7, ఆగస్టు 2017, సోమవారం

బాదం హల్వా

   స్వీట్స్


 బాదాం హల్వా 
కావలసిన పదార్ధాలు 
బాదం పప్పులు  :       1 కప్పు (నానపెట్టి పై తొక్క తీసినవి )
పాలు                :        1 కప్పు 
పంచదార           :        3/4 కప్పు 
ఏలక్కాయలు     :        3
నెయ్యి                :       1/2 కప్పు 
కుంకుమ పువ్వు :       కొద్దిగా 
ఫుడ్ కలర్          :      కేసరి కాని లైట్ పసుపు రంగు (optional 



తయారు చేసే విధానం :
  • బాదం పప్పులని నీటిలో నానబెట్టాలి. తరువాత పైన వున్న తొక్కని తీసేయాలి. తొందరగా తొక్క తీయాలంటే వాటిని  నీటిలో వుడికించితే తొందరగా వస్తుంది
  • వాటిని మిక్సీలో వేసి  పాలు పోసి  పేస్ట్ చేయాలి.
  • పంచదారని పావు కప్పు నీటిలో కరిగించి లేత పాకం వచ్చేదాక పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. 
  • పంచదార పాకంలో రుబ్బి వుంచుకున్న బాదం పేస్ట్ ని వేసి కలుపుతూ వుండాలి. లేకపోతే మాడి పోతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి.
  • దంచిన ఏలక్కాయ పొడి వేయాలి.
  • కరిగించిన నేతిని పోస్తూ కలుపుతూ వుండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ వుండాలి.
  • కొద్ది పాలలో కుంకుమ పూవు వేసి బాగా కలిపి కరిగాక వుడుకుతున్న బాదం పేస్ట్ లో వేయాలి.
  • వుడుకుతున్నప్పుడు నెయ్యి సెపరేట్ అయ్యినట్లుగా వుంటే హల్వా అయిపోయినట్లే!
  •  వెంటనే  స్టౌ కట్టేయాలి. లేకపోతే తొందరగా అడుగంటడమో, మాడటమో జరుగుతుంది.
  • కలుపుతుంటే బాళికి అంటుకోకుండా వున్నపుడు అయిపోయినట్లు.      
  • వేయించిన బాదం పప్పులు, పిస్తా సన్నాగా కట్ చేసి   హల్వా పైన అలంకరిస్తే బాగుంటుంది. 
  • ముద్దగా కాకుండా పీసెస్ లాగా కావలంటే నెయ్యి రాసిన పళ్ళెంలో  బాదం   హల్వా   వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. 
టిప్స్ 
  • బాదాం పప్పు పది నిముషాలు ఉడికిస్తే తొక్క తొందరగా వస్తుంది.
  • కొంతమంది బాళిలో ఒకేసారి బాదాం పేస్టు, నెయ్యి, పంచదార, ఏలక్కాయ పొడి అన్నీ ఒకేసారి వేసి ఉడికిస్తారు.
  • హల్వా పూర్తీ అయ్యే వరకు కలుపుతూనే వుండాలి.  
  • పిన్నలు, పెద్దలు ఇష్టం గా తినే బాదాం హల్వా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.





       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి