సాధన హిందీనటి శుక్రవారం కనుమూసారు
*Lag Jaa Gale - Sadhana, Lata Mangeshkar, Woh Kaun Thi
ముంబై సిని ప్రపంచం లో అలనాటి అందమైన హీరోయిన్ సాధన 25 12 20 15న కనుముసారు.
వారికి చిరు నివాళి ...
"వో కౌన్ ధీ?" సినిమాతో అందరి మనసులు దోచుకున్న సాధన 74 ఏళ్ల వయసులో ముంబై లో కనుమూశారు.
తోలి సినిమా "శ్రీ 420" - రాజకపూర్ చిత్రం లో ఒక డాన్స్ లో చిన్న పాత్రలో నటించారు. హిట్ సినిమాలలో "హమ్ దోనో", "వో కౌన్ ధీ?" లో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వీరు నటించిన "లవ్ ఇన్ సిమ్లా", "ఎక్ ముసాఫిర్ ఎక్ హసీనా" , "మేరే మెహబూబ్" వంటి సినిమాలు కూడా విజయం సాధించాయి.
మేరా సాయా మేరా సాయా .... పాట ఎంత హిట్టో అందరికీ తెలుసు. చక్కనైన సాహిత్యానికి తోడు , చక్కని రాగం, అభినయం, కధాంశం అన్నీ జతకలిపితే ఇలాటి చక్కటి పాటలే పుడుతుంటాయి.
సాధన ఓ సింధీ కుటుంబంలో పాకిస్తాన్ లోని కరాచి లో జన్మిం;చారు . దేశ విభజన అనంతరం వీరి కుటుంబం ముంబైలో స్థిర పడ్డారు. పూర్తి పేరు శివదాసాని.
సాధన ఓ సింధీ కుటుంబంలో పాకిస్తాన్ లోని కరాచి లో జన్మిం;చారు . దేశ విభజన అనంతరం వీరి కుటుంబం ముంబైలో స్థిర పడ్డారు. పూర్తి పేరు శివదాసాని.
వీరి తొలి సారిగా సింధీ చిత్రం లో నటించారు.
"వక్త్", "అస్లీ నకలీ", "పరఖ్", మొదలైన సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సాధన హెయిర్ కట్ ఎందరో అమ్మాయిలు ఫాలో అయ్యేవారు. అలాగే వస్త్ర ధారణ కూడా ...
తొలి సినిమా డైరెక్టర్ రామకృష్ణ నయ్యర్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయన 1995 లో కనుమూసారు. ఆ దంపతులకి సంతానం లేదు . నుదుటిమీద ముంగురులు, కరెక్ట్ గా పట్టే డ్రెస్సెస్ తో ఒక మోడల్ గా అలనాడు భాసిల్లిన సాధన ఫోటోలు తీయించు కోవడానికి సుముఖత చూపలేదుట.
రెండు దశాబ్దాలుగా నటించి ఎంతో పేరు తెచ్చుకుని అందరి హృదయాలలో నిలిచిన సాధన ఎప్పటికీ అలానేసుస్థిర స్థానం సంపాదిం చుకున్నారు.
*మేరా సాయా లో టైటిల్ సాంగ్ మేరా సాయా... మేరా సాయా పాట లింక్
మరో పాట అదే సినిమాలోది
* Naino Mein Badra Chhaye - Mera Saaya
వో కౌన్ ధీ? - తెలుగులోనూ ఆమె ఎవరు? సినిమా చాలా హిట్ అయింది. ఆ సినిమాలోని పాటలు లింక్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి