సొంతింటి కల నిజమయేనా ?
ట్రేడా ప్రాపర్టీ షో ను ప్రారంభించిన ట్రేడా
మూడు రోజుల ప్రాపర్టీ షో 2015 హైదరాబాద్ లోని హైటెక్స్ లో తెలంగాణా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియే షన్ ప్రారంభించింది. ఈ షో ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ గౌరవనీయ హొమ్, జైళ్ళు, ఫైర్ సర్వీసెస్ కార్మిక ఉపాధి శాఖ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి గారు, గౌరవనీయ పరిశ్రమలు, హండ్లూం & టెక్స్టైల్స్ శాఖా మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు మరియు గౌరవనీయ నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ సి. మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ షో లో 180కి పైగా స్టాల్ల్స్ వున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవెలపర్లు, బిల్డ్ ర్స్ హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలు, బ్యాంకు లు , తమ సర్వీసెస్ గురించి వివరిస్తున్నారు. గతం లో వచ్చిన సందర్సకుల కంటే ఈ సారి ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నారు.
దాదాపు అన్ని బాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక సహాయం, ఋణ సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ట్రే డా అధ్యక్షులు శ్రీ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం మరియు కొనుగోలు దారుల నుంచి ఎప్పుడూ ఎంతో మంచి స్పందన వుంటోంది. ఈ సారి కుడా స్పందన బాగా వుంటుందని అనుకుంటున్నా నని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చోటు చేసుకుంటున్నదని దీనికి బహుళ జాతి సంస్థలు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక కారణం అని అన్నారు.
ఏది ఏమైనా అందరిలో సొంత ఇంటి కల నిజం చేసుకోవాలి అనే ఆకాంక్ష కనిపించిండి అక్కడికి వచ్చిన సందర్సకులని చూస్తే .... ఎందుకంటే ఆర్ధిక సంస్థలు, బ్యాంకులు అందించే స్టాల్స్ లలో ఆసక్తి గా విషయాలు అడగటం కనిపించింది. ప్రస్తుత వడ్డీ రేట్ 9.5% నుంచి 10% వుండటం... ఈజీ గా ఋణ సదుపాయం లభిస్తుండటం, అనువైన ధరల్లో వుండటం కూడా కారణాలుగా అనిపించాయి.
పిండి కొద్దీ రొట్టె లాగా 40లక్షల నుంచి 4 కోట్ల వరకు ఇక్కడ ఫ్లాట్లు విల్లాలు దొరుకుతున్నాయి. ఇల్లు వద్దు జాగా కావాలి అనుకుంటే సిటీకి దూరంగా గజం 8,000 నుంచి 15,000 వరకు వున్నాయి. Investment గా కూడా కొందరు స్టాల్ల్స్ లో విచారించ టం కనిపించింది.
-manikopalle
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి