8, డిసెంబర్ 2015, మంగళవారం

భడకేశ్వర్ మహదేవ్ ఆలయం.ద్వారక గుజరాత్

భడకేశ్వర్ మహదేవ్ ఆలయం.ద్వారక  గుజరాత్

భడ్కేశ్వర్ర్  

ఆలయానికి  దారి 




ఆలయం చుట్టూ సంద్రమే 

ద్వారకా దీశుడి  దర్శనానంతరం ద్వారకలో చూడవలసిన మరొక ఆలయం భడ్కేశ్వర్ మందిర్.  ఈ ఆలయం సముద్రం లో  వుంది. ద్వారకా బీచ్  ఒడ్డున  కొద్దిగా మెట్లు దిగి, ఎక్కితే  చిన్న  గుట్ట మీద ఈ ఆలయం వుంది. శివలింగం చిన్నదిగా వుంటుంది.  ఇక్కడి శివుని చంద్ర మౌళీశ్వరుడిగా పిలుస్తారు. శివరాత్రికి, ఇక్కడ విశేష పూజలు చేస్తారు. సూర్యాస్తమయం ఇక్కడి నుంచి చూస్తుంటే  చాలా అద్భుతం గా వుంటుంది.  సముద్రపు    అలలు  ఎక్కువై నపుడు ఆలయం చుట్టూ నీళ్ళే ! ఆలయం చేరుకోవడం కష్టం. మేము వెళ్ళినపుడు అలలు తక్కువగా వున్నాయి.  
స్థలపురాణ విశేషాలు మాత్రం తెలియరాలేదు.

కాని గోమతి నది సాగర సంగమ ప్రాంతంలో ఈ శివలింగం దొరికిందని, సద్గురు ఆదిశంకరాచార్యులు ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు.
సముద్రంలో వున్న ఈ బీచ్ ఒడ్డునే గీతా మందిర్ వుంది.  

గీత మందిర్  కృష్ణార్జునులు 

బిర్లా వారి గెస్ట్  హౌస్ 


ఈ బీచ్ ఒడ్డునే గీతా మందిర్, వుంది.  
గీత మందిర్ ద్వారకా నగరానికి సముద్రానికి పశ్చిమ తీరాన వున్న భడకేశ్వర్ మందిరాని కి దగ్గరలోనే వుంది .
ఈ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త లైన బిర్లా వారిచే 1970 లో నిర్మించారు. ఈ ఆలయం అంతా మార్బల్ రాళ్ళ తో నిర్మించారు. ఎంతో అందంగా వుండే ఈఆలయం కృష్ణార్జునుల విగ్రహాలు ఎంతో కళాత్మకంగా కళగా వుంటాయి. భగవత్ గీతను అర్జనునికి బోధిస్తున్నట్లు వుంతాయి. ఈ మందిరం లోపల విశాలమైన హాలు, హాలు చుట్టూ గోడలకి భగవత్ గీత శ్లోకాలు వుంటాయి. అంటీ కాదు ఈ మందిరం విశేషం హాలు లోపలి సీలింగ్ నుంచి రీసౌండ్ వస్తుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడ బిర్లా వారి విశ్రాంతి గదులు లభిస్తాయి.
ప్రశాంత మైన వాతావరణం లో ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఎంతో బాగుంటుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి