదం పప్పులు  :       1 కప్పు (నానపెట్టి పై తొక్క తీసినవి )
పాలు                :        1 కప్పు 
పంచదార           :        3/4 కప్పు 
ఏలక్కాయలు     :        3
నెయ్యి                :       1/2 కప్పు 
కుంకుమ పువ్వు :       కొద్దిగా 
ఫుడ్ కలర్          :      కేసరి కాని లైట్ పసుపు రంగు (optional 



తయారు చేసే విధానం :
  • బాదం పప్పులని నీటిలో నానబెట్టాలి. తరువాత పైన వున్న తొక్కని తీసేయాలి. తొందరగా తొక్క తీయాలంటే వాటిని  నీటిలో వుడికించితే తొందరగా వస్తుంది
  • వాటిని మిక్సీలో వేసి  పాలు పోసి  పేస్ట్ చేయాలి.
  • పంచదారని పావు కప్పు నీటిలో కరిగించి లేత పాకం వచ్చేదాక పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. 
  • పంచదార పాకంలో రుబ్బి వుంచుకున్న బాదం పేస్ట్ ని వేసి కలుపుతూ వుండాలి. లేకపోతే మాడి పోతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి.
  • దంచిన ఏలక్కాయ పొడి వేయాలి.
  • కరిగించిన నేతిని పోస్తూ కలుపుతూ వుండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ వుండాలి.
  • కొద్ది పాలలో కుంకుమ పూవు వేసి బాగా కలిపి కరిగాక వుడుకుతున్న బాదం పేస్ట్ లో వేయాలి.
  • వుడుకుతున్నప్పుడు నెయ్యి సెపరేట్ అయ్యినట్లుగా వుంటే హల్వా అయిపోయినట్లే!
  •  వెంటనే  స్టౌ కట్టేయాలి. లేకపోతే తొందరగా అడుగంటడమో, మాడటమో జరుగుతుంది.
  • కలుపుతుంటే బాళికి అంటుకోకుండా వున్నపుడు అయిపోయినట్లు.      
  • వేయించిన బాదం పప్పులు, పిస్తా సన్నాగా కట్ చేసి   హల్వా పైన అలంకరిస్తే బాగుంటుంది. 
  • ముద్దగా కాకుండా పీసెస్ లాగా కావలంటే నెయ్యి రాసిన పళ్ళెంలో  బాదం   హల్వా   వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. 
టిప్స్ 
  • బాదాం పప్పు పది నిముషాలు ఉడికిస్తే తొక్క తొందరగా వస్తుంది.
  • కొంతమంది బాళిలో ఒకేసారి బాదాం పేస్టు, నెయ్యి, పంచదార, ఏలక్కాయ పొడి అన్నీ ఒకేసారి వేసి ఉడికిస్తారు.
  • హల్వా పూర్తీ అయ్యే వరకు కలుపుతూనే వుండాలి.  
  • పిన్నలు, పెద్దలు ఇష్టం గా తినే బాదాం హల్వా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.





       

1, ఆగస్టు 2017, మంగళవారం

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తొ




లేఖిని సాంస్కృతిక సంస్థ రచయిత్రులతో శ్రీమతి గళ్ళ రుణ కుమారి గారి ఇంటి విందుకు వెళ్ళిన సందర్భంలో .....















me,  Mines  Minister Galla Aruna Kumari, Vijaya nirmala
Lunch at Galla Aruna Kumari's House, Jubliee Hills, Hyderabad

టమాటో పచ్చడి 1

టమాటో పచ్చడి:


కావలసిన పదార్ధాలు :
టమాటోలు  :  అరకిలో 
చింతపండు  :  100 gms 
మెంతిపిండి  :  3 tsp 
కారం               50 gms  లేక  తగినంత 
ఉప్పు          :    40 gms   లేక తగినంత 
పోపు           :     ఆవాలు, మినపప్పు, ఇంగువ 
నూనె          :    100gms 
తయారి విధానం 
1. టమోటాలు కడిగి ముక్కలుగా తరగాలి. 
2. నూనె లో ఆ ముక్కలు వేయించాలి. 
3. వేగుతున్న  టమేటా లలో  కడిగిన చింతపండు, ఉప్పు, కారం, మెంతి పిండి పసుపు, వేయాలి. 
4. 2 నిమిషాలు వేయించి స్టవ్ అపెయలి. 
5. ;చల్లారాక అన్నిటిని కలిపి మిక్స్ద లో వెయలి. 
6. నూనె లో పోపు సామానులు  వేసి అవి వేగాక  ఇంగువ కూడా వేసి రుబ్బిన టమేటాలో వేసి బాగా కలపాలి.. 
    అంతే ఇంగువ, మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే టమేటా పచ్చడి రెడి ... 

త్రివేణి సంగమం సోమనాథ్ , గుజరాత్

త్రివేణి సంగమం , సోమనాథ్  గుజరాత్ 
అందరికీ  దీపావళి శుభా కాంక్షలు 
దీపావళి సందర్భంగా గుజరాత్ లోని సోమనాథ్ పట్టణం దగ్గరలో వున్న ఆలయ విశేషాలు గురించి ఫొటోలతో వివరించాలని పించింది. 

సాగరం లో కలిసే సంగమ ప్రదేశం సోమేశ్వరుడి ఆలయానికి  సమీపం లోనే వుంది. 
ఇక్కడ సాగరం లో కపిల, హిరణ్య, సరస్వతి నదులు కలుస్తున్నాయి.  ఈ సంగమ ప్రదేశానికి దగ్గరలో విష్ణుమూర్తి ఆలయాలు వున్నాయి. ముందుగా మనకి కనిపించేది శ్రీకృష్ణ మందిర్. ఇక్కడ మూలవిరాట్   శ్రీ కృష్ణుడు. ఆలయం బాగుంది. ఆలయంలో ఉయ్యాలలో శ్రీకృష్ణుడి ప్రతిమని వుంచి చక్కగా పూలతో అలంకరించి పూజలు, భజనలు చేస్తారు. ఈ అల్లయానికి పక్కనే బలరాముడి ఆలయం, ఆది శేషుడి ఆలయం, లక్ష్మి నారాయణ ఆలయాలు కుడా వున్నాయి.   ఈ ఆలయం విశాల ప్రాంగణం తో సంగమ నదీ తీరాన వుంది. సోమనాథ్ వచ్చే యాత్రికులు తప్పనిసరిగా ఈ ఆలయాలను కుడా దర్శిస్తారు. 




శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ సంగమం, సోమనాథ్ 

లక్ష్మీనారాయణ మూర్తులు 

త్రివేణి సంగమ ముఖద్వారం 

త్రివేణి సంగమం 


శ్రీ కృష్ణ 

అలంకారం తో శ్రీకృష్ణుడు ఊయలలూగుతూ 


నదీ తీరం , సంగమ  ప్రదేశం 

తోటకూర పులుసు కూర

తోటకూర పులుసు కూర 








తోటకూర        :   3 కట్టలు 
ఉల్లిపాయ        :  తరిగినది 
పచ్చిమిర్చి      : 4  
బియ్యపు పిండి:   1 TBS
చింతపండు రసం:  చిన్న కప్పు (2Tbs)
ఉప్పు  :    3 tsp (రుచికి తగినంత )
కారం        :     2 tsp
పసుపు              :    1/2 tsp
కరివేపాకు          :    2 రెమ్మలు 
నూనె                 : పోపుకి తగినంత (2 tsp)
తయారీ విధానం :

1. ముందుగా కడిగి, సన్నగా తరిగిన పెరుగు తోటకూర లేదా ఏదైనా                  తోటకూర రకం, పచ్చిమిరపకాయలు, పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయ      వేసి ఉడికిం చాలి.
2. ఆకు కూర ఉడికాక చింతపండు రసం, 2 కప్పుల నీళ్ళు వేయాలి.
3. ఉప్పు, పసుపు వేసి 5 ని.  ఉడికించాలి.
4. బియ్యపు పిండి నీళ్ళలో కలిపి వేయాలి.
5. బాగా దగ్గర పడ్డాక పోపు వేయాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు,  మెరపకాయ (1-తుంపినది), ఇంగువ, 1 tsp మెంతిపిండి, కారం వేసి అందులో కలపాలి.
6.  బాగా వుడుకుతున్నపుడు కరివేపాకు వేసి సెర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయాలి . 
చక్కటి వాసనలతో తోటకూర పులుసు కూర రెడీ.

టిప్స్ :
  • పెరుగు తోటకూర అని కొద్దిగా పెద్ద ఆకులతో, లావు కాడలతో వుంటుంది.ఈ ఆకు కూరతో పులుసుకూర చేస్తే బాగుంటుంది. మా అమ్ముమ్మ బాగా చేసేది. ఈ వంట కూడా మా ఇంట్లో ఎప్పటినుంచో చేస్తున్నాం.
  • ఆకులు వాడాక కాడలు లావుగా వున్న వాటిని పీచు తీసి చిన్న ముక్కలుగా చేసి దానితో కుడా పులుసు చేస్తారు. 
  • కొయ్య తోటకూర ఎర్రగా, చిన్న ఆకులతో వుంటుంది. ఈ ఆకు కూరతో పప్పు వేసి చేస్తాము . అది కుడా బాగుంటుంది. 
  • కందిపప్పు 250 రూపాయలు 1 కిలో వున్నపుడు సామాన్యులకు అన్నంలోకి ఇది ఒక ఆదరువు. పప్పు వాడకుండా వందే ఆదరువు. 
  • దీని ఉట్టిపప్పు నెయ్యి అన్నం లో  నంచుకుని తింటుంటే బాగుంటుంది . ఇది మంచి కాంబినేషన్. 
  • పప్పు లేకపోతె , కందిపొడి అన్నంలోకి , శనగ పచ్చడి లోకి, కంది పచ్చడి లోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది. 
  • రొట్టెల లోకి కుడా పుల్లగా, కారంగా కరివేపాకు వాసనలతో బాగుంటుంది. 
  • ఈ కొలతలన్నీ అందాజుగా చెప్పినవి. చేసే వారి రుచిని బట్టి ఉప్పులు, కారాలు అన్నీ వేసుకోవచ్చు.
  • మరీ పలచగా వుంటే బియ్యపు పిండి ఎక్కువ వెయచ్చు. అప్పుడు చిక్కగా వుంటుంది.