30, అక్టోబర్ 2015, శుక్రవారం

"విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు , పేద పిల్లలు -


పుస్తక సమీక్ష:


 "విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు"    
(బాలల కోసం మరో చిరు పుస్తకం)
-డా . గురజాడ  శోభా పెరిందేవి
                                                                                               -మణి నాథ్ కోపల్లె 
    
                   ప్రముఖ రచయిత్రి డా.  గురజాడ శోభా పేరిందేవి రచించిన "విధిని ఎదిరిస్తున్న వీధి బాలలు, పేద పిల్లలు "  అనే పుస్తకం అందరు చదవతగినది. ఇందులో పేద పిల్లలు, అనాధ పిల్లలు. వీధి పిల్లలు అనుభవించే బాధలు, అనుభవాలు, అనుభూతులు తెలియ చేయటం తో పాటు,  వారికి ఆశ్రయం ఇచ్చి ఆడుకునే సంస్థల గురించి వివరించారు.
       'అప్నాఘర్' అనే సంస్థను  అభినందన భవానీ గారు గత 25 సం. గా పేద పిల్లల కి నిలువ నీడ నిచ్చి, చదువులు చెప్పిస్తూ, భోజన సదుపాయాలూ చూస్తూ, వారి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చి దిద్దుతున్నారు.  అప్నాఘర్ గురించి, అందులోని పిల్లల దీన గాధలు, ఆ సంస్థ ఎదుర్కున్న సమస్యలు, అన్ని విపులంగా రచయిత్రి ఈ పుస్తకం లో వివరించారు.  సంఘంలోని దీన, హీన,పేద పిల్లలకు వారు విధిని పూర్తిగా  ఎదిరించలేక పోయినా 'అప్నాఘర్ సంస్థ' వారి జీవితాల్లో నిండిన ఆర్ధిక, సామాజిక మార్పుని తీసుకుని వచ్చే ప్రయత్నంలోను,  ఎందరో అందించే ఆర్ధిక వనరులు, విద్యా సదుపాయాలు కుడా హర్షణీయమే! వాటినన్నిటిని రచయిత్రి చక్కగా ఇందులో వివరించారు.  అవకాశం  వుంటే ఎవరైనా ఏదైనా సాధించ గలరని,  అనాధలైనా, పేదలైనా హద్దులుండవని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడగాలరని ఈ అప్నాఘర్ విద్యార్దులు నిరూపించారు. కొందరు వీధి పిల్లలు సిగరెట్, మద్యం , డ్రగ్స్ వంటి వాటికి బానిసలై అవారాలా  తిరిగే వారుంటే మరికొందరు వివిధ వృత్తులలో పట్టుదలతో రాణిస్తూ పైకి వచ్చిన పిల్లలూ వున్నారు అని వారి వివరాలూ ఈ పుస్తకం లో అందించారు. మనదేశం లోనే కాదు ప్రపంచం లో వున్న పేద పిల్లల గురించిన వివరాలూ వున్నాయి.  వీధి బాలల గురించి చెబుతూ వారిలో పట్టుదల వుంటే జీవితంలో పైకి వచ్చిన వారున్నారు, ముళ్లబాటలో నడిచిన వారున్నారు అని అంటున్నారు రచయిత్రి. 
               ఈ పుస్తకం లో అప్నఘర్ లోని పిల్లల తో తాను రచించి, వారిచే వేయించిన అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్, వారి ఆటలు, పాటలు, డ్రామాలు వాటి గురించి చాలా చక్కగా వివరించారు.  ఇటువంటి కార్యక్రమాలు  పిల్లలలో ఎంతో ఉత్సాహాన్ని, మానసిక బలాన్ని  ఇస్తాయి అని అంటారు.  
              శోభా పెరిందేవి ఈ పుస్తకం ఒక్క పేద పిల్లల కోసం రాసినదే కాదు. అందరు చిన్నారులు వారు రాసిన నాటికలు, నాటికలు, స్కిట్స్  వంటివి ఎంతో సందేసాత్మికంగా వున్నాయి.  ఈ పుస్తకం లో రాసిన 9 నాటికలలో  నగరం లోని వివిధ స్కూల్ విద్యార్దులు కుడా స్టేజి మీద వేసేవారు. బహుమతులు అందుకున్నారు. వీరు రచించిన ఈ నాటికలు ఒక్కొక్కటి ఆణిముత్యం . సందేశాలను అందిస్తాయి. 
           *  పిల్లలని పెంచేటప్పుడు తల్లి తండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దితే ఎటువంటి ఫలితాలని ఇస్తుందో 'జననీ జన్మ భూమిశ్చ' అనే నాటిక చెబుతుంది. ఇందులో పిల్లలు తమకిష్టమైనవి తీర్చుకోలేక, పెద్దల అభీష్టాలను తీర్చలేక మానసిక వత్తిడికి లోనై ఇంటినుంచి పారిపోవటం,  వారిలోని సృజనాత్మక లోపించటం వంటివి జరుగుతుంది. ఈ నాటిక బాలల నాటక పోటీల్లో బహుమతి కుడా పొందింది. 
          * పిల్లలు ఎక్కువగా ఇష్టపడే జంతువులు ముఖ్య పాత్రలుగా పిల్లలచే చేయించే నాటిక 'అడవిలో అందాల పోటి;  ఇందులో అందమైన జంతువులు ఎన్ని వున్నా నల్లగా వున్నా ఒక కాకి బహుమతి గెల్చుకోవటం దానికి కారణం వివరించే తీరు మనుషుల్లో  గతించిన  పెద్దలపై పెట్టే తీర్ధ విధులు ఒక కాకి ఎలా ఆహారంగా తీసుకుని సమాజానికి ఉపయోగ పడుతుంది అని చెబుతుంది. 
          * ఇంకో  నాటకం 'హాపీ డేస్'. సంవత్సరం లో మనం జరుపుకునే సెలవు రోజులు, వాటి ప్రముఖ్యతవి వివరిస్తుంది. దీన్ని చిన్న పిల్లలు అంటే యల్ కేజీ పిల్లలచే కూడా చేయించ వచ్చు. 
           * అలాగే మనుషులకే కాదు వారు వాడే వస్తువులకి ప్రాణం వస్తే అవి ఎలా మాట్లాడుకుంటాయో, ఎలా బాధ పడుతుంతాయో అని చెప్పే నీతి నాటకం 'మా పాట్లు వినేదేవరండి' అనే నాటిక చెబుతుంది.. 
           * టీచర్స్ డే నాడు ప్రదర్శించే నాటకం ....   ఒక విద్యార్ధి  తన టీచర్ చెప్పినవి పాటిస్తూ ఎలా పైకి వచ్చాడో 'గురు దక్షణ' అనే నాటకం చెబుతుంది. 
           * అన్నీ నాటకాలే కాకుండా గేయ రూపకం 'హైదరాబాద్ హైలైట్స్'. ఇది   వెనక పాట పాడుతూ వుంటే హైదరాబాద్ నగర విశేషాలు  అభినయించే నాటకం. 
            * 'రక్షించండి' నాటకంలో అయితే భూమాత విలాపం. ప్రజలంతా భూమి మీద చేసే దారుణం గా తనని ఎలా  హింసిస్తున్నారో, తనని రక్షించమని భూదేవి వరుణ దేవుని, వాయుదేవుని వేడుకోవటం వుంటుంది. ఇది పర్యావరణానికి సంబంధించిన నాటిక. ఇది ఒక సందేశాత్మక నాటకం. 
           *  పుట్టిన రోజు నాడు వేడుకగా పార్టీలు, పిక్నిక్ లు, సరదాగా గడపటం కన్నా అనాధ పిల్లలకి , పేద పిల్లలకి , వృద్ధులకి  ఇలా ఏదైనా ఆశ్రమాలకి వెళ్లి అన్నదానం చేయటం, పిల్లలతో ఆటలాడించటం, వారితో గడిపినపుడు ఆ పిల్లలు పొందే అనందం ఎలా వుంటుందో తెలిపే నాటిక  జన్మదిన కానుక  అనే నాటకం లో తల్లితండ్రులు తమ పిల్లలకి ఇచ్చే బహుమతి ఏదో తెలుపుతుంది. 
           * 'పుస్తక విలాపం' అనే నాటకం లో పుస్తకాలు చదవటం తగ్గిపోతున్న ఈ రోజుల్లో లైబ్రరీ లలో వుండే పుస్తకాలు ఎలా బాధ పడతాయో తెలుపుంది. గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ఈ నాటిక రచించి, ప్రదర్శించారు. ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా వేయచ్చు అనేలా వుంది.  
           ఈ నాటకాలన్నీ కూడా 15ని. లోపే వుంటాయి. తేలిక సంభాషణలతో చిన్నారులు గుర్తు పెట్టుకొని నటించేలా వుంటాయి. 
           వీటిలో  చాల నాటకాలు అప్నాఘర్ పిల్లలు ప్రదర్శించారు.          
          "భారత్ అవార్డ్" ఎంతో ప్రతిష్టాత్మక మైనది. చిన్నారులలో సాహస వీరులకి ప్రభుత్వం అందించే ఈ అవార్డుని అందుకోవటం చాలా గొప్ప విషయం. ఈ పుస్తకం లో రచయిత్రి భారత దేశం లో సాహవీర బాలుల గురించిన వివరాలు చాల విపులంగా చెప్పారు. వారిలో మన తెలుగు వారి 13సం   అమ్మాయి ఇంకొకరి ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయింది. అలాగే మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు రక్షించిన హరీష్ చంద్ర వయసు 14 సం. అతని కధనం కుడా ఇందులో పొందు పరచారు రచయిత్రి.  ఎన్నో విషయాలు తెలియ చెప్పే ఈ పుస్తకం కుడా నిజంగా చిన్నారులకి మార్గదర్శి కూడా.  
              " విధి  నెదిరుస్తున్న వీధి బాలాలు పేద పిల్లలు - పుస్తకం పరమ పాఠనీయంగా తీర్చిదిద్దింది శోభా పెరిందేవి" అని ప్రశంసించారు డా. సి. నారాయణ రెడ్డి గారు. 
         "బాలలకు స్పూర్తిగా వుండటం కోసం నాటికలు రచించి ప్రచురించారు. ఇవి తల్లి తండ్రులకి కూడా స్పూర్తిదాయకం. ఒక మంచి గ్రంధాన్ని సమాజానికి అందిస్తున్న శోభా పెరిందేవిని మనసారా అభినందిస్తున్నా" అని అంటారు డా. బి. జయరాములు గారు తన ముందు మాటలో.  వీరు ఉస్మానియా యూనివెర్సిటి ఓరియంటల్ ఫ్యాకల్టీ ఇన్ చార్జ్ డ్ డీన్ గా పనిచేసి పదవి విరమణ చేసారు. 
         "ఈ పుస్తకం - అభినందన భవాని అప్నాఘర్ ఏర్పడడానికి గల కారణాలు, ఎన్ని కస్టాలు ఎదుర్కొంది, సంస్థలోని పిల్లలు, పిల్లల మనస్తత్వం అన్నీ కూడా చక్కగా వివరిస్తూ రచయిత్రి కొన్ని నాటికలను బాలలకి  స్తూర్తిదాయకంగా వుండేలా రచించారు. 
         డా. శోభా పెరిందేవి గారు రచయిత్రే కాదు ప్రముఖ సంఘ సేవకురాలు కుడా. వృద్దులకి అవసరమైన వారికి సేవ చేస్తూ ఇటు చిన్నారులకి కుడా  తన సేవలందిస్తున్నారు.   సంఘసేవకురాలే కాదు.   తమ తండ్రి గారు, అత్తగారు మామగారు, అన్నయ్యల పేరిట స్మారక బహుమతులూ ప్రతి ఏటా అందిస్తుంటారు.  ఈ పుస్తకం కినెగే లో కుడా దొరుకుతుంది.  kinegie.com  
          

-మణినాథ్ కోపల్లె
9703044410
         

29, అక్టోబర్ 2015, గురువారం

పచ్చిమిరపకాయల పచ్చడి

 
పచ్చిమిరపకాయల పచ్చడి
పచ్చిమిరపకాయలు       :      100 gms
కొత్తిమీర                         :      2 కట్టలు
చింతపండు :    50 gms (నిమ్మకాయంత)

మెంతి పొడి (వేయించి పొడి కొట్టినది):   2 స్పూన్లు
ఉప్పు                           :  తగినంత
నూనె                           :  5 Tsps
పోపు                           :  ఆవాలు, మినపప్పు, ఇంగువ

తయారి విధానం           :

1 3 చెంచాల నూనెలో పచ్చిమిరపకాయలు కడిగినవి వేసి మూతపెట్టి వేయించాలి. 

2. ఘాటు పోయి రంగు మారిన మిరపకాయలలో కొత్తిమీర, నానపెట్టిన చింతపండు,  మెంతి పిండి ఉప్పు, వేసి గ్రైండ్ చేయాలి. బౌల్ లోకి తీయాలి.

3.  2 చెంచాల నూనెలో పోపు, ఇంగువ వేసి వేయించి పచ్చడిలో కలపాలి. అంతే  ఘుమ ఘుమలాడే పచ్చి మిర్చి పచ్చడి రెడీ. 


  నోట్స్ :  

పచ్చిమిరపకాయలు  పచ్చిగా వుండకుండా వేయించాలి.   మాడకూడదు 
కారం తినేవాళ్ళే ఈ పచ్చడి చేసుకోవచ్చు. 
ఎక్కువ తింటే కడుపులో మండుతుంది. జాగ్రత్త 
ఇది గుంటూరు వేపు ఎక్కువగా చేస్తారు. 
ఇదివరకు మేము కొత్తిమీర కూడా లేకుండా పచ్చి మిరపకాయలతోనే చేసేవాళ్ళము. 
మెంతి, ఇంగువ వాసనతో చాలా బాగుంటుంది. 
పెరుగన్నం లో నంచుకుని తింటే కుడా బాగుంటుంది 

 

9, అక్టోబర్ 2015, శుక్రవారం

SIDHPUR, (Matru Gaya), Gujarat


.

మాతృగయ 
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో తర్పణాలు అనేవి అందరు ఆచరించే ఒక ప్రక్రియ.  ఒక వ్యక్తి కాలం చేసిన తరువాత ఉత్తమ గతి చేరుకోడానికి, మోక్షం పొందటానికి వారి సంతతి నిర్వహించే శ్రాద్ధ కర్మలు సంప్రదాయ బద్దంగా పిండ ప్రదానాలు, దానాలు, పూజలు ఇత్యాది కార్యక్రమాలు విధి విదానాలు చేస్తుంటారు.  

మన దేశం లో మరణించిన వారికి కాశి, ప్రయాగ, బదరీనాథ్ వంటి పుణ్య క్షేత్రా లలో శ్రాద్దకర్మలు చేస్తుంటారు. 

కాని మన దేశం లో మాతృమూర్తులకు  మాత్రమే కొడుకులు  శ్రాద్ధకర్మలు నిర్వహించే చోటు మాతృగయ. 
అహ్మదాబాద్ కు 114 కి.మీ. దూరం లో సిద్ద్ పూర్ వుంది.  పురాణాలలో కూడా ఈ ప్రదేశ ప్రస్తావన వుంది. చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ మాతృ గయ విశేషాలతో నేను రాసిన సంగతులు తెలుగువన్. కామ్ లో 
ప్రచురితమైంది. ఆ లింక్ ఈ కింద చూడండి.  
http://www.teluguone.com/devotional/content/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%83%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%A7%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4%E0%B1%83%E0%B0%97%E0%B0%AF-278-34055.html


మాతృమూర్తులకు మోక్షధామం మాతృగయ
బిందు సరోవరం 


ప్రవేశ  ద్వారం బిందు సరోవరం 










        మేము ఇటీవల  ద్వారక, సోమనాథ్ వెళ్ళాము.  ఎంతో ఆహ్లాదకరంగా సాగిన మా యాత్ర విశేషాలు గురించి నలుగురితో పంచుకోవాలనిపించింది. హైదరాబాద్ నుంచి ఒక గంట ప్రయాణం విమానం లో చేసి అహ్మదాబాద్  చేరుకున్నాము. అహ్మదాబాద్  ఏర్ పోర్ట్ నుంచి ట్రావలర్ వెహికల్ లో 12 మందిమి మాతృగయ చేరుకున్నాము. సిద్దపూర్ గుజరాత్ రాష్ట్రం లో ఉత్తరాన పాటన్ (Patan)జిల్లాలో వుంది. గుజరాత్ లో వున్న సిద్ద్ పూర్ నే మాతృ గయ అంటారు. మాతృగయ చాలా విశేషవంతమైన ప్రదేశం. ఇక్కడ గంగ సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది.  సిద్ద్ పుర్ పవిత్రమైన స్థలమని శ్రీ స్థల్ అని భావిస్తారు.  పురాణాల కాలం నుంచి ఈ ప్రదేశ గురించిన ప్రస్తావన వుంది.  పురాణాల ప్రకారం దధీచి మహర్షి తన అస్తికలను ఇంద్రుడికి సమర్పించిన ప్రదేశంగా కూడా చెబుతారు.  పాండవులు   ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. ఋగ్వేదం లోను దీని ప్రస్తావన వుంది
స్థల పురాణం :
కర్దమ మహర్షి , దేవహుతి ల ఆలయ గోపురాలు 

         బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ మహర్షి కి మనువు పుత్రిక దేవహుతికి వివాహం జరిగిన చోటు ఇదే అంటారు. . వీరికి తొమ్మిది మంది పుత్రికలు. వీరిని తొమ్మిదిమంది మహర్షులకి ఇచ్చి వివాహం చేశారు. వీరి పుత్రికలలో అనసూయ కూడా వుంది. అంతేకాదు ఈ దంపతులు చాలా కాలం తపస్సు చేసి విష్ణుమూర్తి చే భగవంతుడే తమ పుత్రుడిగా జన్మించాలని వరం పొందుతారు. ఆ పుత్రుడే భగవంతుడి అవతారమైన కపిల మహర్షి. పదహారేళ్ళ వయసులో కపిల మహర్షి తన తల్లికి వివరించిన సంఖ్యా శాస్త్ర సూత్రాలే కపిల గీత! గా ప్రసిద్ది చెందింది. తండ్రి కర్దమ ప్రజాపతి తన భోగ ఉపకరణాలు, సంపద అన్నీ వదిలి తపస్సు చేసుకోవడానికి వెళ్లి పోతాడు. దేవహుతి కుడా తన భర్త లేని ఈ సంపద భోగ వస్తువులు తనకి వలదనుకుని వైరాగ్యం తో కపిలుని వద్దకు వెళ్లి తను కూడా ఏమి చేస్తే మోక్షం పొంద గలనని వివరించమని అడుగుతుంది. అప్పుడు తల్లికి వివరించిన గీతోపదేశమే కపిల గీత .
పరశురాముడు 

తల్లి మరణానంతరం కపిలుడు తల్లి  శ్రాద్ధ కర్మలు ఇక్కడే నిర్వహించాడు. అందుకే ఇది మాతృగయ గా ప్రసిద్ది చెందింది. ఇక్కడే పరశురాముడు కుడా తన తల్లి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. తల్లికి పెట్టే పిండ ప్రదానాలలో  దాదాపు 20 చిన్న చిన్న పిండాలు పెడతారు . ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత   వరకు, జీవితాన్ని ఇచ్చిన  తమ తల్లికి  కృతజ్ఞతగా ఇన్ని పిండాలు పెట్టిస్తారు. కొంతమంది 27 పిండాలు పెట్టిస్తారు. తెలిసి తెలియక తమ తల్లిని బాధ పెట్టినందుకు అంటే నవమాసాలు మోసినందుకు, కన్నందుకు, అన్నం తిననని మారం చేసినపుడు  చదువు కునేటప్పుడు,  ఇంకా అనేక విధాలుగా తాను చేసిన తప్పులు క్షమించినందుకు, కృతఙ్ఞతలు చెబుతూ పిండాలు సమర్పిస్తారు. తల్లికి మాత్రమె నిర్వహించే శ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రదేశం ఇది ఒక్కటే!   తమ తల్లికి పిండ ప్రదానం ఇక్కడ చేస్తే తల్లికి మోక్షం కలుగుతుందని అందరు నమ్ముతారు. మన సంప్రదాయం  ప్రకారం పుత్రులు మాత్రమే తల్లికి కర్మకాండలు నిర్వహిస్తారు.  చుట్టూ పక్కల కాని ఇక్కడ కొంతమంది స్త్రీలు కూడా తమ తల్లికి పిండ ప్రదానాలు చేస్తుంటారు.
బిందు సరోవరం:

మన భారత దేశం లో వున్న 5 పవిత్రమైన సరోవరాల్లో గుజరాత్ లోని  బిందు సరోవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్ లోని మానస సరోవరం , రాజస్తాన్ లోని పుష్కర్ సరోవరం, కచ్ (గుజరాత్)లోని నారాయణ సరోవరం,  కర్ణాటక లోని పద్మ సరోవరం. భగవంతుడు ప్రత్యక్షమైనపుడు దేవహుతి కనుల వెంట జారిన ఆనందాశ్రవులే  బిందు సరోవరం గా మారింది అని, మరి కొంతమంది కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందంతో రాలిన బిందువులే బిందు సరోవరం అని అంటారు. ప్రస్తుతం అక్కడి నీరు అపరిశుభ్రం గా వుంది.  ఈ ఆలయాల కి పక్కనే అదే ప్రాంగణం లో  గుప్త సరోవర్ అని పెద్దది వుంది. విశాలమైన ఆ తటాకం లో నీరు కూడా ఆకుపచ్చగా వుంది. అక్కడే వున్న అశ్వద్ద వృక్షంలో  శ్రాద్ధ  కర్మలు చేసిన  వారిచే  మంత్రాలూ చెబుతూ ఒక చెంబుతో  నీళ్ళు పోయించారు అక్కడి బ్రాహ్మలు.  దీని significance  తెలీదు కాని అందరు తమకి తోచిన దక్షిణ సమర్పించారు.
ముక్తి ధామ్:
ముక్తి ధామ్ గా పిలిచే ఈ  సిద్దాపూర్ గ్రామానికి చుట్టుపక్కల 85 గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికి వచ్చి వారికి అగ్ని సంస్కారాలు చేస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. మరణించిన వారి అస్తికలను సరస్వతి నదిలో కలుపుతారు.    అలాగే  చివరి కర్మకాండలు నిర్వహించి మరణించిన వారికి ముక్తి ప్రసాదించమని వేడుకుంటారు.  ప్రతి ఏటా వేలాదిమంది తమ మాతృ మూర్తులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. గంధర్వ స్మశానం అని కుడా పిలుస్తారు ఇక్కడి స్మశానాన్ని. ఉజ్జయిన్, కాశీ, ప్రయాగ లలో కూడా ఇటువంటి ముక్తి ధామ్ వుంది.
రవాణా సౌకర్యాలు: సిద్ద్ పుర్ అహ్మదాబాద్ కి 114 కి.మీ, దూరం లో వుంది. ముంబై నుంచి ఆరావళి ఎక్స్ ప్రెస్, ఇతర ప్రదేశాలు ఓకా , డెహ్రాడున్, బెంగళూరు, మొదలైన ప్రధాన నగరాల నుంచి కూడా రైళ్ళు వున్నాయి. విశేషమైన చరిత్ర కలిగిన సిద్దపూర్ లో అక్కడ వున్నఉత్తరాధి మఠ్ లో అందరు (మగవారు మాత్రమే) తమ మాతృమూర్తులకి పిండ ప్రదానాలు  చేశాక  అక్కడే భోజనాలు ముగించాము. బిందు సరోవరానికి చుట్టూ   కపిల, దేవహుతి, కర్దమ మహర్షి శివ, పార్వతి, గణపతి   మొదలైన ఆలయాలు వున్నాయి. ఈ  ఆలయాలు కాక దగ్గరలోనే సత్యనారాయణ మందిరం, శ్రీకృష్ణ ఆలయం, బాలాజీ మందిరం, ఇంకా ఎన్నో చిన్న చిన్న ఆలయాలు వున్నాయి...






.
...Maninath Kopalle
  

3, అక్టోబర్ 2015, శనివారం

"అమావాస్య చంద్రిక " డా. గురజాడ శోభాపేరిందేవి

నేటి నిజం దినపత్రికలో నేను రాసిన పుస్తక సమీక్ష


పుస్తకం పేరు:    అమావాస్య చంద్రిక
రచయిత్రి         డా. గురజాడ శోభాపేరిందేవి   
పుస్తక సమీక్ష
అమావాస్య చంద్రిక
-మణినాథ్ కోపల్లె
ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు డా. గురజాడ శోభాపేరిందేవి రచించిన అమావాస్య చంద్రిక పుస్తకాన్ని  శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి వారు    సామాజిక సత్ సాహిత్య స్వరూపం అని అభివర్ణించారు.
ఈ పుస్తకం కిన్నెర వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి  కిన్నెర నాగచంద్రిక గారి జీవిత కథ. ఈ పుస్తకంలో నాగ చంద్రిక జీవితంలో అనుభవించిన సుఖదుఖాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చాలా హృద్యంగా వివరించారు రచయిత్రి. నాగచంద్రిక జీవితంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడే అంశాలను వివరించారు.  వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాలు,  కన్నీళ్ళు, సమస్యలు   ఎలా ఎదుర్కొని  థృడవంతులుగా, శక్తివంతులుగా మార్చి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపేలా చేస్తాయో చక్కగా చెప్పారు రచయిత్రి.
          చిన్నప్పటి నుంచి గారంబంగా మేనమామ ఇంట పెరిగిన నాగచంద్రిక జీవితంలో వివాహం ఒక పెద్ద మలుపు.. తెలిసీ తెలియని వయసులో  కొత్త పెళ్ళికూతురిగా అడుగుపెట్టిన నాడే ఆమె  భర్త వ్యాధి గ్రస్థుడని  తెలియసినా మనోధైర్యంతో నిలబడిన  అనంతరం ఆమె జీవితంలో ఎదుర్కున్న సమస్యలు  ఆమెని జీవితంలో రాయిని చేసి సమాజ సేవకై అంకితం చేసేలా చేశాయి.
 ఆచార విరుద్ధం అని అందరూ ముక్కున వేలేసుకున్నా నాగచంద్రిక తల్లికి తనే కర్మ కాండలు జరపడం ఆమె లోని ధృడ సంకల్పం చెబుతుంది.  తనకి చెడు చేసిన వారిని కూడా  ఆమె క్షమించింది.  ఆశ్రమంలో అవసాన దశలో ఉండే వృద్ధులకి సపరిచర్యలు చేస్తూ, వారి మరణానంతరం అంతిమ సంస్కారాలు చేయించేవారు నాగచంద్రిక. మానవసేవే మాధవసేవ అని నిరూపిస్తూ నలుగురికీ మార్గదర్శకంగా నిలిచారు.  
          నాగచంద్రిక జీవిత చరిత్రని అందరిలో మనో ధైర్యాన్ని పెంచేలా వ్యక్తిత్వ వికాసానికి దోహద పడేలా రచయిత్రి వివరించారు.  పెరిగిపోతున్న వృద్ధుల నిరాదరణ గురించి చెబుతూ  ఇంట్లో వృద్ధులని గౌరవించాలని, అది పిల్లల బాధ్యతని, పగ, ద్వేషం మనిషి పతనానికి దారితీస్తుందని చెబుతారు. 
ఈ పుస్తకంలో రచయిత్రి వృద్ధాశ్రమాలలోని వ్యక్తుల మానసిక పరివర్తన ఏలా ఉంటుందో, ఎలాటి వ్యక్తులు వుంటారో చక్కగా వివరించారు.
  ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహించడంలో ఎన్నో సమస్యలెదురవుతాయి. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కున్నారు నాగచంద్రిక. ఈ పుస్తక ఒక నవలలా సాగిపోతుంది తప్ప బయగ్రఫీ పుస్తకం అనిపించదు చదువుతుంటే.... జీవితంలో ఎదురయ్యే చీకట్లను తిడుతూ కూర్చోకుండా చీకట్లు పారద్రోలే శక్తి స్త్రీ కి వుందని నిరూపిస్తుంది. అత్యధిక స్త్రీల మరణాలలో ఆత్మహత్య చేసుకునే వారే ఎక్కువగా నమోదవుతున్నాయనే వివరాలు,  ఆత్మహత్య కారణాలు... అన్నీ వివరంగా  ఈ పుస్తకంలో రచయిత్రి తెలిపారు. 
నాగచంద్రిక ఉద్యోగ పర్వంలో ఆమెకి అభినవ కీచకులు, అభయహస్తం అందించే స్నేహశీలురూ ఎదురయ్యారు.  డబ్బే పరమార్ధంగా   జీవించే వారింటకూడా ఆమె మనోధైర్యంగా నిలబడింది. ఎంత డబ్బున్నా ఆకలి తీర్చేది అన్నమే కాని కాసులు కావని అర్ధం చేసుకోని వ్యక్తుల మధ్య  జీవించింది నాగచంద్రిక. వివాహబంధం గురించి రచయిత్రి చక్కగా వివరించారు.
 కిన్నెర వెల్ఫేర్ సొసైటీని గత 12 సంవత్సరములుగా నిర్వఘ్నంగా నడుపుతున్న  నాగచంద్రిక  పలు రాష్ట్రీయ, జాతీయ అవార్డులు అందుకున్నారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు.
రచయిత్రి డా.గురజాడ శోభాపేరిందేవి రచించిన ఆటో బయోగ్రఫీలలో ఇది మూడవ పుస్తకం. తొలుత స్వాతంత్ర్య వీరుడు కా నా, ఆమె ఓటమినోడించింది, మూడు అమావాస్య చంద్రిక. ఇంకా మరో రెండు మూడు బయోగ్రఫీ పుస్తకాలు త్వరలో రాబోతున్నాయి....
  

-మణినాథ్ కోపల్లె
9703044410




2, అక్టోబర్ 2015, శుక్రవారం

ట్రేడా ప్రాపర్టీ షో ను ప్రారంభించిన ట్రేడా


సొంతింటి కల నిజమయేనా ?
 ట్రేడా  ప్రాపర్టీ షో ను ప్రారంభించిన ట్రేడా 


  

మూడు రోజుల ప్రాపర్టీ  షో 2015 హైదరాబాద్ లోని హైటెక్స్ లో తెలంగాణా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియే షన్ ప్రారంభించింది.   ఈ షో ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ గౌరవనీయ హొమ్, జైళ్ళు, ఫైర్ సర్వీసెస్ కార్మిక ఉపాధి శాఖ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి గారు, గౌరవనీయ పరిశ్రమలు, హండ్లూం & టెక్స్టైల్స్   శాఖా మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు మరియు గౌరవనీయ నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ సి. మదన్ రెడ్డి  ప్రారంభించారు. ఈ షో లో 180కి పైగా స్టాల్ల్స్  వున్నాయి.  ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవెలపర్లు, బిల్డ్ ర్స్  హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు, బ్యాంకు లు ,  తమ సర్వీసెస్ గురించి వివరిస్తున్నారు.  గతం లో వచ్చిన సందర్సకుల కంటే ఈ సారి ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నారు. 


         దాదాపు అన్ని బాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక సహాయం, ఋణ సదుపాయాలు కల్పిస్తున్నాయి. 
          ట్రే డా అధ్యక్షులు  శ్రీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం మరియు కొనుగోలు దారుల నుంచి ఎప్పుడూ ఎంతో మంచి స్పందన వుంటోంది. ఈ సారి కుడా స్పందన బాగా వుంటుందని అనుకుంటున్నా నని అన్నారు.  రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చోటు చేసుకుంటున్నదని దీనికి బహుళ జాతి సంస్థలు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక కారణం అని అన్నారు. 

           ఏది ఏమైనా అందరిలో సొంత ఇంటి కల నిజం చేసుకోవాలి అనే ఆకాంక్ష కనిపించిండి అక్కడికి వచ్చిన సందర్సకులని  చూస్తే ....  ఎందుకంటే ఆర్ధిక సంస్థలు, బ్యాంకులు  అందించే స్టాల్స్ లలో ఆసక్తి గా విషయాలు అడగటం కనిపించింది. ప్రస్తుత వడ్డీ రేట్ 9.5% నుంచి 10% వుండటం... ఈజీ గా ఋణ సదుపాయం లభిస్తుండటం, అనువైన ధరల్లో వుండటం కూడా కారణాలుగా అనిపించాయి. 
పిండి కొద్దీ రొట్టె లాగా 40లక్షల నుంచి 4 కోట్ల వరకు ఇక్కడ ఫ్లాట్లు విల్లాలు దొరుకుతున్నాయి. ఇల్లు వద్దు జాగా కావాలి అనుకుంటే సిటీకి దూరంగా గజం 8,000 నుంచి 15,000 వరకు వున్నాయి.  Investment గా కూడా కొందరు స్టాల్ల్స్ లో విచారించ టం కనిపించింది.  






                                                                                                                                            -manikopalle

1, అక్టోబర్ 2015, గురువారం

Gandhiji Jayanthi 2 10 2015



జాతి మరువరాని వ్యక్తి మన జాతి పిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.. 




  భారతజాతి ఎల్లప్పుడు తలచుకునే వ్యక్తి జాతిపిత మహాత్మాగాంధీ.  ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 1869 లో అక్టోబరులో 2వ తేదీన జన్మించారు. అహింసావాది, సత్యవాది... ఆంగ్లేయులను తరిమి కొట్టటానికి ఆయన ఉపయోగించిన ఆయుధాలు సహాయనిరాకరణ, సత్యాగ్రహం. నిరాడంబరజీవి... బారిష్టర్ చదివి, దేశాభిమానులకు ఆరాధ్యదైవం, దేశాన్ని ఒక్క తాటిన తెచ్చిన వ్యక్తి, ఒక సాధారణ జీవితాన్ని గడుపుతూ, కొల్లాయి గట్టి, చేత కర్రపట్టి, వాడవాడలా పల్లె పల్లె తిరుగుతూ, తన ఉపన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటూ బ్రిటీష్ వారిని కబంధ హస్తాలనుంచి భరతమాత సంకెళ్ళను విడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ....   హరిజనోద్ధరణ, నూలు వడకడం  వంటి సంఘ సంస్కరణలు చేసారు.  
                       బాల్యం :  పోర్ బందర్ లోని  ఒక సామాన్య కుటుంబం లో కరంచంద్ గాంధీ,   పుత్లి బాయి దంపతులకు జన్మించారు గాంధీజీ. 13 ఏళ్లకే కస్తుర్బా తో వివాహం జరిగింది.  . వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). ఇంగ్లండ్ లో న్యాయశాస్త్రం చదివారు.  
         

గాంధీజీ ఇంటిలోని ఒక గది


 1891లో అయన తిరిగి వచ్చి న్యాయవాద వృత్తి చేపట్టారు.  1893 లోదక్షిణాఫ్రికా లోని నాటల్‌ లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది. అనంతరం 21 సంవత్సరాలు అక్కడే గడిపారు. తెల్లవాడు కాదని మొదటి తరగతి రైలు పెట్టె లోనుంచి వేట్టివేయ బడటం  హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ  దోహదపడ్డాయి.. ఒక విధముగా భారతదేశం లో నాయకత్వానికి అక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894 లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు.1914 లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు.  


           గాంధీ తమ పోరాటంలో మూడుముఖ్యమైన అంశాలను జోడించాడు.
  • "స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. 
  • "సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి  పన్నులు కట్టరాదు.   చట్టాలను ఆమోదించరాదు.   
"సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్య మున్నదనుకోవడంలో అర్ధం లేదు. 


     1946 లో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయము. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. కాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూసర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులుముస్లిములుసిక్కులుక్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజింపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. కాని  హిందూ - ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది .
       భారతీయుల స్వాతంత్య్ర పోరాటాకి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావనిని భారతీయులకు అప్పగించింది.  1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీమాత్రము కలకత్తా లో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి.
స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ-ముస్లిం విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ పై పడింది. దేశవిభజనతో ముఖ్యంగా పంజాబు, బెంగాలు లలో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్ - పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తానుపంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం. ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశారు. అప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించాడు. కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. ఆయన పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.

గాంధీ హత్య 

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూ రామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు.  1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. గాడ్సే   సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.    గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.
ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్ ఘాట్ వద్ద  చెక్కి ఉన్నది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రు రేడియోలో అన్న మాటలు: "మిత్రులారా,  జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".


]

                                                             !!హే రామ్ !!

(మేము ఇటీవల పోర్ బందర్ వెళ్ళి,  మహాత్మా గాంధీజి ఇంటిని సందర్శించి నపుడు ఫోటో గాలరి లోనుంచి తీసిన ఫోటోలు )
వ్యాసానికి ఆధారం : వికి పీడియా సౌజన్యం తో