11, నవంబర్ 2015, బుధవారం

మురుకులు

మినపప్పు మురుకులు   
మినపప్పు     :      1 గ్లాస్   
బియ్యం        :      4 గ్లాసులు 
 (రెండు  కలిపితే 1 kg పిండి )
వెన్న             :     1 కప్ 
నువ్వులు      :        100 grams
వాము          :         4  tsp
నూనె            :       వేయించడానికి సరిపడినంత  (1 Lit Packet)
పచ్చిమెరపకాయలు  :  1/4 kg  (కారం కావాలనుకునే వారికి )
ఇంగువ        :       2  tsp 
తయారి విధానం  :  
1. ముందుగా మినపప్పు దోరగా   వేయించి పెట్టుకోవాలి. 
2.  బియ్యం కడిగి వెంటనే నీడలోనే  ఆరబెట్టాలి. బియ్యం నానకూడదు.
    ఎండిన వెంటనే (అంటే  బాగా గల గల మనేల  ఎండకూడదు.)
3. బియ్యం, మినపప్పు కలిపి గిర్నీ లో  మెత్తగా పిండి ఆడించాలి.
4.  పెద్ద పళ్ళెంలో మినపప్పు, బియ్యం కలిపి మరాడించిన పిండి వేయాలి.  అందులో ఉప్పు, వెన్న, వాము, నువ్వులు వేసి బాగా కలపాలి.   ఆతరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుతూ కొద్దిగా గట్టిగా కలపాలి. 
5. పిండి మొత్తం ఒకేసారి కలపకుండా జంతికల గొట్టం లో పిండి వేసి బాగా కాగిన నూనెలో చక్రాల్లా పిండిని వత్తాలి. 
6.  తెల్లగా ఉన్నపుడే వాటిని తీయాలి.  చల్లారాక అవి కర కర మంటూ బాగుంటాయి. 
7   కారం కావాలనుకునే వారు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి, ఆ పేస్ట్ కలపాలి. అవి కుడా తెల్లగా వుండి చూడటానికి బాగుంటాయి.

టిప్స్ : 
1. పిండిని ముందు బాగా కలుపుకోవాలి. తరువాతే నీళ్ళతో కలపాలి. 
2, ఎర్రగా కావాలనుకునే వారు పచ్చి మిరపకాయలకి బదులు ఎండు కారప్పొడి వేసుకోవచ్చు.  
3. వెన్న ఇంట్లో లేనపుడు అముల్ బటర్ కూడా వేయచ్చు. 
4.  అన్ని ఒకే కలర్ వచ్చేలా చూసుకోండి.
5. తెల్లగా వున్నా చల్లారాక  గట్టి పడతాయి.



పచ్చిమిర్చి వేసిన మురుకులు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి