రచయిత్రులు నిలుచున్న వారు : డి కామేశ్వరి , ఆలూరి గౌరీ లక్ష్మి , అత్తలూరి విజయలక్ష్మి,
గంటి సుజల, జ్యోతి వలబోజు, మణి కోపల్లె . మణి వడ్లమాని
కూర్చున్నవారు: ముక్తేవి భారతి , పి. యస్. లక్ష్మి , తమిరశ జానకి ,
చివరి రోజున బుక్ ఫెయిర్ లో పుస్తకాభిమనులందరు విచ్చేశారు. ప్రాంగణం అంతా విపరీత మైన రద్దీ ... ఈ సారి ఎక్కువగా పిల్లలు, విద్యార్ధులు, కాలేజీ విద్యార్ధులు, ఎక్కువగా కనిపించారు. అందరూ వారి వారి బడ్జెట్ ని పట్టి పుస్తకాలు కొనుగోలు చేసారు. పిల్లలకి కొంతమంది ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు , వంటివి నిర్వహిస్తే, కొంతమంది ఉచిత పిల్లల అనిమేషన్ cd లు అందించారు.
ఈసారి ఎక్కువ మంది విజిటర్స్ వచ్చారు. అలాగే పుస్తకాల సేల్స్ కూడా చాలా బాగా పెరిగాయి. ఒక్క ప్రమదాక్షరి స్టాల్ లోనే లక్ష పైగా అమ్మకాలు జరిగాయి . పోటీ పరీక్షల పుస్తకాలు యువత కొంటే, ఆధ్యాత్మిక పుస్తకాలు వయసు మళ్ళిన వారు కొన్నారు. పది రోజులు జరిగిన పుస్తకాల పండుగ లో వచ్చిన వారు, పుస్తకాల అమ్మకాలు చూస్తుంటే ... పుస్తకాలకి మళ్ళీ పునర్ వైభవం వచ్చిందని పించింది. చదివే వారు ఎక్కువ అయ్యారు..
|
Bagundi. Congrats !
రిప్లయితొలగించండి