స్వీట్స్
బాదాం హల్వా
కావలసిన పదార్ధాలు
బాదం పప్పులు : 1 కప్పు (నానపెట్టి పై తొక్క తీసినవి )
పాలు : 1 కప్పు
పంచదార : 3/4 కప్పు
ఏలక్కాయలు : 3
నెయ్యి : 1/2 కప్పు
కుంకుమ పువ్వు : కొద్దిగా
ఫుడ్ కలర్ : కేసరి కాని లైట్ పసుపు రంగు (optional
తయారు చేసే విధానం :
- బాదం పప్పులని నీటిలో నానబెట్టాలి. తరువాత పైన వున్న తొక్కని తీసేయాలి. తొందరగా తొక్క తీయాలంటే వాటిని నీటిలో వుడికించితే తొందరగా వస్తుంది
- వాటిని మిక్సీలో వేసి పాలు పోసి పేస్ట్ చేయాలి.
- పంచదారని పావు కప్పు నీటిలో కరిగించి లేత పాకం వచ్చేదాక పొయ్యి మీద పెట్టి ఉడికించాలి.
- పంచదార పాకంలో రుబ్బి వుంచుకున్న బాదం పేస్ట్ ని వేసి కలుపుతూ వుండాలి. లేకపోతే మాడి పోతుంది. చాలా జాగ్రత్తగా కలపాలి.
- దంచిన ఏలక్కాయ పొడి వేయాలి.
- కరిగించిన నేతిని పోస్తూ కలుపుతూ వుండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకూడదు. కొద్ది కొద్దిగా వేస్తూ వుండాలి.
- కొద్ది పాలలో కుంకుమ పూవు వేసి బాగా కలిపి కరిగాక వుడుకుతున్న బాదం పేస్ట్ లో వేయాలి.
- వుడుకుతున్నప్పుడు నెయ్యి సెపరేట్ అయ్యినట్లుగా వుంటే హల్వా అయిపోయినట్లే!
- వెంటనే స్టౌ కట్టేయాలి. లేకపోతే తొందరగా అడుగంటడమో, మాడటమో జరుగుతుంది.
- కలుపుతుంటే బాళికి అంటుకోకుండా వున్నపుడు అయిపోయినట్లు.
- వేయించిన బాదం పప్పులు, పిస్తా సన్నాగా కట్ చేసి హల్వా పైన అలంకరిస్తే బాగుంటుంది.
- ముద్దగా కాకుండా పీసెస్ లాగా కావలంటే నెయ్యి రాసిన పళ్ళెంలో బాదం హల్వా వేసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి.
టిప్స్
- బాదాం పప్పు పది నిముషాలు ఉడికిస్తే తొక్క తొందరగా వస్తుంది.
- కొంతమంది బాళిలో ఒకేసారి బాదాం పేస్టు, నెయ్యి, పంచదార, ఏలక్కాయ పొడి అన్నీ ఒకేసారి వేసి ఉడికిస్తారు.
- హల్వా పూర్తీ అయ్యే వరకు కలుపుతూనే వుండాలి.
- పిన్నలు, పెద్దలు ఇష్టం గా తినే బాదాం హల్వా ఆరోగ్యానికి కూడా చాల మంచిది.
- తీపి కావలసిన వారు ఎక్కువగా పంచదార కూడా వేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి