1, ఆగస్టు 2017, మంగళవారం

తోటకూర పులుసు కూర

తోటకూర పులుసు కూర 








తోటకూర        :   3 కట్టలు 
ఉల్లిపాయ        :  తరిగినది 
పచ్చిమిర్చి      : 4  
బియ్యపు పిండి:   1 TBS
చింతపండు రసం:  చిన్న కప్పు (2Tbs)
ఉప్పు  :    3 tsp (రుచికి తగినంత )
కారం        :     2 tsp
పసుపు              :    1/2 tsp
కరివేపాకు          :    2 రెమ్మలు 
నూనె                 : పోపుకి తగినంత (2 tsp)
తయారీ విధానం :

1. ముందుగా కడిగి, సన్నగా తరిగిన పెరుగు తోటకూర లేదా ఏదైనా                  తోటకూర రకం, పచ్చిమిరపకాయలు, పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయ      వేసి ఉడికిం చాలి.
2. ఆకు కూర ఉడికాక చింతపండు రసం, 2 కప్పుల నీళ్ళు వేయాలి.
3. ఉప్పు, పసుపు వేసి 5 ని.  ఉడికించాలి.
4. బియ్యపు పిండి నీళ్ళలో కలిపి వేయాలి.
5. బాగా దగ్గర పడ్డాక పోపు వేయాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు,  మెరపకాయ (1-తుంపినది), ఇంగువ, 1 tsp మెంతిపిండి, కారం వేసి అందులో కలపాలి.
6.  బాగా వుడుకుతున్నపుడు కరివేపాకు వేసి సెర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయాలి . 
చక్కటి వాసనలతో తోటకూర పులుసు కూర రెడీ.

టిప్స్ :
  • పెరుగు తోటకూర అని కొద్దిగా పెద్ద ఆకులతో, లావు కాడలతో వుంటుంది.ఈ ఆకు కూరతో పులుసుకూర చేస్తే బాగుంటుంది. మా అమ్ముమ్మ బాగా చేసేది. ఈ వంట కూడా మా ఇంట్లో ఎప్పటినుంచో చేస్తున్నాం.
  • ఆకులు వాడాక కాడలు లావుగా వున్న వాటిని పీచు తీసి చిన్న ముక్కలుగా చేసి దానితో కుడా పులుసు చేస్తారు. 
  • కొయ్య తోటకూర ఎర్రగా, చిన్న ఆకులతో వుంటుంది. ఈ ఆకు కూరతో పప్పు వేసి చేస్తాము . అది కుడా బాగుంటుంది. 
  • కందిపప్పు 250 రూపాయలు 1 కిలో వున్నపుడు సామాన్యులకు అన్నంలోకి ఇది ఒక ఆదరువు. పప్పు వాడకుండా వందే ఆదరువు. 
  • దీని ఉట్టిపప్పు నెయ్యి అన్నం లో  నంచుకుని తింటుంటే బాగుంటుంది . ఇది మంచి కాంబినేషన్. 
  • పప్పు లేకపోతె , కందిపొడి అన్నంలోకి , శనగ పచ్చడి లోకి, కంది పచ్చడి లోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది. 
  • రొట్టెల లోకి కుడా పుల్లగా, కారంగా కరివేపాకు వాసనలతో బాగుంటుంది. 
  • ఈ కొలతలన్నీ అందాజుగా చెప్పినవి. చేసే వారి రుచిని బట్టి ఉప్పులు, కారాలు అన్నీ వేసుకోవచ్చు.
  • మరీ పలచగా వుంటే బియ్యపు పిండి ఎక్కువ వెయచ్చు. అప్పుడు చిక్కగా వుంటుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి