10, జూన్ 2015, బుధవారం

డా. దాశరధి రఁగాచార్య సాహితీ ప్రపంచం


డా . దాశరధి రంగాచార్య



ప్రముఖ సాహితీ వేత్త, తెలంగాణా పోరాట వీరుడు, ఫిలాసఫర్, అక్షర వాచస్పతి అయిన డా. దాశరధి రంగాచార్య 08 06 15న కనుముసారు. వారు సాహితీ లోకానికి ఎనలేని సేవ చేసారు.  నేను ఒకసారి   దాశరధి రంగాచార్య గారింటికి వెళ్ళాను. అప్పటికే వారు అస్వస్తులుగా వున్నారు. మంచం మీదే వుండి మాతో మాట్లాడారు.  వారితో కలిసి సాహిత్య  చర్చ 
జరగటం మరపురాని అనుభవం.  ఆతరువాత వారు  రచయిత తో ముఖా ముఖి కార్యక్రమానికి  వీల్ ఛైర్లో వచ్చి ఆనాటి సభలో తన గురించి, తన అనుభవాలు చెప్పారు.పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.  వేదాలు స్త్రీలు చదవ వచ్చా అని ఒకరు అడిగితె అందరు చదవచ్చు అని అన్నారు. 

తెలుగు వారికి  వచన వేదాలు అందించిన    డా॥ దాశరధి రంగాచార్య గారు   తమ విలువైన అభిప్రాయాలను ఆహుతులతో పంచుకున్నారు.  

"వేదాలను అందరు చదవచ్చు. వేదం అందరికి వర్తిస్తుంది. వేదం భారతీయులది మాత్రమే, వీళ్ళు మాత్రమే చదువుతారు" అనుకోవటం సంకుచిత తత్త్వం అవుతుంది.ఎందు కంటే వేదాన్ని అనువదించని భాష లేదు ప్రపంచంలో. వేదానికి స్వర శాస్త్రం వుంది. స్వరాలూ వున్నాయి. కాని స్వరం తెలిసిన వారు లేరు. వేదం కాని రామాయణ భాగవత పురాణాలు కాని ఉప పురాణాలు కాని  మానవ జాతి   కోసం చెప్పినవే తప్ప ఏ ఒక్క భాష కోసమో చెప్పలెదు.    ప్రపంచ  భాషలకు మాధ్యమం సంస్కృతం. కొన్ని జాతుల వారు మాత్రమే సంస్కృతం చదవాలన్నారు. కానీ వేదం అందరిదీ. అందరూ చదవఛు. వేదం ప్రజలందరి కోసం రాయబడింది. వేదం లో ఏముందో బైబిల్, ఖురాన్ లలో కుడా ఇదే వుంది . పరమాత్మ ఒక్కడే . ఈ జగత్ అంతా పరమాత్ముని సృష్టి.  సత్యమే పరమాత్మ. సత్యం కంటికి కనిపించదు. సత్యం ఏమిటి అనేది వ్యాసుడు రచించిన భరతం వివరిస్తుంది. . భారత దేశపు సాత్విక పరంపరలో సత్యం, ధర్మం వున్నాయి. సత్యానికి గాని ధర్మానికి గాని ఇతమిద్దమైన వ్యాఖ్యలుండవు. అని అన్నారు. 

   "పండితుడు రచయితా కావటం కష్టం రచయిత తత్వవేత్త కావటం మరీ కష్టం. ఫిలాసఫర్ కావటం అంత కంటే మరీ కష్టం. నేను భగవంతుని తప్ప ఎవరిని నమ్మలేదు." అని అన్నారు.
జీవిత విశేషాలు
డా|| దాశరధి రంగా చార్య  వరంగల్లు జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో జూలై 24, 1928న వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు జన్మించారు.
వీరి అన్నగారు దాశరధి కృష్ణ మాచార్య . ఆస్తాన కవిగా వుండేవారు. వీరు  సినీ రచయితగా ప్రసిద్ధులు. ప్రజా కవి, విప్లవ కవి కూడా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గళమెత్తి చాటారు అన్నదమ్ములిద్దరూ....  
దాదాపు 75 వసంతాలకు పైగా ప్రజా సేవ చేశారు. నిజాం పాలనకి వ్యతిరేకంగా పోరాటాలు సలిపిన వ్యక్తి. తెలంగాన సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయునిగాస గ్రంధ పాలకునిగా పనిచేశారు. సాయుధ పోరాటాల కాలం అనంతరం సికిందరాబాద్ పురపాలక కార్పొరేషన్ లో 32 ఏళ్ళు పని చేసి పదవీ విరమన చేశారు.
      తమ తల్లి చేసిన త్యాగం, అన్న దమ్ములిద్దరు పోరాటాలు జరిపిన సంఘటనలు గుర్తు చేసుకుని "మాది త్యాగాల కాలం.  తెలంగాణా తల్లి మీద అభిమానంతో పోరాటాలు సాగించే వాళ్ళం." అన్నారు. దాశరధి రంగా చార్య గారు కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.  తెలుగు వారికి భారత తాత్వికతను అందించాలనేది వీరి ధ్యేయం, సంకల్పం. లక్ష్యం. తెలంగాణ మాండలికంతో వీరి కలం నుండి వెలువడిన తొలి నవల "చిల్లర దేవుళ్ళు" విశేషమైన ప్రచారం పొందింది. ఈ నవల  చలన చిత్రంగా, రేడియోలో నాటకంగా, యునివర్సిటీ   విద్యార్ధులకు పాఠంగా ... ఇలా పలు రూపాల్లో వచ్చింది. వీరి గురించి ఎంత రాసినా ఇంకా మిగిలి పోతుంది. 
అపర బృహస్పతి, అక్షర వాచస్పతి, వేదం వారసత్వం పంచిన విప్లవకారుడు, వేదాన్ని ప్రజల వద్దకు తెచ్చిన దాశరధి,  ... ఇలా బిరుదాలతో ప్రముఖ పత్రికలు వీరిని కీర్తించాయి. ఆధ్యాత్మిక వేత్త అయిన దాశరధి గారు రామాయణ, భాగవతాలను సులభ వచనంలో  రచించారు. వేదాలతో పాటు, ఉపనిషత్ లను కూడా రచించారు. వేదాలతో పాటు ఆధునిక రచనలు కూడా చేశారు. ఉర్దూలో కూడా కవితా రచనలు చేశారు. దాదాపు 90కి పైగా
రచనలు చేసిన వీరి సాహితీ పేజీలు 16,000 పైగానే వున్నాయి.
అవార్డులు :


  • చిల్లర దేవుళ్ళు తొలి నవలకు అంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు (1970)
  • పులుపుల శివయ్య స్మారక అవార్డు గుంటూరు (1990),
  • యువకళావాహిని గోపి చంద్ అవార్డు (1993),
  • సాహితీ హారతి రజిత కిరీట పురస్కారం, ఖమ్మం, (1994),
  • గోవిందరాజు సీతాదేవి అవార్డు (1995),
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం (2001).
  • నాటి ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ హంస అవార్డు (2006),
  • అంధ్రప్రదేశ్ రాజీవ్ ప్రతిభా అవార్డు (2009)
  • అజో విభో వారి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.



వీరి సాహితీ ప్రస్తానం లో ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులూ అందుకున్నారు .
.డా. దాశరధి రంగాచార్య సాహిత్యం




  • శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహిత - నాలుగు వేద సంహితలు - ఆరు భాగాలు
  • శ్రీ మదాంధ్ర వచన   శుక్ల యజుర్వేద సంహిత,
  • శ్రీ మదాంధ్ర వచన సామ వేద సంహిత ,
  • శ్రీ మదాంధ్ర వచన అధర్వవేద సంహిత
  • శ్రీ మదాంధ్ర సాంఖాయన  శాంఖాయన  బ్రాహ్మణము
  • శ్రీ మదాంధ్ర వచన ఐతరేయ బ్రాహ్మణము మొదలైనవి.....
  • తొమ్మిది ఉపనిషత్తులు,
  • శ్రీ మద్రామాయణము,
  • శ్రీ మహా భరతం,
  • శ్రీ మద్భగవత్ గీత,
  • శ్రీ మద్భాగవతము,
  • సీతా చరితం,
  • హరివంశం
  • భారత సూక్తము
  • మానమ తిరుప్పావై
  • అభిఙ్ఞాన శాకుంతలం
  • వేదం జీవన నాదం - ప్రవేశిక,
  • వేదం జీవన నాదం - ఋగ్వేద పరిచయం, మొదలైన  గ్రంధాలతో పాటు 9 ఉపనిషత్తులు కూడా రచించారు. 
1 ఈశా ఉపనిషత్తు                  2. కేన ఉపనిషత్తు                        3 కథ ఉపనిషత్తు                
 4 తైత్తీరీయ ఉపనిషత్తు            5   ఐతరీయ  ఉపనిషత్తు                6 ముండకోపనిషత్తు                             7   మాండ్యూక్యఉపనిషత్తు       8    ఛాందోగ్యఉపనిషత్తు                  9  బృహదారన్య ఉపనిషత్తు    
రచించారు. 
ఆధునిక సాహిత్యం
  • చిల్లర దేవుళ్ళు, ఘాట్ గా దేవత, (హింది) మోదుగు పూలు, జానపదం, రానున్నది
  • ఏది నిజం మాయా జలతారు, సరతల్పం, మానవత, పావని, జాన పదం, అమృతం గమయ ...
  • మొదలైన నవలలు.....
  • ఆత్మా కధలు :  జీవన యానం - జీవితం, యాత్రా జీవనం - యాత్రలు,
  • కధలు :నల్ల నాగు - సంపుటి, రణ రంగం, కెరటాలు,
  • దేవదాసు ఉత్తరాలు,
  • కవితా కాదంబరి మానస కవిత,
  • ఉర్దూ మాదిర ఇక్బాల్ కవిత, జవుఖ్ కవిత మొదలైనవి.
  • జీవిత చరిత్రలు, విమర్శలు, పిల్లల పుస్తకాలు, రచించారు,
  •  రేడియో నాటకాలు, టి.వి. కార్యక్రమాలు, మొదలైన నాటిల్లో వీరి సాహితీ సుమాలు రూపుదిద్దుకున్నాయి. 
  • చిల్లర దేవుళ్ళు, మోదుగ పూలు, పావని... సినిమాలుగా కూడా వచ్చాయి. 
ఇవి కొన్ని మాత్రమే.... ఇంకా చాలా సాహితీ రచనలు వున్నాయి.

ఉద్యమకారుని నుంచి అధ్యాత్మిక వేత్తగా మారి మానవాళికి అంతులేని విఙ్ఞాన సంపద నొసగిన డా.దాశరధి రంగా చర్య గారి కి నివాళులు అర్పిస్తూ ఈ చిన్ని అక్షరాంజలి.

8, జూన్ 2015, సోమవారం

బొంబాయి రవ్వ దోశలు

దోశెలు

దోశెలు ఎలా చేయాలో అందరికి తెలుసు. అయినా మళ్ళి మీకు చెబుతున్నాను.




బొంబాయి రవ్వ దోశెలు 
మినపప్పు                      :              1 గ్లాసు
బొంబాయి రవ్వ               :               2 గ్లాసులు 
ఉప్పు                             :              తగినంత 
జీలకర్ర                            :              2 స్పూనులు 
 నూనె                             :             దోశెలు  సరిపడినంత (సుమారుగా 1/2 కప్)

తయారీ విధానం              :                          


  1. ముందుగా మినపప్పు నానబెట్టాలి.
  2. పప్పు నానాక మిక్సీ లో వేసి మెత్తగా రుబ్బాలి.
  3. ఈ మినప్పిండి లో బొంబాయి రవ్వ, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి. 
  4. అరగంట సేపు అలాగే వుంచి పెనం మీద పలచగా  దోశెలు వేయాలి.
  5.  దోశెల చుట్టూ 1 చెంచాడు నూనెవేసి కాల్చాలి.
  6.   చక్కటి కమ్మనైన ఎర్రగా కాలిన దోశెలు రెడి.                                                                                                                                                                                                                                                                           
నోట్స్   
  •  దోశెలు ఒక వేపే కాల్చాలి.  
  • ఇష్టముంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర దోశమీద వేసి కాల్చండి. 
  • ఈ దోశెలు అప్పటికప్పుడే చేయచ్చు.
  • పిండి ఎక్కువ సేపు పులవనవసరం లేదు. 
  • పిండి రుబ్బగానే అరగంటలో టిఫిన్ తయారు చేయచ్చు.
  • దోసెల తో పాటు అల్లం పచ్చడి కాని పుట్నాల పప్పు పచ్చడి కాని వేసుకొని తినచ్చు.  

తొక్కుడు పచ్చడి

అందరు ఇష్టం గా చేసుకునే మరో శాంపిల్ పచ్చడి.

తొక్కుడు పచ్చడి.

కావలసిన పదార్ధాలు: 
మామిడికాయలు      :  2 
ఉప్పు                      :   తగినంత (కాయ ముక్కలు సైజుని బట్టి)
కారం                       :   తగినంత 
మెంతిపిండి              :     4 tsp
ఇంగువ                    :     2 tsp
పసుపు                    :     2 tsp
పోపు                       :
ఆవాలు                    :     2 tsp 
 నూనె                     :      1/2 కప్ 
తయారి విధానం       :

  1. మీడియం సైజు మామిడి కాయలని  శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.  వాటిని అలాగే ఎండలో పెట్టాలి.  పూర్తిగా ఎండ పెట్ట కూడదు. 
  2. సాయంత్రం ఆ ముక్కలు తీసి వాటికి ఉప్పు, కారం, మెంతి పిండి,  పసుపు వేసి బాగా కలపాలి. 
  3. ఈ మిశ్రమాన్ని రోటిలో వేసి లైట్ గా దంచాలి.   ముక్క చిదమ కూడదు. 
  4. ముక్కకి ఉప్పు కారం తగిలి రసం వస్తుంది.
  5. దంచిన ముక్కలని బేసిన్ లోకి తీసుకోవాలి.
  6. బాళి లో నువ్వుల నూనె కాని పల్లీ నూనె కాని  వేసి కాచాలి. కాగిన నూనెలో ఆవాలు, ఇంగువ వేయాలి.  పోపు వేగాక  చల్లార్చి కారం కలిపి దంచిన మామిడి కాయ ముక్కాలలో వేసి బాగా కలపాలి. 
  7. అంటే తొక్కుడు పచ్చడి రెడీ.

నోట్        :

  • రోట్లో వేసి తోక్కుతాము (దంచుతాము) కాబట్టి తొక్కుడు పచ్చడి.
  • మిక్సీ లో వెయ కూడదు. పూర్తిగా నలిగి పోతాయి. 
  • మరునాడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.
  • ఇంగువ  మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే తొక్కుడు పచ్చడి పేరుతొ పాటు రుచీ బాగుంటుంది.
  • ఆంథ్రా లో కొన్ని ప్రాంతాల్లో చేసుకునే పచ్చడి ఇది.


3, జూన్ 2015, బుధవారం

పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం, మంత్రాలయం

 .
పంచముఖి ఆంజనేయ స్వామి  ఆలయంమంత్రాలయం 
   

పంచముఖి అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు. భారత దేశంలో కొన్ని చోట్ల మాత్రమె ఈ ఆలయాలు వున్నాయి.   పూర్వనామం  గాణదాల అనే పేరు గల పంచముఖి  గ్రామం కర్నాటక లోని రాయచూరు జిల్లా లో తుంగభద్రా నదికి ఇటువేపు మంత్రాలయం ఆంద్రప్రదేశ్ కి చెందింది. అటువేపు గాణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందింది. చుట్టూ కొండలు. అందమైన ప్రకృతి. దగ్గరలో తుంగభద్రా నది. ప్రశాంత మైన వాతావరణం. ఇది పవిత్రమైన ప్రదేశం కూడా!  ఇక్కడ  హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనమి చ్చాడు.  అందుకే ఇది పంచముఖి గా ప్రసిద్ది చెందింది. 


మంత్రలయానికి 21 కి. మీ . దూరం లో పంచముఖి వూరు ఉంది. పంచముఖి ఆంజనేయ స్వామి  ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ది చెందింది.   

పంచముఖి  ప్రాశస్త్యం :   పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు  ముఖాలుపది ఆయుధాలతో భక్తులకు దర్సనమిస్తుంది. పంచముఖి ఆంజనేయస్వామిగా కొలిచే ఆ అవతారంలో  హనుమంతుడునరసింహుడుగరుడుడువరాహుడుహయగ్రీవుడు వున్నారు.   హనుమంతుడు మై రావణుని సంహార సమయంలో ఈ పంచ ముఖి అవతారాన్ని ఎత్తాడు. కంభరామాయణంలో  హనుమంతుని గురించి చాల చక్కగా వివరించారు. పంచ భూతాలకి  ప్రతి రూపం కూడా ఈ  ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశం, భూమి,  నిప్పు వీటిని తనలో ఇముడ్చు కున్నవాడు.
   పవన తనయుడుఆకాశ మర్గాన . నీరు సముద్రాన్నిదాటి అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసు కుని  అగ్నితో లంకా దహనం కావించాడు. సుందరా కాండలో కుడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండం లో చాలా చక్కగా తెలిపారు. అలాగే పంచ ముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే అంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను,  దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అబీష్ట  సిద్ధినిపడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడుడు సకల సౌభాగ్యాన్నిఉత్తర  దిక్కుని చూసే వరాహ స్వామీ  ధన ప్రాప్తినిఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. 
ఇదు రకాలైన భక్తీ భావాలూ వున్నాయి .  నామం, స్మరణంకీర్తనంయాచనంఅర్పణం. హనుమంతుడు శ్రీ రాముని విధములుగా  పూజిస్తాడు. ఎప్పుడు శ్రీ రామ నామం స్మరిస్తూకీర్తిస్తూరాముని కరుణప్రేమకై తపిస్తూ (యాచిస్తూ ) తనని  తానూ అర్పించుకున్నాడు. 
ఇక్కడి గుహలో పంచముఖి ఆంజనేయ స్వామి రాతిపై వెలిసినట్లుగా  కనిపిస్తాడు. అన్ని చోట్లా కనిపించినట్లు విగ్రహ రూపంలో కనిపించడు.
 శక్తి వంతంమహిమాన్వితంఅయిన శ్రీ పంచముఖి ఆలయం చూడవలసిన ప్రదేశం. .


 శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్దాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర రాయరు తుంగభద్రా నదీ తీరాన వున్న మంచాలలో వున్నపుడు తుంగభద్రా నదికి ఆవల వున్న గాణదాళబిక్షాలయ అనే గ్రామాలను దర్శించే వారు. గాణదాళలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి పన్నెండు సంవత్సరములు తపస్సు చేసారు. స్వయంభూగా రాతిపై వెలసిన అంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి  కొలిచిన ప్రదేశం ఇది.  కొండ గుహలో రామునిఆంజనేయుని పూజించిన అనంతరం గురు రాఘవెంద్రులు శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహా లక్ష్మి విగ్రహాలను  చేక్కినట్లుగా చెబుతారు.  ఈ ప్రాంతంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు  రుద్రదేవుడుగణపతినాగ దేవుని విగ్రహాలు ప్రతిష్టించారు.  
శిష్యులు శ్రీ అనంతాచార్యులు 
ఈ గుహలో అదృశ్యమైన అనంతాచార్యులు 
కూర్మం (తాబేలు ఆకారం)లో శిలలు 
పెద్ద రాయిని మోస్తున్న చిన్న రాయి 
శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి  పంచముఖి  ఆంజనేయ స్వామికొల్హాపుర మహాలక్ష్మితిరుపతి వెంకటేశ్వర స్వామికూర్మావతారంలో విష్ణుమూర్తి  ప్రత్యక్ష మయినట్లు గా ఇక్కడి చరిత్ర చెబుతోంది. శ్రీ రాఘవేంద్రస్వామి అనంతరం మంత్రాలయం వెళ్లి అక్కడ సజీవ సమాధి అయ్యారు. 
               ఇక్కడ సహజం గా రాళ్ళతో  ఏర్పడిన  ఆకృతులు నిజంగా ఆశ్చర్య పరుస్తాయి. మంచం తలగడవిమానంతాబేలుపాదుకలుఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్సనమిస్తాయి.  పంచముఖి ఆలయంలో ప్రతి రోజు పూజాదికాలు నిర్వహిస్తుంటారు. 
ఇక్కడికి చేరుకోవాలంటే మంత్రాలయం నుంచి ఆటోలుటాక్సీలు వెడుతుంటాయి. రోడ్డు మార్గం సరిగా లేదు. బస్సు సర్వీసులు లెవు. ఇదివరకు మేము 1975లో మంత్రాలయం లోని  తుంగభద్రా  నది దాటి కి.మి దూరం లో వున్న పంచముఖి ఆలయం చేరుకున్నాం. ఇప్పుడు నదిలో నీళ్ళు లెవు. పడవలు లెవు.ఇప్పటి కట్టడాలు, మెట్లు లెవు. కొండ పై మనుష్యులు, పూజారులు లెరు... 
ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అలయం.  కొత్తగా నదిపై బ్రిడ్జి నిర్మించారు. రవాణా సౌకర్యం మెరుగుపడింది. 



బాదం హల్వా

   స్వీట్స్


 బాదాం హల్వా 

కావలసిన పదార్ధాలు 
బాదం పప్పులు  :       1 కప్పు (నానపెట్టి పై తొక్క తీసినవి )
పాలు                :        1 కప్పు 
పంచదార           :        3/4 కప్పు 
ఏలక్కాయలు     :        3
నెయ్యి                :       1/2 కప్పు 
కుంకుమ పువ్వు :       కొద్దిగా 
ఫుడ్ కలర్          :      కేసరి కాని లైట్ పసుపు రంగు (optional 



తయారు చేసే విధానం :

  • బాదం పప్పులని నీటిలో నానబెట్టాలి. తరువాత పైన వున్న తొక్కని తీసేయాలి. తొందరగా తొక్క తీయాలంటే వాటిని  నీటిలో వుడికించితే తొందరగా వస్తుంది
  • వాటిని మిక్సీలో వేసి  పాలు పోసి  పేస్ట్ చేయాలి.
  • పంచదారని పావు కప్పు నీటిలో కరిగించి లేత పాకం వచ్చేదాక పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. 
  • పంచదార పాకంలో రుబ్బి వుంచుకున్న బాదం పేస్ట్ ని వేసి కలుపుతూ వుండాలి. లేకపోతే మాడి పోతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి.
  • దంచిన ఏలక్కాయ పొడి వేయాలి.
  • కరిగించిన నేతిని పోస్తూ కలుపుతూ వుండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ వుండాలి.
  • కొద్ది పాలలో కుంకుమ పూవు వేసి బాగా కలిపి కరిగాక వుడుకుతున్న బాదం పేస్ట్ లో వేయాలి.
  • వుడుకుతున్నప్పుడు నెయ్యి సెపరేట్ అయ్యినట్లుగా వుంటే హల్వా అయిపోయినట్లే!
  •  వెంటనే  స్టౌ కట్టేయాలి. లేకపోతే తొందరగా అడుగంటడమో, మాడటమో జరుగుతుంది.
  • కలుపుతుంటే బాళికి అంటుకోకుండా వున్నపుడు అయిపోయినట్లు.      
  • వేయించిన బాదం పప్పులు, పిస్తా సన్నాగా కట్ చేసి   హల్వా పైన అలంకరిస్తే బాగుంటుంది. 
  • ముద్దగా కాకుండా పీసెస్ లాగా కావలంటే నెయ్యి రాసిన పళ్ళెంలో  బాదం   హల్వా   వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. 
టిప్స్ 
  • బాదాం పప్పు పది నిముషాలు ఉడికిస్తే తొక్క తొందరగా వస్తుంది.
  • కొంతమంది బాళిలో ఒకేసారి బాదాం పేస్టు, నెయ్యి, పంచదార, ఏలక్కాయ పొడి అన్నీ ఒకేసారి వేసి ఉడికిస్తారు.
  • హల్వా పూర్తీ అయ్యే వరకు కలుపుతూనే వుండాలి.  
  • పిన్నలు, పెద్దలు ఇష్టం గా తినే బాదాం హల్వా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.
  • తీపి కావలసిన వారు ఎక్కువగా పంచదార కూడా వేసుకోవచ్చు.