Veer Hanuman |
ఇది ఒక చిన్న పల్లెటూరు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రా జిల్లాలో ధర్మశాల మండలంలో వుంది. ధర్మశాల నుంచి పది కిలోమీటర్ల దూరం లో చుట్టూ ధవళదార హిమవత్ పర్వతాల ఎత్తైన శిఖరాల మధ్య ఈ చిన్న గ్రామం వుంది. ఈ గ్రామానికి దగ్గరలోనే స్వామి చిన్మయానందచే స్థాపించబడిన తపోవన్ ఆశ్రమం బిందు సారస్ అందమైన నదీపాయల నడుమ వుంది. అందమైన ఈ ఆవరణలో 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం హిమాలయాలను పరిరక్షిస్తున్నట్లుగా వుంటుంది .
స్వామి విపరీతమైన గాలులు, తుఫాను గాలులుల నుంచి రక్షించటానికి ఈ గంభీరమైన, వీరాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈ విగ్రహం స్తాపించక ముందు అక్కడ విపరీతమైన గాలులు వీస్తుండేవి. ప్రతి పనికి ఆటంకంగా వుండేది. ఏంతో పంట నష్టం జరిగేది. చుట్టూ మంచుతో కప్పబడి వుండేది. జనజీవితం అస్తవ్యస్తంగా వుండేది. ఏమి నిర్మించదలుచుకున్న ఆ భవంతులు కూలిపోతుండేవి.
సంకల్పం
అటువంటి సమయంలో స్వామి చిన్మయానంద పవన సుతుడైన హనుమంతుని విగ్రహం స్తాపించ దలచారు. 1979లో మొదలు పెట్టిన ఈ విగ్రహం 1982లో పూర్తి చేసుకుని 10 అక్టోబర్ నాడు ప్రతిష్టిం చబడింది. ఈఆంజనీయుని ఆరాధించటం మొదలు పెట్టిన తరువాత అక్కడి వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతినించి ఎదురయ్యే అనర్ధాలు అరికట్టాయి. వ్యక్తుల్లో కూడా ధైర్యం, బలం, నిజాయితీ వంటి గుణాలు అబ్బాయి.
స్వామి తెజోమయానంద మాటల్లో "వీర హనుమంతునిలో అన్ని సుగుణాలు వున్నాయి. భక్తీ, అంకితభావం, సేవ తత్పరత, వీరత్వం, మానవత్వం, విజ్ఞాన ఖని ... చెబుతూవుంటే ఇంకా ఎన్నో విశేష వ్యక్తిత్వ గుణాలు కనబతాయి. "
వీరాంజనేయుడిగా పిలువబడే ఈ విగ్రహం వీరాసన స్థితిలో వుంటుంది. ఈ ఆంజనేయ స్వామికి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక సారి మస్తాకాభిషేకం జరుగుతుంది. ఈ సంవత్సరం (2012) అక్టోబర్ నెలలో జరిగిన ఉత్సవానికి నేను వెళ్ళటం జరిగింది. ఏంతో కన్నుల పండుగగా ఆ ఉత్సవం వేద పండితుల మధ్య మూడు రోజులపాటు జరిగిన విశేష కార్యక్రమానికి ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన వేలాది మంది భక్తుల మధ్య ఆ హనుమంతునికి అభిషేకం జరిగింది.
భారతదేశం నలుమూలనుంచి పవిత్ర నదీ జలాలను తెచ్చి 1008 కలశాలతో అభిషేకించారు. తొలుత బంగారు కలశం తోనూ తరువాత వెండి, ఇత్తడి, రాగి, మట్టి కలశాల తో 1982లో స్వామి చిన్మయానందచే వేదోచ్చారణల మధ్య తోలి అభిషేకం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి మహా మస్తకాభిషేకం జరుగుతూంది. అభిషేకానంతరం ఆంజనేయస్వామిని అందంగా అలంకరించి ఆ పవన సుతునికి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది. మన తెలుగు వారు వందల సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఈ ఆశ్రమం లో సీతారాముల గుడి, శివాలయం వున్నాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆరుగంటలకు ఆరతి జరుగుతుంది.
మేము ఈ విశిష్ట కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు అక్కడికి చేరుకున్నాము.
ఎలా చేరుకోవాలి ?
అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి రాత్రి 8.00 గం|| రైల్లో బయలు దేరితే ఉదయం 5 గం|| కల్లా పఠాన్ కోట్ చేరుకుంటాం. అక్కడి నుంచి మూడు గంటలలో టాక్సీ కానీ, బస్సు లో కాని సిద్ధబారిలోని సాందీపని (తపోవన్)ఆశ్రమంకి చేరుకోవచ్చు. ఈ ఆశ్రమం నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్ లోని ఇతర పవిత్ర తీర్ధ యాత్రలకి చేరుకోవచ్చు. ఆశ్రమం నుంచి కూడా టూరిస్ట్ వాళ్ళు యాత్ర సదుపాయాలను కల్పిస్తారు.
మేము అక్కడ వున్న పది రోజుల్లోనూ స్వామి తెజోమయానందచే వారం రోజులు నారద భక్తీ సూత్రాలు ప్రవచనాలు జరిగాయి.
మనకున్న సమస్యలు, గజిబిజి జీవితం ఉరుకు పరుగుల దినచర్యల నుంచి దూరంగా పవిత్రమైన దేవ భూమి ఒడిలో అన్ని మరిచి గడపటం ఒక మధురమైన అనుభూతి. వీలయితే ప్రతి ఒక్కరు చూసి తీరవలసిన ప్రదేశం హిమాలయ దర్శనం.
ఈ ఆశ్రమంలో స్వామి చిన్మయానంద నిర్యాణానంతరం
ఒక ఆలయం నిర్మించారు. ఇక్కడే వారి దివ్య సమాధి వుంది.
ప్రతి రోజు ఇక్కడ ఆరతి పూజాదికాలు నిర్వహిస్తారు.
ఒక ఆలయం నిర్మించారు. ఇక్కడే వారి దివ్య సమాధి వుంది.
Pujya gurujis statue at temple |
Pujya Guruji's Divya Samadhi at Ashram |
Scenic View From Tapovan Ashram, Sidhabari |
From Ashramam |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి