31, జనవరి 2012, మంగళవారం

బహుమానం - కోడీహళ్లి మురళీమోహన్ - కథ విశ్లేషణ


బహుమానం - స్వరలాసిక(కోడీహళ్లి మురళీమోహన్)  

కథ విశ్లేషణకి ఎంచుకున్న కథ ఇది.  


సాధారణంగా ట్రైన్ ఆక్సిడెంట్ జరిగింది... అంటే.... 
ముందుగా వచ్చే ప్రశ్న ఎంతమంది మరణించారు?  
ఆస్తి నష్టం ఎంత..?
ఆక్సిడెంట్ ఎలా జరిగింది..?
ఎవరైనా కావాలని చేసారా?
ఎవరైనా పెల్చేశారా? 

ఇలా అంతు లేని ప్రశ్నలు... జవాబు లేని ప్రశ్నలు... ఉద్భవిస్తాయి కాని సంఘటనని పరిశీలించిన తరువాతే ఫలితాలు  వెల్లడి తెలుస్తాయి. 
ప్రయాణికుల భద్రతా... ప్రయాణికుల అసౌకర్యాలు.... ఎంక్యిరీస్ ఇలా ఎన్నో ఉపద్రవాల మధ్య రైలు  ప్రమాదం గురించిన  ప్రశ్నలు ఉద్భవిస్తాయి ....

కాని ఎవరి ప్రమేయం లేకుండా ప్రకృతి వల్ల కూడా   రైల్వే ట్రాక్ డామేజ్ అవుతే కుడా మేజర్ accidents అయ్యే అవకాశం వుంది.

రచయిత ఆ విషయాన్ని చెప్పలనుకున్నారు. 
రైలు  పట్టాల మీద నడిచినంత సేపు  బాగానే వుంటుంది. 
అలా వెళ్ళటానికి వెనక ఎందరి కృషి వుంటుందో ఈ కథ తెలుస్తుంది.
రెండు పట్టాల మధ్య సరియైన సయోధ్య లేకపోతె రైలు పట్టాలు తప్పుతుంది. 

కథలో రైల్వే సూపర్  వైజర్ రహమతుల్ల  60 డిగ్రీల మండు టెండలో  తన డ్యుటీలో   భాగంగా  రైల్వే ట్రాక్ చెక్ చేస్తున్నపుడు... ముందుగా 
కొన్ని రైలు పట్టాల మధ్య కంకర సరిగా లేక పోవటం గమనిస్తాడు. అందుకు రైల్వే ట్రాక్ లో కొంత భాగం సిమెంట్ స్లీపెర్స్, కొంత భాగం స్టీల్ స్లీపెర్స్   వుండటం వల్ల కంకరకి పట్టు ఉండక జారిపోటం,  మట్టి మిగిలిపోవటం అవుతుంటుంది.దానికి కారణం (కంకర) బాలస్ట్ తక్కువ కావటం, పని ఒప్పుకున్నా కాంట్రాక్టర్ పని సగం లో వదిలేసి వెళ్ళిపోటం అని అనుకుంటాడు 
  "అసలు తన చేతి కింద ముప్పైమూడు మంది గ్యాంగ్‌మెన్లు ఉన్నా ఎప్పుడు సగానికి పైగా ఇతర పనులకు పురమాయిస్తాడు తన జూనియర్ ఇంజినీర్ (జే.ఇ) లింగారెడ్డి. మిగతా వాళ్లలో లీవు పెట్టిన వాళ్లు, పనికి ఎగనామం పెట్టిన వాళ్లు పోనూ గ్యాంగ్ బలం ఏడెనిమిది మంది కంటే మించదు. ఇంత తక్కువ మందితో పని నెట్టుకు వస్తున్నా పై అధికారులనుండి మాటలు పడటం తప్పలేదు" అని అనుకుంటాడు
  మరి కొంత దూరం వెళ్ళినపుడు రైల్ పట్టాలు వంగిపోయి, వంకర్లు తిరిగి వుండటం చూస్తాడు. బక్లింగ్ అంటారు దాన్ని.  అదే సమయం లో అదే ట్రాక్ పైకి ఎ.పి express  వచ్చే సమయం అవటం  వచ్చే ఉపద్రవాన్ని ఎలా ఆపాలో అర్థం కాదు రహమతుల్లకి .. 
  అయినా వెంటనే స్పందించి కూలీ లని పిలిచి, హేల్పెర్ లని పిలిచి డేంజర్ ఫ్లాగ్ ని రైల్ పట్టాల పై పాతిస్తాడు.  ఆ పని పూర్తి కాకుండానే రైల్ వచ్చేస్తుంది. లక్కీ గ రామయ్య పాతిన  డిటో నేటేర్స్ ని పేల్చు కుంటూ రైల్ ఆగి పోతుంది. ఒక్క రెండు మూడు మీటర్స్ దాటితే పెద్ద ప్రమాదం సంభవించేది. డ్రైవర్ సమయానికి స్పందించటం వాళ్ళ ఆ రైలు  ఆగిపోతుంది. 
రైల్లోని జనం ఊపిరి పీల్చుకుంటారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు...

ఆ తరువాత రైల్వే ట్రాక్ బాగు చేయటానికి రహమతుల్ల చాల కష్ట పడతాడు. 
వంగిపోయిన రైల్ పట్టాలు కట్ చేసి వేరేవి అతుకు వెయ్యాలంటే చాల సమయం పడుతుంది.
పరిస్తితి అర్థం చేసుకున్న రహమతుల్ల వెంటనే  జే. యి. తో ఫోన్ లో మాట్లాడి  కట్టింగ్  మేచిన్ , వెల్డింగ్ మేచిన్ కావాలని అడిగి  తెప్పించటం. పని వాళ్ళు, కట్  చేసిన రైల్ ముక్కల్లో (పట్టా ముక్కలు )  కొత్త రైల్ పట్టా అతుకు వేయటం... ఇలా చాల పనులు వేగవంతం చేసి... పట్టాలు బాగు చేసి express రైల్ ని క్షేమం గా గమ్యం చేరేటట్లు చేస్తాడు. 
ఈ సమయంలో అనేక రైళ్ళకి రాక పోకలకి   అంతరాయం కలుగుతుంది.
కాని సమయ స్ఫూర్తి తో superviser రహమతుల్ల చేసిన పని అక్కడున్న వారందరూ శ్లాఘిస్తారు. 
ఆ ఆనందం తో మనస్పూర్తి గా  సంతృప్తితో ఇంటికి వెళ్ళిన అతనికి 
ఆ తరువాత పై అధికారుల నుంచి మేమో వస్తుంది. 
డ్యూటీ సరిగా చేయనందుకు....
అనేక రైళ్ళ సమయాలకు ఆటంకం   కలిగినందుకు 
ప్రయానికులకి తీవ్ర అసౌకర్యం కలిగినందుకు 
అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా వచ్చిన ఉత్తర్వు అది.....

కాని ఈ కథ లో రహమతుల్ల చేసిన దేశ సేవ, అలుపెరగని నిస్వార్ధం, పని మీద ఏకాగ్రత, ప్రమాదం జరగ కుండ చుసిన సమయ స్ఫూర్తి, కొన్ని గంటల పాటు మండు టెండలో విశ్రాంతి లేకుండా పని చేయటం, చేసే పనిలో సాధక బాధకాలు. అన్ని అతనికే తెలుసు.
  ఇతని సేవని గుర్తించని ప్రభుత్వం తిరిగి అతని పైనే చర్య తీసుకోవాలనుకోవటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఉదయిస్తుంది.
జరిగిన సంఘటన పై విచారణ లేకుండా.... న్యాయ విచారణ లేకుండా అతనికి ఉతర్వ్యులు పంపటం ఈ కథకి కొస మెరుపు.
   ఈ కథలో రచయిత రైలు కి సంబంధించిన అనేక పదాలు వాడారు.
సామాన్యులు ఆ పదాలని అర్థం చేసుకుంటే ఈ కథ లోని సారాంశం బోధ పడుతుంది.
   చాల కథలలలో మాదిరి కుటుంబ కలహాలు, సూటిపోటి మాటలు అనవసర సంభాషణలు మనకి ఈ కథ లో కనిపించవు. 
కథ లో వాడిన terminology చాల కొత్తగా  వుంది..  
ఈ కథ కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని అనటం లో సందేహం లేదు.
రచయిత ఈ కథలో వాడిన ఆంగ్ల పదాలు కొన్ని ....... 

బావుటా, డిటొనేటర్లు  'బ్యానర్ ఫ్లాగ్ డౌన్ లైన్, బ్లాక్‌స్మిత్ ఎస్.ఇ.,ఏ.డి.ఇ. మోపెడ్ ట్రాలీ కళాశిల,
ట్రాక్‌, స్ట్రెసస్ ,మూడో స్లీపరు క్లిప్పులు, కె.ఎం.పి.హెచ్, క్లిప్పులు, అలైన్‌మెంట్ ప్యాకింగ్ గ్యాస్ కటింగ్, హాక్‌సా బ్లేడ్ల, రైలు , డీ స్ట్రెస్సింగ్‌ ప్లాన్, వెల్డింగ్, కాషన్ఆర్డర్‌ .... ఇలా ఎన్నో అర్ధమయ్యే చిన్న చిన్న నూతన (ఆంగ్ల) పదాలు కథలో వాడుకున్నారు.....
ఈ కథ తెలుగుదే అయినా పైన ఉదహరించిన పదాలకు తెలుగులోనే చెబితే అర్థం మారిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఆంగ్ల పదాలయితీనే సరిగా వాడుకోవటం జరుగుతుంది.

ఈ కథ నిజంగా నూతన   కథాంశం అనటం లో సందేహం లేదు.
రైలు అంటే రైలు బండి, రైలు పట్టాలు అనే అందరు అనుకుంటారు 
కాని ఒక రైలు పట్టాల పైకి రావాలంటే ఎందరి కృషో అవసరమని ఈ కథ ద్వార అర్థమవుతుంది. 



 మణి కోపల్లె  
    


30, జనవరి 2012, సోమవారం

జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి


   
నేడు జాతిపిత   మహాత్మా  గాంధీ  వర్థంతి

    ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ మనకి దూరమైన రోజు.



జాతిపిత బాపూజీ   సరిగ్గా  అరవై మూడు సంవత్సరాల క్రితం ఈ రోజు 
ఓ దుండగుడు నాధూ రామ్  గాడ్సే చేతిలో హతమైన రోజు.
జాతి యావత్తూ సోక  సంద్రం లో మునిగిన రోజు
వారి జీవితం లో అందరం కొన్ని సంఘటనలు అయినా తలుచుకునే రోజు   
గాంధీ జననం               
              "మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబర్ 2వ తేదీన (శుక్ల నామ సంవత్సరం భాద్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించారు . ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి  పుత్లి బాయి.
గాంధీగారి  విద్యాభ్యాసం  పోర్బందర్ లోను, రాజ్కోట్ లోను జరిగింది 



గాంధీజీ కి పదమూడు సంవత్సారాల వయసు లోనే కస్తుర్బాతో  1882 లో  వివాహం జరిగింది.
ఈ దంపతులకి  నలుగురు పిల్లలు  (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ).
ఆ తరువాత 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళారు 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చారు  న్యాయ వాద వృతి స్వీకరించిన ఆ తరువాత దక్షిణ ఆఫ్రికా లో ఒక సంవత్సం లా కంపెనీ లో కాంటాక్ట్ ఉద్యోగం లభించింది.



గాంధీజి ఒక సంవత్సరం అనుకున్నవారు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు (1893 -1914)  వరకు ఆఫ్రికాలో వున్నారు. అక్కడే వారికి జాతి వివక్షత ఎదురయ్యింది. కేవలం తెల్లవాడు కానందువల్ల వారిని రైలు బండి మొదటి తరగతి పెట్టె లోంచి నెట్టివే సారు. అక్కడి హోటళ్ళలోకి రానివ్వలేదు ఇటువంటి ఎన్నో సంఘటనలు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి ఇటువంటి  వాటిని ఎదుర్కోవలసిన బాధ్యత వుందని గ్రహించారు,  గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధి విధ నాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి.భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ,  అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయటం  ఆయన చేసిన మొదటి పని.   
వీరు అనేక ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం వలన వారి   ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపేవి . అందులో భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించారు. దక్షిణాఫ్రికాలో "ఫీనిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్" లలో ఆయన సామాజిక జీవనాన్నీ, సౌభ్రాత్వత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేసారు ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ
గాంధీజీ కుటుంబం 
 ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకొన్నారు.

.              ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించారు . విపరీతమైన జనాదరణ పొందారు.  క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము.1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచారు  .భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది. .ఆ తరువాత వ్రుధంగా జాతీయోధ్యమాల్లో పాల్గొన్నారు.
స్వతంత్ర సిదికై విదేశి వస్తు బహిష్కరణ, స్వదేశి వస్త్ర ధారణ ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, జాతీయ విద్య మొదలైన ఉద్యమాలు జరిగాయి.
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గోనసాగారు 1924 లో భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వున్నారు. బెల్గావ్ (కర్ణాటక) లో జరిగిన  39  వ అఖిల భారత సమావేశాల్లో ప్రెసిడెంట్ గా వున్నారు.    ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కివెన్ను దన్నుగా నిలిచారు. 
1921  లో   ఆంధ్ర దేశ పర్యటన చేసారు  వారి  ఉపన్యాసాల కి విశేష స్పందన లభించింది
 ఎందఱో ఉదారంగా విరాళాలు అందిచారు. మహిళలు తమ నగలను ఒలిచి ఇచ్చారు గాంధీజి స్ఫూర్తి తో దేశమంతా  
 ఏక తాటి మీద నిలిచింది.  
సబర్మతి ఆశ్రమం 


సబర్మతి ఆశ్రమం 
గాంధీ ఆశ్రమం , హరిజన ఆశ్రమం, సబర్మతి ఆశ్రమం ఎలా పిలచిన ఒకటే. గుజరాత్ లోని అహమదాబాద్ దగ్గర సబర్మతి నది ఒడ్డున ఈ ఆశ్రమం  నెలకొల్పబడింది.   దండి మార్చ్ ఇక్కడినుంచే ప్రారంభమైంది అందుకే ప్రస్తుతం దండి మార్చ్ గుర్తుగా దీనిని గుర్తిస్తున్నారు.   వేలాది మంది బ్రిటిష్ వారి పన్నుల విధానానికి నిరసనగా దండి మార్చ్ లో పాల్గొన్నారు. 
గాంధీ చరఖా 
ఉద్యమాల పోరులో గాంధీతో పాటు జవహర్లాల్ నెహ్రు సుభాస్ చంద్ర బోస్, వల్లభి పటేల్ ఇంకా ఎందఱో దేశ నాయకులు పాల్గొన్నారు. జైళ్ళకి వెళ్లారు. వీరంతా సంవత్సరాల తరబడి జిల్లాల్లో మగ్గారు.

తెల్లవారి పాలనకి విముక్తి కలగటానికి క్విట్ ఇండియా ఉద్మమం చివరిది అది ఎంతో దోహదం చేసింది. ఆ తరువాత గాంధీజీ ఇంగ్లాండ్ కి రౌండ్ టేబుల్ సమావేశంకి   ఏకైక ప్రతినిధిగా హాజరయ్యారు.కాని ఆ సమావేశం అంతగా సఫలం కాలేదని చెప్పచ్చు ఆ తరువాత నిరాహార దీక్షలు,  కారాగార వాసాలు ఎక్కువయ్యాయి.
      బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది."క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేసారు .










 "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము."  డూ ఆర్ డై"  "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది. ఈ సందర్భంలో 1942  లో అరేస్ట్   అయిన  గాంధిజీ పూనా జైలు లో ఉండి 1944  లో విడుదలయ్యారు. కాని కస్తూరిబా గాంధీ పది నెలల కారాగార వాసం తరువాత మరణించారు.
       1946లొ స్పష్టమైన  బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదనకి వచ్చినపుడు గాంధీజీ అంగీకరించలేదు. కాని కాంగ్రెస్ వారు గాంధీజీ మాటను తోసి పు చ్చారు నెహ్రు తదితరులు. ఆ తరువాత జరిగిన దేశ విభజన  జరిగి దేశం పాకిస్తాన్ ఇండియా రెండుగా చీలిపోయింది  దేశ విభజన కి గాంధీజీ వ్యతిరేకించారు. కాని . ఆ సమయం లో  జరిగిన హింసా కాండలో దాదాపు ఐదు వేల మంది మరణించారు.
       చివరికి  మన దేశానికి 1947 ఆగస్ట్ 15 న స్వాత్రంత్యం లభించింది. ఆ రోజు దేశమంతా  సంబరాలు జరుపు కుంటుంటే గాంధీజీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపారు. మత విద్వేషాలు మారణ కాండ వారిని ఎంతో బాధ పెట్టాయి.

గాంధీజీ చివరి ఫోటో 
గాంధీజి  హత్య

1948 జనవరి  20  వ తేదిన మొదటిసారి గాడ్సే బృందం తో హత్య ప్రయత్నం జరిగింది. దానికి గాంధిజీ "వాళ్ళు పిల్లలు! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పొయ్యక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని" అని అన్నారు.
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధనా సమావేశానికి వెళ్తుండగా ఆయనను  నాధూరాం  గాడ్సే   కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ"హే రామ్" అన్నాడని చెబుతారు. ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన  రాజఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది.  
కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించారు.  మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యులు.  
సామాన్యుడి చేతికి సత్యాగ్రహమనే ఆయుధాన్ని అందించి, అహింసే పరమ ధర్మమని విశ్వసించి, మూర్తీభవించిన శాంతంగా పేరొందిన గాంధీజి 



" సర్వజన హితం నా మతం .అంటరాని తనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే 
నా ఆయువు అంకితం"   -   అనే గాంధీ గారి సందేశం నేడు అందరు గుర్తించాల్సిన విషయం.
ఆ మహాత్ముని ఈ రోజైనా స్మరించుకోవటం భారతీయులుగా మనందరి ధర్మం.





జై హింద్ 

28, జనవరి 2012, శనివారం

Ambika Ananth gari katha - kodagattarani deepalu

సాహితి అభిలాషులకి వందనాలు !

కథ జగత్ లో నేను ఎంచుకున్న కథ:
 అంబిక అనంత గారి  -   కొడగట్టరాని  దీపాలు ....  కథ  లింక్ : 
ఈ కథ లో రచయిత్రి నేటి సమాజంలో జరుగుతున్న హింస... దానికి కారణమైన ఆధునికత ..... పిల్లలపై దాని ప్రభావం ఎంతో చక్కగా వివరించారు.
చైల్డ్ సై కాలజి పై జరిగిన విశ్లేషణ కథ ఇది. 
   పిల్లలు entertainment పేరిట కంప్యూటర్ లో ఆడుతున్ననూతన  టెక్నాలజీ  ఆటలపై
  అడిక్ట్ అవుతూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే కథనం ఇది.

నేడు పిల్లలకి అట స్థలాలు కరువైపోయాయి. స్నేహితులు తగ్గిపోతున్నారు చదువుల పేరుతొ పిల్లలకి ఆటవిడుపుగా చదువు తరువాత  ఇంట్లోనే వుండి మనో వికాసం పేరుతొ ఎక్కువగా వినోదాన్ని అందిచ్చేది కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయటం మూడు నలుగు సంవత్సరాల నుంచే నేర్చుకుంటున్నారు. కీ బోర్డు పై బుల్లి చేతులు ఆడిస్తూ గేమ్స్ ఆడుతుంటే ఇటు తల్లి తండ్రులు ఆనందిస్తున్నారే తప్ప అభ్యంతర పెట్టటం లేదు.
ఎందుకంటే ఇప్పటినుంచే (ఆ వయసు) నుంచే కంప్యూటర్ నేర్చుకుంటే పెద్దయ్యాక ఈజీ గ కంప్యూటర్    experts అయిపోతారని తల్లి తండ్రుల ఆశ.

ఇక కథాంశాని  కొస్తే  .....
ఈ నేపధ్యం లో ఈ కథ లో తల్లి తండ్రులు పెద్ద professionals అయి వుండి  వారి వారి వృతుల్లో బిజిగా వుంటూ కూడా  కొడుకుని  జాగ్రత్త చూసుకుంటూ వుంటారు.... కాని పిల్లవాడు విజయ్ ప్రవర్తనలో మారే మార్పుని  ఏమాత్రం వాళ్ళు గమనించరు.
                                                 ***
ఆనంద్ తండ్రి మరణం హత్య అని తెలిసి ఇంత ఘోరం గా ఎవరు చంపి వుంటారో అని అనుకుంటాడు. ఇటు పోలీసులకి కూడా అంతు చిక్కదు ఈ మిస్టరీ .
రక్తపు మరకల్లో తాత  శవం చూసి కొడుకు విజయ్ రాత్రిళ్ళు నిద్రపోవటం  లేదని  అనటం   కలవరపెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకు వెడుతుంది డాక్టర్ విమల.  తను పెద్ద గైనకలగిస్ట్ అయినా కొడుకుని తనకి సీనియర్, చైల్డ్ స్పెషలిస్టు అయిన డాక్టర్ వర్మ దగ్గరికి తీసుకు వెడుతుంది.  
          డాక్టర్ వర్మ విజయ్ ని చదువు ఆటలు గురించి ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నల్లో కంప్యూటర్ లో ఆడే ఆతల గురించి అడిగినపుడు "కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు నేనెప్పుడు ఓడిపోలేదు. ఐ యాం ఆల్వేస్ ఎ విన్నెర్" అని అంటున్నపుడు ఉత్షాహం, గర్వం పోటిగా ధ్వనిస్తాయి విజయ్ గొంతులో. మాములుగా ఆడే ఆటలకన్న హింసని ప్రేరేపించే ఆటలంటే విజయ్ కి ఇష్టం అని గ్రహిస్తాడు డాక్టర్ వర్మ. విజయ్ ఆడే ఆటల పేర్లు కూడా విచిత్రం గా వుంటాయి. 
        "షాడో వారియర్, బ్లడ్ ఆర్మగేద్దన్ ఫ్రాంకినస్తీన్..." ఇలా ఆటల పేర్లు చెప్పేటప్పుడు విజయ్ మొహం ఉద్రేకం తో ఎర్రబడటం   విజయ్ పల్ల్స్ చెక్ చేసినపుడు రాపిడ్ గా ఉండి ఎక్సిటేడ్ గా వుండటం   గమనిస్తాడు డాక్టర్ వర్మ  
         విజయ్ లోని మార్పు కొద్దిగా అర్ధం అయిన డాక్టర్ ఆ మరునాడు తన సై కా లజి ఫ్రెండ్ డాక్టర్ రమేష్ ని తీసుకుని వెళ్తాడు. విజయ్ తో గేమ్స్ ఆడటం మొదలు పెట్టి విజయ్ స్కోరు ని దాటి గెలుస్తున్న సమయం లో విజయ్ లో విపరీతమైన మార్పు నివ్వేరపరుస్తుంది..... విజయ్ వెనకనుండి డాక్టర్ రమేష్ మెడ చుట్టూ చేతులు బిగిస్తాడు. ఉద్రేకం తో వుగిపోతుంటాడు . నలుగురు మనుషులు కలిసిన విజయ్ వేరి బలం ముందు ఆగలేక పోతారు. రచయిత్రి  పిల్లలల్లో కలిగే మార్పుని ఇక్కడ సహజం గా వర్ణించారు.
     విజయ్కి  ఏ ఆటల్లోనూ ఎప్పుడు తనే గెలవాలని కోరిక వుంటుంది. వోడిపోవటానికి ఇష్టపడడు. ఎవరైనా గెలుస్తున్నారంటే సహించలేడు .ఆ విపరీత ధోరణితో తన తాతగారు ఆటల్లో గెలుస్తుంటే ఐరన్ బాక్స్ తో తల మీద కొట్టి నపుడు ఆయన చనిపోతాడు. 
చిన్నపిల్లలలో ఇటువంటి ధోరణి కొద్ది మందికి మాత్రమే ఎక్కువగా వుంటుంది. తల్లి తండ్రులు అందుకే జాగ్రత్తగా తమ పిల్లలని గమనిస్తూ వుండాలి 

ఈ కథలో పిల్లల ప్రవర్తన కంప్యూటర్ లో ఆడే ఆటలు చాల ప్రభావాని చూపుతున్నాయనటానికి   ఇదో ఉదాహరణ. 
అందులోను పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా రూపొందించే ఆటల్లో పేర్లు, ఆటల విధానం ఎలా వుంటుందో చక్కగా వివరించారు రచయిత్రి. 
ఉదాహరణకి 
1 .ఈ గేమ్ కార్మెగెడ్డాన్... రోడ్డు మీద మనుషుల్ని కారు క్రింద క్రష్ అవుతుంటే   కంప్యూటర్ స్క్రీన్‌మీద నెత్తుటి ముద్దల్లా కనిపిస్తున్న శవాలు పిల్లలపై చూపే ప్రభావం 
2  "ప్రాంకిన్‌స్టిన్ త్రూద ఐస్ ఆఫ్ ఎ మాన్‌స్టర్" లో ఒక భయంకరాకారం ఒక అమ్మాయి మెదడుని పుర్రెలో నుండి తీసి, దాన్ని సూప్ చేసుకుని తాగుతున్నవైనం, ఎంతో వాస్తవంగా, జలదరింపు కలిగేలా వుంటుంది.
'బ్లడ్' అనే గేమ్‌లో శతృవుకి నిలువెల్లా నిప్పంటించి నృత్యం చేయించే దృశ్యం, తలతో ఫుట్‌బాల్ ఆడే దృశ్యాలు 
ఇటువంటి ఆటలు పిల్లలో ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుపుతూ  అమెరకలో ఒక బాలుడు నలుగురు పిల్లలని, ఒక టీచర్ ని హత్య    చేసిన వుందంతాన్ని   రచయిత్రి ఒక పాత్ర ద్వారా వివరిస్తారు .   'చాల మంది పిల్లలు  హంతకులుగా మారుతున్నారు' అంటు నేటి సమాజంలో చిన్నారులు  వికృత చేష్టలకు ఎలా పాల్పడుతోంది, దానికి కారణాలు చక్కగా వివరించారు.  అమాయకంగా వుండే విజయ్ తనకి తెలీకుండానే తన తాతగారిని హత్య చేయటం అనేది సమాజాని ప్రశ్నించేలా  వుంది. 

సమాజంలో విష సంస్కృతిలా  మారుతున్న ఈ కంప్యూటర్ ఆటల ప్రభావాన్నుంచి చిన్నరులని  దూరంగా ఉంచేలా చూడవలసిన బాధ్యత తల్లి తండ్రులది, సమాజానిది. 
నేటి బాలలే రేపటి పౌరులే  అన్న సూక్తి గుర్తుంచుకోవాలని రచయిత్రి గుర్తు చేస్తున్నారు.


25, జనవరి 2012, బుధవారం

"sathyam" sri valli radhika

కథ విశ్లేషణలో   నేను ఎంచుకున్న కథ శ్రీ వల్లి రాధిక గారి "సత్యం" 
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/satyam---ti-srivalliradhika

ఈ కథ ప్రధమ పురుష లో (నేను ...లో ) కథనం సాగుతుంది.

ఒక గృహిణి సాధారణం గా తన చుట్టూ జరిగే సంఘటనలని గమనిస్తూ తనలో తనే ఆ సంఘటనలని విశ్లేషిస్తూ వుంటుంది. పక్కింటి శైలజ ఇంటిని  , ఉత్తరాన వున్నా స్కూల్ వాతావరణం అలాగే వచ్చే పోయే వారిని  గమనించటం ఆమె దినచర్య.

  తల్లి చేయవలసిన పని ఆమె కొడుకు సంతోష్ చిన్న వాడు. బడి ఆవరణ ఊడుస్తూ, పనులు చేస్తూ  చెల్లిని చూస్తూ చదువుకోవటం ఆమెకి ఎంతో ముచ్చట వేస్తుంది.   అందరికన్నా ముందు వచ్చి అంతా శుభ్రం చేస్తూ చదువు కుంటుంటాడు.  .  
తల్లి పని చేసే యజమాని అటువేపు వెళ్తూ, సంతోష్ ని చూసి ఆగి "తల్లి పనికి రాలేదేమని"   అడిగినపుడు "తల్లికి జ్వరం" అని సంతోష్ జవాబు చెబితే ఆవిడ  వెక్కిరింతగా "నాలుగు రోజులనుంచీ జ్వరమేనేమిట్రా దొంగవెధవా!" అని వాడిని కసురుతుంది.   
     
"మీరింతేరా! ఎంత చేసినా మీ బ్రతుకులింతే. మీ దొంగ బుద్ధులూ, అబద్ధాలూ మారవు." అని ఛీత్కరించి వెళ్ళి పోయింది.


ఈ మాటలు ఆమెలో ఎంతో విశ్లేషణ సాగిస్తుంది ఆమె. 

ఈ కథ సాంతం "మీరింతే" అనే పదం మీదే చాలా మనో విశ్లేషణ చేస్తుంది నేను అనే పాత్ర.... 

ఇందులో నిజం ఏమిటి అని ప్రశ్నించు కుంటుంది ఆమె. నిజంగా సంతోష్ వాళ్ళమ్మకి జ్వరం వచ్చిందా లేక వాడు అభద్దాలు  ఆడుతున్నడా? . 

అల్లాగే శైలజ తన ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి పనులు చేస్తున్న సత్తేమ్మని కూడా ఎప్పుడు ఏదో ఒక టి అంటూనే వుంటుంది.   "నువ్వింతే. నువు పని దొంగవి.  నీకు బద్ధకం. కాసేపు ఏమారితే నువు పనంతా ఎగ్గొట్టేస్తావు!" అని శైలజ సత్తెమ్మని సతాయించటం లోని నిజమెంత? సత్తెమ్మ నిజంగానే పని ఎగ్గొట్టే మనిషేనా ?  ఇవన్ని ఆమెలో ఎంతో అంతర్మధనానికి రేకెత్తిస్తాయి. 
    అవన్నీ చూస్తున్న ఆమెకి చుట్టూ ప్రపంచం ఇంతేనా అని కూడా ప్రశ్నించుకుంటుంది 

చుట్టూ   వున్న ప్రపంచం లోని రెండు వర్గాలు ఉన్నవారు-లేని వారు, ప్రభుత్వము- ప్రతి పక్షము, ఆస్తికులు నాస్తికులు ఇలా అన్ని చోట్ల రెండు అభిప్రాయాలు వున్నట్లు ఇరువుకి ఏకాభిప్రాయం లేదు అనే ఆలోచన సాగుతుంది ఒకరినొకరు  అగ్రవర్ణాలూ.. అణగారిన వర్గాలూ.. అందరూ.. మీరింతే అంటే మీరంతే అని దెప్పిపొడుచుకోవడమే. 

మీరింతే మీద రచయిత్రి ఎంతో లోతుగా... సిద్ధాంతాలను ఎన్నో రకాలుగా... విశ్లేషిస్తారు. 
చివరికి  పక్కింటి సత్తెమ్మ ఆమె సిద్ధాంతాలకు   కళ్ళెం వేసినట్లుగా కనువిప్పు కలిగిస్తుంది.   
సత్తెమ్మని  యజమాని శైలజ ఎప్పుడు పనిచేస్తున్న తనని ఎందుకు అల్లా తిడుతూ వుంటుంది అన్నందుకు  సత్తెమ్మ  ఇచ్చిన జవాబు "ఆమె చేసుకోలేదు కాబట్టే కదమ్మా చేసేవాళ్ళలో తప్పులు కనబడేది. ఆమె కూడా పని చేయడం మొదలు పెడితే పనిలో కష్టం ఆమెకే తెలిసొచ్చుద్ది కదా!”  అంది. ఈ జవాబు ఆమె ఆశ్చర్యపోతుంది . ఆమె  ఆలోచనల్లో మార్పు వస్తుంది.
         అంతవరకూ  'ఇది ఇలా వున్నపుడు అది అలా ఎలా వుంటుంది!' అని ఆలోచించడం మాత్రమే తెలిసిన ఆమెకి  'ఇది ఇలా వుంది కాబట్టే అది అలా వుంటుంది’ అన్న సత్తెమ్మ మాటలు కొత్త కోణాన్ని చూపిస్తాయి.

"ఏ విషయాన్నయినా 'ఇదింతే' అంటూ తీర్మానించడానికీ, నిరసించడానికీ కాస్తంత అహంకారం చాలు. కానీ 'ఇదింతే' అని అంగీకరించడానికీ, ఆచరించడానికీ బోలెడంత సంస్కారం కావాలి" అని నిర్ణయించుకుంటారు. 
అంతే కాదు భయం అనే మాటని సత్తెమ్మ ద్వారా చెప్పిస్తారు రచయిత్రి 


"భయం వున్నచోట విచక్షణ నశిస్తుందేమో! ఏది చేయకూడదో .. ఏది చేస్తే సరిగ్గా మనం భయపడ్డ విషయం జరుగుతుందో సరిగ్గా అదే చేయడం జరుగుతుందేమో!  " అని తనలో తాను విశ్లేషించుకుంటారు రచయిత్రి . 

ఈ కథలో పాత్రలు ఎక్కువ లేవు. ఫస్ట్ పర్సన్ లో నడిచే ఈ కథనం లో 
చక్కటి తర్కం, మనో విశ్లేషణ, చుట్టూ పరిసరాలను నిశితంగా పరిశీలించే చక్కటి మేధో దృష్టి, ధనిక పేద వర్గాల మధ్య జరిగే నిరసన భావం గృహ యజమాని - పనివారి పై జరిపే అధికారం (చిన్ని మాటలు మాత్రమే ఉపయోగించి )  రచయిత్రి పాత్ర ద్వార తన నిరసన, బాధ అన్ని వ్యక్తం చేస్తారు. 

"మీరింతే" అనే ఒక్క మాట మీదే  అన్ని రచయిత్రి తన భావ జాలం లో చక్కగా తెలిపారు.

చివరికి ఒక పాత్ర సత్తెమ్మ ద్వారా నిజం (సత్యం) తెలుసుకుంటుంది 

నాకు తోచిన symbolism (పోలిక) 
  మార్కెట్ కి   ఆమె ముందు వెడుతుంటే వెనక సత్తెమ్మ వచ్చి కలిసినపుడు ఇద్దరు నడుస్తూ సంభాషించుకుంటారు...
కథ చివరికి వచ్చే టప్పటికి సత్తెమ్మ ముందు ఆమె వెంక నడుస్తుంటారు.

కథలో ఆమె ఆలోచనల్లో తనకి తనే విశ్లేషించుకుంటూ తనదే కరెక్ట్ అనుకుంటుంది.... 
కాని సత్తెమ మాటల్లో ఆమెదే  అసలు సత్యం తెలిసి ఆమె ఆలోచనల్లో వచ్చిన మార్పుని రచయిత్రి తెలిపారు    

ఈ మనో విశ్లేషణ కథ సత్యం - చదవితే రచయిత్రి అంతరంగం  తెలుస్తుంది. ఈ పరిశీలన ఆమె వోక్కరిదే కాదు ప్రతి ఒక్కరు గమనించాలిసిన విషయాలు. ఈ సత్య శోధన నలుగురిని ఆలోచింప చేసేదిగా వుంది.

   వసంత సమీరం 


మణి కోపల్లె