24, డిసెంబర్ 2015, గురువారం

Book Fair

పుస్తకాల  పండగ డిసెంబర్  2015
NTR GROUNDS లో  Book Fair జరుగుతోంది.
ఈ సందర్భంగా ప్రమదాక్షరి  స్టాల్  లో నేను రాసిన ఫ్రీడం ఫైటర్ కోపల్లె హనుమంత రావు గారి  చరిత్ర పుస్తకం కూదా వుంది.  ఆ రోజుల్లో దేశ భక్తి వెల్లువలా దేశమంతా పారుతున్న వేళ మన ఆంధ్రా దేశం లోనూ అందునా మచిలీపట్టణం లో  ఎంతో మంది వీరులు ఉద్యమాల్లో పాల్గొన్నారు .  అందులో హనుమంత రావు గారు గారు, పట్టాభి గారు, ముట్నూరి గారు తెలుగు నాట తోలి విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్యాదానం చేశారు.  నేటికి అది వట వృక్షమై మచిలీపట్టణం లో నిలిచి వుంది.
ఈనాటి Book Fair లో ఈ పుస్తకం  ప్రముఖుల చేతుల్ల్లోను, ప్రముఖు రచయిత్రుల పుస్తకాల వరసన, వుంది. సాహిత్యాల కార్యక్రామాల్లోను పాల్గొన్న నేను,  నా  తోటి రచయిత్రుల తో ఫోటోలు ...




గులాబీ రంగు దుస్తుల్లో ప్రముఖ రచయిత్రులు - ప్రమాదక్షరి సభ్యులు  


ట్రావేలోగ్స్  - చర్చా కార్యక్రమం లో నా అనుభవాలు వింటున్న ప్రముఖ రచయిత్రులు 
చివరి రోజు 27 12 2015  బుక్ ఫెయిర్ లో తోటి రచయిత్రులతో ....
వి. బాలా మూర్తి గారు, వాసా ప్రభావతి గారు, గంటి భానుమతి గారు, మణి


రచయిత్రులు నిలుచున్న వారు : డి కామేశ్వరి , ఆలూరి  గౌరీ లక్ష్మి , అత్తలూరి విజయలక్ష్మి,
గంటి సుజల, జ్యోతి వలబోజు, మణి కోపల్లె . మణి  వడ్లమాని
కూర్చున్నవారు: ముక్తేవి భారతి , పి. యస్. లక్ష్మి ,  తమిరశ జానకి  ,  




చివరి రోజున  బుక్ ఫెయిర్ లో పుస్తకాభిమనులందరు విచ్చేశారు.  ప్రాంగణం అంతా విపరీత మైన  రద్దీ ...  ఈ  సారి ఎక్కువగా పిల్లలు, విద్యార్ధులు, కాలేజీ విద్యార్ధులు, ఎక్కువగా  కనిపించారు.   అందరూ వారి వారి బడ్జెట్ ని పట్టి  పుస్తకాలు కొనుగోలు చేసారు.   పిల్లలకి కొంతమంది ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు , వంటివి నిర్వహిస్తే,  కొంతమంది ఉచిత పిల్లల అనిమేషన్ cd లు అందించారు.  

         ఈసారి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చారు.  అలాగే పుస్తకాల సేల్స్  కూడా చాలా బాగా పెరిగాయి.  ఒక్క ప్రమదాక్షరి స్టాల్ లోనే  లక్ష పైగా అమ్మకాలు జరిగాయి .  పోటీ పరీక్షల పుస్తకాలు యువత కొంటే, ఆధ్యాత్మిక పుస్తకాలు  వయసు మళ్ళిన వారు కొన్నారు.  పది రోజులు జరిగిన పుస్తకాల పండుగ లో వచ్చిన వారు, పుస్తకాల అమ్మకాలు చూస్తుంటే ... పుస్తకాలకి మళ్ళీ పునర్ వైభవం వచ్చిందని పించింది.  చదివే వారు  ఎక్కువ అయ్యారు..  

8, డిసెంబర్ 2015, మంగళవారం

భడకేశ్వర్ మహదేవ్ ఆలయం.ద్వారక గుజరాత్

భడకేశ్వర్ మహదేవ్ ఆలయం.ద్వారక  గుజరాత్

భడ్కేశ్వర్ర్  

ఆలయానికి  దారి 




ఆలయం చుట్టూ సంద్రమే 

ద్వారకా దీశుడి  దర్శనానంతరం ద్వారకలో చూడవలసిన మరొక ఆలయం భడ్కేశ్వర్ మందిర్.  ఈ ఆలయం సముద్రం లో  వుంది. ద్వారకా బీచ్  ఒడ్డున  కొద్దిగా మెట్లు దిగి, ఎక్కితే  చిన్న  గుట్ట మీద ఈ ఆలయం వుంది. శివలింగం చిన్నదిగా వుంటుంది.  ఇక్కడి శివుని చంద్ర మౌళీశ్వరుడిగా పిలుస్తారు. శివరాత్రికి, ఇక్కడ విశేష పూజలు చేస్తారు. సూర్యాస్తమయం ఇక్కడి నుంచి చూస్తుంటే  చాలా అద్భుతం గా వుంటుంది.  సముద్రపు    అలలు  ఎక్కువై నపుడు ఆలయం చుట్టూ నీళ్ళే ! ఆలయం చేరుకోవడం కష్టం. మేము వెళ్ళినపుడు అలలు తక్కువగా వున్నాయి.  
స్థలపురాణ విశేషాలు మాత్రం తెలియరాలేదు.

కాని గోమతి నది సాగర సంగమ ప్రాంతంలో ఈ శివలింగం దొరికిందని, సద్గురు ఆదిశంకరాచార్యులు ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించారని అంటారు.
సముద్రంలో వున్న ఈ బీచ్ ఒడ్డునే గీతా మందిర్ వుంది.  

గీత మందిర్  కృష్ణార్జునులు 

బిర్లా వారి గెస్ట్  హౌస్ 


ఈ బీచ్ ఒడ్డునే గీతా మందిర్, వుంది.  
గీత మందిర్ ద్వారకా నగరానికి సముద్రానికి పశ్చిమ తీరాన వున్న భడకేశ్వర్ మందిరాని కి దగ్గరలోనే వుంది .
ఈ మందిరానికి ప్రముఖ వ్యాపారవేత్త లైన బిర్లా వారిచే 1970 లో నిర్మించారు. ఈ ఆలయం అంతా మార్బల్ రాళ్ళ తో నిర్మించారు. ఎంతో అందంగా వుండే ఈఆలయం కృష్ణార్జునుల విగ్రహాలు ఎంతో కళాత్మకంగా కళగా వుంటాయి. భగవత్ గీతను అర్జనునికి బోధిస్తున్నట్లు వుంతాయి. ఈ మందిరం లోపల విశాలమైన హాలు, హాలు చుట్టూ గోడలకి భగవత్ గీత శ్లోకాలు వుంటాయి. అంటీ కాదు ఈ మందిరం విశేషం హాలు లోపలి సీలింగ్ నుంచి రీసౌండ్ వస్తుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత.
ఇక్కడ బిర్లా వారి విశ్రాంతి గదులు లభిస్తాయి.
ప్రశాంత మైన వాతావరణం లో ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఎంతో బాగుంటుంది.


6, డిసెంబర్ 2015, ఆదివారం

స్వాతి వార పత్రిక - చివరి రోజుల్లో

కోపల్లె హనుమంత రావు
స్వాతి వార పత్రిక 11 12 2015 లో స్వాత్రంత్ర సమర యోధులు, జాతీయ  విద్యా పరిషత్  వ్యవస్తాపకులు బందరు వాస్తవ్యులు కీ. శే.   కోపల్లె హనుమంతరావ్  గారి గురించి  రాసిన ఆర్టికల్  వచ్చింది .  


బందరు (మచిలీపట్టణం ) లోని తోలి జాతీయ విద్యా పరిషత్ వ్యవస్తాపకులు, తోలి ప్రిన్సిపాల్  అయిన కోపల్లె హనుమంత రావు గారు  విద్యతో  పాటు వృత్తి విద్యా విధానాన్ని  ప్రవేశ పెట్టిన జాతీయ వాది.  జమిందారి వంశంలో పుట్టినా , చల్లపల్లి జమీలో దీవాన్ గా చేసి న్యాయవాది గా ప్రసిద్ది పొందిన తండ్రి కృష్ణారావు గారి బాటలో నడిచి న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న రొజులవి.  ఆ రోజుల్లో జాతీయోద్యమం ఊపిరి పోసుకుని భారత జాతీయ నాయకులు లాల్, పాల్, బాల  త్రిమూర్తుల స్ఫూర్తి, ఉపన్యాసాలు, మహాత్ముని అంధ్ర పర్యటన ....  ఇలా ఎన్నో  స్వాత్రంత్ర పోరాటా నికై దేశం యావత్తూ  కదన రంగాన తెల్ల వారికి ఎదురు నిల్చి, వారిని తరిమి కొట్టే పోరాటాలు  సాగుతున్న సమయం లో హనుమంత రావు గారు తన మిత్రులు పట్టాభి, ముట్నూరు ల సాయంతో బందరు లో జాతీయ విద్యా పరిషత్ ని స్తాపించారు. 
కోపల్లె హనుమంతరావు గారు తన లాయరు పట్టాను చించి వేసి,  జాతీయ ఉద్యమాల బాట పట్టారు.  కలంకారి నేత, చిత్రలేఖనం , మెకానిజం, వడ్రంగి, ఇలా ఎన్నో వ్రుత్తి విద్యలను  కళాశాలలో నేర్పించారు.ఎందరికో జీవన బృతిని  అందించారు. ప్రక్రుతి ఆరాధకులు, నిరాడంబరుడు అయిన కోపల్లె వారి  జీవిత చరిత్ర ఆధారంగా స్వాతి వార పత్రిక లో ప్రముఖ వ్యాస కర్త వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. 
 ఈ కళాశాల  నుంచి ఎందరో సాహితీ మూర్తులు, చిత్రకారులు, (అడవి బాపిరాజు వంటి వారు) ఇక్కడ చదువుకి పైకి వచ్చారు.