అందరు ఇష్టం గా చేసుకునే మరో శాంపిల్ పచ్చడి.
తొక్కుడు పచ్చడి.
కావలసిన పదార్ధాలు:
మామిడికాయలు : 2
ఉప్పు : తగినంత (కాయ ముక్కలు సైజుని బట్టి)
కారం : తగినంత
మెంతిపిండి : 4 tsp
ఇంగువ : 2 tsp
పసుపు : 2 tsp
పోపు :
ఆవాలు : 2 tsp
నూనె : 1/2 కప్
తయారి విధానం :
నోట్ :
తొక్కుడు పచ్చడి.
కావలసిన పదార్ధాలు:
మామిడికాయలు : 2
ఉప్పు : తగినంత (కాయ ముక్కలు సైజుని బట్టి)
కారం : తగినంత
మెంతిపిండి : 4 tsp
ఇంగువ : 2 tsp
పసుపు : 2 tsp
పోపు :
ఆవాలు : 2 tsp
నూనె : 1/2 కప్
తయారి విధానం :
- మీడియం సైజు మామిడి కాయలని శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని అలాగే ఎండలో పెట్టాలి. పూర్తిగా ఎండ పెట్ట కూడదు.
- సాయంత్రం ఆ ముక్కలు తీసి వాటికి ఉప్పు, కారం, మెంతి పిండి, పసుపు వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని రోటిలో వేసి లైట్ గా దంచాలి. ముక్క చిదమ కూడదు.
- ముక్కకి ఉప్పు కారం తగిలి రసం వస్తుంది.
- దంచిన ముక్కలని బేసిన్ లోకి తీసుకోవాలి.
- బాళి లో నువ్వుల నూనె కాని పల్లీ నూనె కాని వేసి కాచాలి. కాగిన నూనెలో ఆవాలు, ఇంగువ వేయాలి. పోపు వేగాక చల్లార్చి కారం కలిపి దంచిన మామిడి కాయ ముక్కాలలో వేసి బాగా కలపాలి.
- అంటే తొక్కుడు పచ్చడి రెడీ.
నోట్ :
- రోట్లో వేసి తోక్కుతాము (దంచుతాము) కాబట్టి తొక్కుడు పచ్చడి.
- మిక్సీ లో వెయ కూడదు. పూర్తిగా నలిగి పోతాయి.
- మరునాడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.
- ఇంగువ మెంతి పిండి వాసనలతో ఘుమ ఘుమ లాడే తొక్కుడు పచ్చడి పేరుతొ పాటు రుచీ బాగుంటుంది.
- ఆంథ్రా లో కొన్ని ప్రాంతాల్లో చేసుకునే పచ్చడి ఇది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి