స్వాగతం సుస్వాగతం
నూతన సంవత్సరానికి
గతం కలగలిసిన అనుభూతులతో
మారింది మరో పేజి కాలెండర్లో
మధురమైన భావాలు
మరపురాని అనుభవాలు
మదిలో చిగిర్చే మరెన్నో కొత్త ఆశలు
తెచ్చింది నూతన సంవత్సరం
తెలుగు వారికి పట్టం కట్టిన గత సంవత్సర ముగింపు
తెలుగు కీర్తి పతకం విను వీధిన మరింత
పైకెగరాలని
తెలుగు సాహిత్యం నలుదిశల వెలుగులు ;విరజిమ్మాలని
తెలుగు పద్యాల సౌరభాలు తెలుగు వారి మది నింపాలని
తెలుగుకు ఉజ్వల భవిష్యత్తును మనసార కాంక్షిస్తూ
నూతన సంవత్సరానికి స్వాగతం
mani
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి