8, ఫిబ్రవరి 2016, సోమవారం

bet dwaraka బెట్ ద్వారక , గుజరాత్

  
బెట్ ద్వారక  (BET DWARAKA)
పురాతనమైన ఆలయం - శ్రీ కృష్ణుడు నివసించిన రాజప్రాసాదం  
ద్వారకా మహత్యం గురించి స్కంద పురాణంలో ఏడవ ప్రభాస కాండం  .లో   వివరంగా చెప్పారు.  ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడు నివసించిన ప్రదేశం బెట్ ద్వారక.  ఆ స్థల విశేషాలు.....  
బెట్ ద్వారక  ఒక  చిన్న ద్వీపం.  
ద్వారకా పట్టణానికి ఉత్తరంగా, ముఫై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున  ఓకా పట్టణం  వుంది.  అక్కడి నుంచి  ఫెర్రీ ల ద్వారా   బెట్  ద్వారకా   చేరుకోవచ్చు.  బెట్  ద్వారక అంటే  శ్రీ కృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుదాముడు (కుచేలుడు) బెట్ అంటే  బహుమతిని ఇచ్చిన ప్రదేశం అని.  పేదవాడైన కుచేలుడు గుప్పెడు అటుకులని శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించినది,  కుచేలుడి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించిన ప్రదేశం  ఇక్కడే...  బెట్  ద్వారక శ్రీ కృష్ణుడు తన కుటుంబంతో  పరివారం తో నివసించిన ప్రదేశమని కూడా. గోమతి  ద్వారకా పట్టణం లో శ్రీకృష్ణుడు తన దర్బారుని  నడిపించాడని రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని అంటారు. ఇది  చాలా పవిత్రమైన ప్రదేశం. 
            అలనాడు శ్రీ కృష్ణుడి నిర్యాణానంతరం అసలైన ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోగా మిగిలిన చిన్న భూభాగమే  ఈ బెట్ ద్వారక.  ప్రధాన ఆలయమైన ద్వారక లో వున్న ద్వారకాధీశుడి విగ్రహం లాగానే ఈ బెట్ ద్వారకా లో కుడా ఉంటుంది.  ఈ రెండు విగ్రహాలాలో  చేతిలోని గద ధారణలో మాత్రం మార్పు వుంటుంది.  సైజు లో కూదా కొంచెం చిన్నగా  వుంటుంది విగ్రహం. 
     శ్రీ కృష్ణుడి భక్తుడైన వల్లభాచార్య   దీన్ని నిర్మించినట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి తో పాటు  ఆలయం లో ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు,   దేవకీ ఆలయాలు వున్నాయి.  ఉత్తర, దక్షిణ  దిశలో గరుడుడి ఆలయం ఉంది.  కృష్ణుడి ఆలయం సమీపంలో,  తూర్పున  సాక్షి గోపాలుడి ఉత్తరాన రుక్మిణి, రాదా దేవి  ఆలయాలు, జాంబవతిమొదలైన  మూర్తుల ఆలయాలు కూడా వున్నాయి. 
ఇక్కడ చాలా మంది భక్తులు  గోధుమపిండి, ఇతర ఆహారపదార్ధాలు దానంగా ఇస్తారు.  బెట్ ద్వారక  ఆలయంలో మధ్యాహ్నం 1 గంటకి మహా ప్రసాదం గా    భక్తులకి భోజనం పెడతారు 
    బియ్యం పళ్ళెంలో  దక్షిణ పెడితే  కొంచెం బియ్యం చేతిలో  ప్రసాదం గా ఇస్తారు.  ఆ బియ్యాన్ని ఇంట్లోని  బియ్యం లో కలుపుకోమని చెబుతారు.  బియ్యాన్ని ప్రసాదం గా ఇవ్వటం ఇక్కడే కనిపించింది.
ఇక్కడ పెద్ద గోశాల కూడా  వుంది.

బెత  ద్వారకా  ఒడ్డు 
భౌగోళికంగా ....
 బెట్ ద్వారక పురాణాల కాలం నుంచీ ఎంతో ప్రసిద్ది చెందింది.  ప్రస్తుత యుగం లో ఆ స్థల ప్రాశస్త్యాన్ని గురించి అనేక పరిశోధనలు జరిగాయి... జరుగుతున్నాయి.
ఈ అతి ప్రతి ప్రాచీనమైన బెట్ ద్వారకాలో పురా వస్తు  శాఖ వారు,  నిర్మాణ  శాస్త్ర  నిపుణుల బృందాల పరిశోధనా ఫలితాల ద్వారా  ఈ బెట్ ద్వారకలో వాణిజ్య వ్యాపారాలు విస్తృతంగా జరిగేవని తెలిసాయి.  ఇక్కడ లభించిన మృణ్మయ పాత్రలు, నాణేలు, రాగి చేపల గాలాలు,  రాతి లంగర్లు, హరప్పన్ ల కాలం నాటి మట్టి పాత్రలు పాత్రలు  ఇంకా ఇతర పాత్రలు లభించాయి.  అంతే కాదు ఈ బెట్ ద్వారక ద్వీపం, దాని చుట్టు పక్కల ప్రదేశాలు  సముద్ర తీవ్రత మూలంగా భూమి ఊచకోతకు గురయింది. 
ఇక్కడ  లభించిన రక రకాలైన రాతి లంగర్లు అక్కడ లభించే రాళ్ళతో చేసినట్లు తెలుస్తోంది.  లబించిన  సత్తు బిళ్ళలు, సత్తు లంగర్లు, ఇంకా లభించిన  నౌకా  అవశేషాలను బట్టి అక్కడ రోమన్  వ్యాపార సంబంధాలు తెలియ జేస్తున్నాయి.    బెట్ ద్వారక పురాతనమైన,  ప్రధానమైన రేవు పట్టణం అని తెలుస్తోంది.  ఈ బలమైన రాతి లంగర్ల వాళ్ళ నౌకలు కొట్టుకు పోకుండా ఆపేవి. అత్తర్లు, ద్రాక్షరసం వంటి వ్యాపారాలు క్రీ.పూ.4 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 4 వ. శతాబ్దం వరకూ కూదా విస్తృతంగా జరిగేవని అక్కడ లభించిన సీలు వేసిన కూజాలు, నౌకా అవశేషాలు చూస్తె  తెలుస్తుంది .  
ఒడ్డున దిగాక  ఈ  చిన్న  బ్రిడ్జి  మీదుగా  బేట్ ద్వారకా  చేరుకోవాలి.  
ద్వారకా నగరం లోని జామ్ నగర్ జిల్లాలో  సముద్ర మట్టం లో వుంది. ఇక్కడికి రాజ్ కోట్  వరకు  కాని, అహ్మదాబాద్ వరకు కాని రైల్ లో వచ్చి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ద్వారక చేరుకోవచ్చు.  ద్వారక నుంచి రానూ పోనూ మాట్లాడుకుని  ప్రైవేట్ వాహనాల ద్వారా ఒఖా చేరుకోవచ్చు.  అక్కడినుంచి సముద్రంలో ప్రయాణించి బెట్ ద్వారక చేరుకోవచ్చు.  ఈ ఆలయం సముద్రమట్టానికి కొద్దిగా ఎత్తులో గుట్ట మీద వుంటుంది.

 

మా అనుభవం :
ద్వారకా నగరి  నుండి మేము చుట్టుపక్కల ప్రదేశాలు చూడటానికి పది మంది అక్కడి లోకల్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లో బయలు దేరి ముందుగా గోపితలాబ్, నాగేశ్వర్ చూసి, బెట్ ద్వారక చేరుకున్నాము. రోడ్డు మీద నుంచి  10 ని. నడిచాక సముద్రపు పడవలు వుండే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ 20 ని.లు వెయిట్  చేసాక ఆవలి ఒడ్డున వున్న బెట్ ద్వారక ద్వీపానికి ఫెర్రీ లో చేరుకున్నాము. 
నడి సంద్రం లో నావ 
ఇక్కడ సముద్రం మీద ఎగిరే పక్షులు యాత్రికులని ఆహ్లాద పరుస్తాయి.  ఒక్కో ఫెర్రీ లో వంద మంది పైగా వుంటారు.  ఫెర్రీ లు కూదా ఒక పద్ధతిలో ఒకదాని వెంట ఒకటి వెడతాయి.  ఖాళి అని ఎవరూ వేరే వాటిల్లో  ఎక్కరు.  బోటు నెం. చెబితే అందులోనే  ఎక్కాలి.  ఎక్కే ముందు   తోపులాట జరిగింది. అందరికీ ఆత్రమే... ఎక్కాలని.   ఏమాత్రం ఏమరుపాటుగా వున్నా కింద నీళ్ళలో  పడిపోటాము. పట్టుకోడానికి ఏమి వుండవు.  రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా బోటు మాట్లాడుకుని ఎక్కువ పే చేసి మా గ్రూప్ మాత్రమే ఎక్కి  వచ్చాము. 
మేము ఓకా రేవు మీదుగా సముద్రంలో బెట్ ద్వారక  వెళ్ళినపుడు నౌకలు, ఫెర్రీలు, బోటు లు చాల కనిపించాయి. 
చాలా మంది బోటు ఎక్కే ముందు మరుమరాల  పాకెట్ లు కొన్నారు. బోటు బయలు దేరాక ఎక్కడి నుంచో సముద్ర పక్షులు, కొంగలు మాతో పాటు వచ్చాయి.  అందరూ తమ వద్ద నున్న మరుమరాలు వేస్తుంటే అవి కింద పడకుండా క్యాచ్ పట్టుకుంటున్నాయి.  15 ని. జరిగిన సముద్ర  ప్రయాణంలో అవి అక్కడ ప్రయాణించే ఇతర ఫెర్రీ ల వద్దకు తిరుగుతూ ఆహ్లాదాన్ని  పంచాయి. 
ఫెర్రీ  దిగగానే  చిన్న పాతకాలపు  బ్రిడ్జి మీదుగా నడుచుకుంటూ  ఆలయం  చేరుకోవాలని  బయలు  దేరాం .  కాని  అక్కడ  నడవలేని  వారి కోసం  తోపుడు  బళ్ళ లాటి  బల్ల  మీద 4ని  ఎక్కించుకుని  ఆలయానికి తీసుకెడుతున్నారు. మాతో  పాటు  వచ్చిన  మా గ్రూప్  వారు  ఆ బళ్ల  మీద వెళ్ళారు.  మేము  నడుచుకుంటూ  బ్రిడ్జిని  5 ని  దాటేసి  నడుస్తుంటే  అక్కడ షేర్  ఆటోలు   కనిపించాయి .  మేము  అవి ఎక్కి  ఆలయం  దగ్గర దిగాము.  రోడ్డ్లు  మాత్రం  చాలా  ఇరుకుగా  వున్నాయి.  తిరిగి   వచ్చేటప్పుడు వన్ వే అవటంతో  ఆ చిన్న  కొండ చుట్టూ  తిరిగి రేవుకి వఛాము.  దారి పొడుగునా  చిన్న చిన్న  దుకాణాలు వున్నాయి.  విగ్రహాలు, పూసలదండలు, ఇంకా అనేక వస్తువులు  యాత్రికులని ఆకర్షించేవి అమ్ముతున్నారు. 
ఈ సారి మేము స్పెషల్ బోటు  లో  కొద్ది మందిమి మాత్రమే తిరిగి బయలుదేరి ఒఖా  రేవు తీరం  చెరుకున్నాము. 
మేము తిరిగి వచ్చేటప్పుడు సూర్యాస్తమయం కావటంతో సముద్రం మీదనుంచి  సూర్య బింబం లేలేత ఎరుపు రంగులో కనువిందు చేసింది. 
మా బెట్ ద్వారకా యాత్ర ఒక మరపురాని అనుభవం .... 



పడవ లంగరు  లోంచి  సూర్యుడు 
సూర్యాస్తమయ వేళ    బారులు  తీరిన  పడవలు 



4, ఫిబ్రవరి 2016, గురువారం

దీప తోరణం - కన్నెగంటి పుస్తక sameeksha

పుస్తక సమీక్ష:
దీపతోరణం
-మణినాథ్ కోపల్లె
ప్రముఖ రచయిత్రి  కన్నెగంటి అనసూయ  రచించిన దీపతోరణం పుస్తకం ఇటీవల లేఖిని సంస్థ అధ్వర్యంలో  ప్రముఖ రచయిత్రుల నడుమ ఆవిష్కరించబడింది.
ఈ దీపతోరణం పుస్తకంలో 15 కథలు వున్నాయి. ఈ కధలన్నీ ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. తన జీవితంలో  ఎదురయ్యే సంఘటనలే కథలుగా మలిచానని అంటారు రచయిత్రి. సాధారణ వ్యక్తులు, సాధారణ విషయాలు, సాధారణ సంఘటనలు వీరి కథాంశాలు.  తండ్రి ప్రేమ కోసం ఆరాట పడే వ్యక్తి వ్యధ పితృదేవోభవ కథలో కనిపిస్తుంది. తండ్రి భుజాలమీద ఎక్కాలనే చిన్న ఆనందం, చెరకుగడలు నాన్నే ముక్కలు చేసి ఇవ్వాలి అనే  కోరిక తీరలేదనేస్వల్ప విషయాలు తండ్రిపై ద్వేషం పెంచుకునేలా చేస్తాయి.   తన బదులు మోతుబరి రైతన్న కొడుకు వంశీకి తన తండ్రి సేవలందించటం  భరించలేకపోతాడు కృష్ణ. చివరికి పట్టుదలతో గురువుగారి బోధనలతో ఆ కసిని చదువు మీద పెట్టి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవటం ఈకథ  చెబుతుంది.     
మరోకథ జీవితాన్ని శాసించేవి కథలో నేడు సమాజంలో దాదాపు చాలా కుటుంబాలు ఎదుర్కుంటున్న సమస్యలే. చిన్న ఇంటిలో ఉన్న సుఖం పెద్ద ఇంటిలో ఏమి కోల్పోతామో చెబుతుంది. కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు మనిషికో గది  పేరిట పిల్లలు ఆత్మీయతానురాగాలు కోల్పోయి తమ తమ ప్రపంచంలో మునిగిపోయి ప్రవర్తించే తీరు, ఇల్లు విశాలమయితే మనసులు ఇరుకు లాగా తయారయి చివరికి మళ్ళీ పాత చిన్న ఇంటికి మారిపోవాలని నిర్ణయించుకోవటం కథకి ముగింపునిస్తారు రచయిత్రి.
ఆమాత్రం చాలు కథలో సాధారణంగా గృహిణులు ఏదైనా వస్తువు కొనేటప్పుడు తీసుకోవాల్సిన విషయాలు చెబుతుంది. మా దగ్గర ఈ వస్తువు తక్కువ అని షాపు వాళ్ళు చెప్పే మోజులో అసలు బిల్ తీసుకోకుండా కాగితం మీద ఇచ్చి న బీల్ తీసుకోవటం , కొన్న వస్తువులు త్వరగా పాడయిపోవడం, వంటి అనుభవాలు చాలామందికి అనుభవమే.
ఎవరు మురికి ఏది మురికి కథలో అంటరాని వాళ్ళు అని వేరుగా చూసే వ్యక్తుల రక్తమే అవసరానికి రక్తం ఎక్కించినపుడు ఈ ప్రశ్న ఉదయిస్తుంది. మనుషులంతా ఒకటే... ఎవరూ ఎక్కువా తక్కువా కాదు అనే పాఠం చెబుతుంది ఈ కథాంశం.
అమ్ముమ్మ కానుక కథలో తన మనవరాలి కి ఇవ్వబోయే కానుక కోసం దాచిన డబ్బుని ఆమె ప్రామిసరీ నోట్లు రాసే   కాలం గడిపిన దశరధరామయ్య తాత మనవరాలికి కానుకగా ఇవ్వడం ... అలాగే ఉచితంగా ఇచ్చే గొడుగులు వద్దని విద్యార్థులంతా వెళ్ళిపోయినా బూశమ్మ ఒక్కతే ఉచితంగా ఇచ్చే ఆ గొడుగు కోసం ఎదురు చూడ్డం, దానికి కారణాలు ఆ చల్లని నీడ కథలో చెబుతాయి... ఙ్ఞాపకం జీవించిన వేళ కథలో మనిషి ఙ్ఞాపకాలు చిన్ననాడు సీతాపలపళ్ళు అమ్మే తాతని, అమ్మాయిగారిని కలపటం తో ముగుస్తుంది.
 ఇలా ప్రతి ఒక్క కథా సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసిందే... ఇంకా ఎన్నో కథలున్నాయి.
కన్నెగంటి పుట్టిన పశివేదల గ్రామ పరిసరాలు, ఆత్మీయతానురాగాలు, పల్లె వాతావరణం,  ఇవన్నీ ఆమె కథలలో తొంగి చూస్తాయి.  కన్నెగంటి అనసూయ మూడవ కథల సంపుటి ఈ పుస్తకం. రచయిత్రి గానే కాదు స్వచ్ఛంద సంస్థని స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో పేరు సంపాదించుకున్నారు,   సమాజ సేవ చేస్తున్న రచయిత్రి కథలని విశిష్ఠ రచనలు, హృదయానికి హత్తుకునేవి అని ప్రముఖ రచయిత మునిపల్లె రాజుగారు అభివర్ణించారు.

    “దీపతోరణం  కథానికలు
రచన  : కన్నెగంటి అనసూయ
పేజీలు  :   177        ధర  : 120/-
For Copies :    Kanneganti Anasuya
406, Vindhya 4
Kukatpally ‘Y’ Junction,
Jaya Bharathi Gardens, Kukatpally, Hyderabad 18



2, ఫిబ్రవరి 2016, మంగళవారం

నేనూ ఓటేశా


 నేనూ  ఓటేశా...
(ఓటు  భాగోతం)
ఇంతకీ ఈ  పోస్ట్  ఉద్దేశం  ఎలక్షన్ లలో పాల్గొనే  నాయకులు  పంపిన  రాంగ్  మెసేజ్  పంపటంతో  మేము పడిన పాట్లు   నిన్న  జరిగిన హోరాహూరీ  ఓట్ల పోరులో  ఉదయం  9.30 కి కొండాపూర్ నుంచి బయలు దేరి  ఓటు వేయడానికి  వెళ్ళాము.   మాకందరికి  ముందే  మెసేజ్ వచ్చింది.  ఎలక్షన్ బూత్ నెం.  సీరియల్  నెం.  అన్నీ సెంటర్ కూదా మెసేజ్లో ఇచ్చారు.  ఎప్పుడూ  వుండే రెడ్డి కాలేజీ  కాకుండా  venue  మారింది  అనుకుంటూ  direct గా venue కి  వెళ్ళాము.   దూరం గా కారు పార్క్ చేసి  నడుచుకుంటూ  వెళ్ళాం.   అక్కడ వున్న అన్ని పోలింగ్ బూత్ లు వెతికినా  మా వోట్లు  లేవు.  ప్రతి వోక్కరికి  మెసేజ్ చూపించటం  అక్కడ లేదు అంటే వేరే పార్ట్ నం..50   కి వెళ్లి   లిస్టు లో చూడటం.... చివరికి అక్కడ లేదు  అని తేల్చుకుని  పాత ఎలక్షన్ సెంటర్  కి వెళితే అక్కడ వుంది మా వోటు.   చివరికి గంట పైగా వెతికితే  దొరికింది. దగ్గరలో వున్న  టేబుల్ దగ్గర వున్నా వాళ్ళు  మెసేజ్  వస్తే  డైరెక్ట్ గా వెళ్ళండి.  స్లిప్ అక్కర లేదు అని అన్నారు. 
  • ఇక ఈ సారి మున్సిపల్  ఎలక్షన్ లలో  రష్  అసలు లేదు.  మేము డైరెక్ట్ గా పోలింగ్  కౌంటర్ లోకే వెళ్ళాము. 
  • ఎక్కడా రోడ్లమీద  కాని , పోలింగ్  centres లోకాని  voters  కనిపించ లేదు. 
  • చాలా తక్కువ  శాతం ఓట్లు పోలయ్యాయి ఈసారి.
  •  ఎక్కడా contestents  పేర్లు, వారి  గుర్తులు  వున్న  display  boards లేవు.   చదువుకున్న వారూ,  చదువుకోలేని వారూ  అంతా  ముఖ్యమైన  పార్టీ గుర్తులు  గుర్తు పెట్టుకుని  దాని మీద   ఎలక్షన్ మిషన్  లో  ప్రెస్ చేశారు.

ఇదీ వోటు  భాగోతం....