డా|| భానుమతి రామకృష్ణ
డిసెం బరు 24. ఈ రోజు డా|| భానుమతి రామకృష్ణ వర్ధంతి.
సినీ వినీలాకాశంలో ధ్రువ తార.
నేటికి ఆమె ఏంతో మందికి అభిమాన తార.
ఆమె ఒక హీరోయిన్ గానే కాదు. బహుముఖ ప్రజ్ఞాశాలి .
ఆతమ విశ్వాసానికి మారుపేరు.
నటీ మణి దర్శకురాలు, నిర్మాత, రచయిత్రి, అన్నిటికి మించి గాయకురాలు. భానుమతి పాటలు నేటికి ఎంతో మంది వింటుంటారు. రామకృష్ణ సినీ స్టూడియోస్ కి అధినేత్రి.
సంగీత దర్శకురాలు.
చెన్నై లోని తన ఇంటిలో 2005లో డిసెంబర్ 24న మనకి భౌతికంగా దూరం అయ్యారు. కాని నేటికి ప్రేక్షకుల మదిలో చిరంజీవియే!
జీవిత విశేషాలు
భానుమతి సెప్టెంబర్ నెలలో ఒంగోలులో జన్మించారు. తండ్రి వెంకటరాజు సుబ్బయ్య. వారు కూడా సంగీత కళా విశా రుదులు. సంగీత ప్రియులు. భానుమతి తండ్రి వద్దనే సంగీతం నేర్చుకున్నారు. సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె తన 13వ ఏటనే 1939లో విడుదలైన వరవిక్రయం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. 1943లో కృష్ణ ప్రేమ సినిమాలో నటించింది. ఆ సినిమా డైరెక్టర్ అయిన రామకృష్ణా రావు ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరు తమిళ్, తెలుగు చిత్ర నిర్మాత, దర్శకులు, ఎడిటర్. ఈ దంపతులకి ఒక కొడుకు పేరు భరణి . అతని పేరుమీదే భరణి స్టూడియోస్ నిర్మించారు. అనేక సినిమాలు నిర్మించారు.
దాదాపు 50 సంవత్సరాలకు పైగా సినీరంగంలో వున్నా వీరు వంద చిత్రాలలో మాత్రమే నటించారు
బిరుదులు
- అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ పురస్కారం 1956లో అందుకున్నారు.
- అంతస్తులు, పల్నాటి యుద్ధం, అన్నై (తమిళ్ సినిమా)లకు మూడు సార్లు జాతీయ అవార్డులు
- నడిప్పుకు ఇళక్కనం అనే బిరుదు
- అష్టావధాని అని తమిళ్ ప్రజలు కీర్తిస్తుంటారు.
- 1966లో పద్మశ్రీ అవార్డు. అమె రచించిన అత్తగారి కధలు - హాస్య సంపుటికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీని భారత ప్రభుత్వం చే అందుకున్నారు. ఇదే సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడెమి అవార్డు కుడా వచ్చింది.
- 1975లో కళా ప్రపూర్ణ బిరుదు
- 1984లో కలైమామణి బిరుదు
- 1984లో గౌరవ డాక్టరేటు (తిరుపతి విశ్వవిద్యాలయమచే )
- 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు
- 1986లో ఉత్తమ దర్శకురాలు అవార్డు
- 2001లో పద్మ భూషణ్ అవార్డు
- 'నాలో నేను' ఆత్మ కధకి స్వర్ణ కమలం అందుకున్నారు.
- ఇంకా ఎన్నో అవార్డులు సత్కారాలు అందుకున్నారు.
రచయిత్రిగా
అత్తగారి కధలు, నాలోనేనురచించారు.
సినిమాలు
ఆమె నటించిన ఎన్నో పాత్రలు నేటికి సజీవమై నిలిచాయి.
తెలుగువారి క్లాసికల్ సినిమాగా వర్ణించే మల్లీశ్వరి నేటికి కళాఖండమే. అమాయకురాలి మల్లి పాత్ర మరువలేము.
ఇక ఆ చిత్ర సంగీతం ఎంతో మధురమైంది. ఆమె నటనకి మరో మైలురాయి బాటసారి. ఆ చిత్రం కూడా ఏంతో ప్రసిధి చెందింది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం పడతాయి.
తెనాలి రామకృష్ణ చిత్రంలో ఆమె చేసిన నాట్యం... మరువగలమా. అమే ఎన్నో చిత్రాలలో తన నాట్య కౌశ సలాన్ని ప్రదర్శించారు. చిత్తూరు నాగయ్య తో నటించిన స్వర్గసీమ లోని పాత్రకూడా మరువలేము. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్ర రాజాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.
నాటి తొలి సినిమా వరవిక్రయం నుంచి కృష్ణప్రేమ మంగమ్మగారి మనవడు, గృహలక్ష్మి, అంతా మనమంచికే 1998లో వచ్చిన పెళ్లి కానుక వరకు ఎన్నో సినిమాలు ,, ప్రతి పాత్రలో ఆమె జీవించారు.
నాయకురాలి పాత్ర అయినా, ప్రతినాయకురాలి పాత్ర అయినా ఆమెకి ఆమె సాటి.
మల్లీశ్వరి లో మల్లి ... పల్నాటి యుదంలో నాగమ్మ రెండు వైవిధ్య భరితమైనవే. విప్ర నారాయణ లో పరమ భక్తుడిని ఎలా సంసారిని చేసింది... అంతస్తులలోని అక్కినేనికి తోబుట్టువుగా చలాకి పాత్ర ... సారంగధర... తోడూ నీడలో రామారావు గారి కి తోడుగా సవతి పాపకి ప్రేమని పంచే తల్లిగా..... ఇలా ఎన్ని చెప్పినా ఇంకా మిగిలి పోతూనే వుంటాయి.
గాయినిగా
తను నటించిన ప్రతి సినిమా లోను తన పాత్రలకి తానె పాడుకున్నారు. భానుమతి పాటలు వినని వారు, అబిమానించని వారు వుండరు.
దర్శకురాలిగా
చండీరాణి, గృహలక్ష్మి, అంతా మనమంచికే, విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్లి, మనవడి కోసం, రచయిత్రి, ఒకనాటి రాత్రి, పెరియమ్మ (తమిళ్), భక్త ధ్రువ మార్కండేయ, అసాధ్యురాలు ఇలా ఎన్నో చిత్రాలున్నాయి.
నిర్మాతగా
రత్నమాల, లైలా మజ్ను, ప్రేమ, చండిరాణి చక్రపాణి విప్రనారాయణ, చింతామణి, వరుడుకావాలి, బాటసారి.
చింతమణి , చక్రపాణి సినిమాలకి సంగీత దర్సకత్వం వహించారు.