కథ విశ్లేషణలో నేను ఎంచుకున్న కథ శ్రీ వల్లి రాధిక గారి "సత్యం"
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/satyam---ti-srivalliradhika ఈ కథ ప్రధమ పురుష లో (నేను ...లో ) కథనం సాగుతుంది.
ఒక గృహిణి సాధారణం గా తన చుట్టూ జరిగే సంఘటనలని గమనిస్తూ తనలో తనే ఆ సంఘటనలని విశ్లేషిస్తూ వుంటుంది. పక్కింటి శైలజ ఇంటిని , ఉత్తరాన వున్నా స్కూల్ వాతావరణం అలాగే వచ్చే పోయే వారిని గమనించటం ఆమె దినచర్య.
తల్లి చేయవలసిన పని ఆమె కొడుకు సంతోష్ చిన్న వాడు. బడి ఆవరణ ఊడుస్తూ, పనులు చేస్తూ చెల్లిని చూస్తూ చదువుకోవటం ఆమెకి ఎంతో ముచ్చట వేస్తుంది. అందరికన్నా ముందు వచ్చి అంతా శుభ్రం చేస్తూ చదువు కుంటుంటాడు. .
తల్లి పని చేసే యజమాని అటువేపు వెళ్తూ, సంతోష్ ని చూసి ఆగి "తల్లి పనికి రాలేదేమని" అడిగినపుడు "తల్లికి జ్వరం" అని సంతోష్ జవాబు చెబితే ఆవిడ వెక్కిరింతగా "నాలుగు రోజులనుంచీ జ్వరమేనేమిట్రా దొంగవెధవా!" అని వాడిని కసురుతుంది.
"మీరింతేరా! ఎంత చేసినా మీ బ్రతుకులింతే. మీ దొంగ బుద్ధులూ, అబద్ధాలూ మారవు." అని ఛీత్కరించి వెళ్ళి పోయింది.
ఈ మాటలు ఆమెలో ఎంతో విశ్లేషణ సాగిస్తుంది ఆమె.
ఈ కథ సాంతం "మీరింతే" అనే పదం మీదే చాలా మనో విశ్లేషణ చేస్తుంది నేను అనే పాత్ర....
ఇందులో నిజం ఏమిటి అని ప్రశ్నించు కుంటుంది ఆమె. నిజంగా సంతోష్ వాళ్ళమ్మకి జ్వరం వచ్చిందా లేక వాడు అభద్దాలు ఆడుతున్నడా? .
అల్లాగే శైలజ తన ఇంట్లో ఎన్నో ఏళ్ల నుంచి పనులు చేస్తున్న సత్తేమ్మని కూడా ఎప్పుడు ఏదో ఒక టి అంటూనే వుంటుంది. "నువ్వింతే. నువు పని దొంగవి. నీకు బద్ధకం. కాసేపు ఏమారితే నువు పనంతా ఎగ్గొట్టేస్తావు!" అని శైలజ సత్తెమ్మని సతాయించటం లోని నిజమెంత? సత్తెమ్మ నిజంగానే పని ఎగ్గొట్టే మనిషేనా ? ఇవన్ని ఆమెలో ఎంతో అంతర్మధనానికి రేకెత్తిస్తాయి.
అవన్నీ చూస్తున్న ఆమెకి చుట్టూ ప్రపంచం ఇంతేనా అని కూడా ప్రశ్నించుకుంటుంది
చుట్టూ వున్న ప్రపంచం లోని రెండు వర్గాలు ఉన్నవారు-లేని వారు, ప్రభుత్వము- ప్రతి పక్షము, ఆస్తికులు నాస్తికులు ఇలా అన్ని చోట్ల రెండు అభిప్రాయాలు వున్నట్లు ఇరువుకి ఏకాభిప్రాయం లేదు అనే ఆలోచన సాగుతుంది ఒకరినొకరు అగ్రవర్ణాలూ.. అణగారిన వర్గాలూ.. అందరూ.. మీరింతే అంటే మీరంతే అని దెప్పిపొడుచుకోవడమే.
మీరింతే మీద రచయిత్రి ఎంతో లోతుగా... సిద్ధాంతాలను ఎన్నో రకాలుగా... విశ్లేషిస్తారు.
చివరికి పక్కింటి సత్తెమ్మ ఆమె సిద్ధాంతాలకు కళ్ళెం వేసినట్లుగా కనువిప్పు కలిగిస్తుంది.
సత్తెమ్మని యజమాని శైలజ ఎప్పుడు పనిచేస్తున్న తనని ఎందుకు అల్లా తిడుతూ వుంటుంది అన్నందుకు సత్తెమ్మ ఇచ్చిన జవాబు "ఆమె చేసుకోలేదు కాబట్టే కదమ్మా చేసేవాళ్ళలో తప్పులు కనబడేది. ఆమె కూడా పని చేయడం మొదలు పెడితే పనిలో కష్టం ఆమెకే తెలిసొచ్చుద్ది కదా!” అంది. ఈ జవాబు ఆమె ఆశ్చర్యపోతుంది . ఆమె ఆలోచనల్లో మార్పు వస్తుంది.
అంతవరకూ 'ఇది ఇలా వున్నపుడు అది అలా ఎలా వుంటుంది!' అని ఆలోచించడం మాత్రమే తెలిసిన ఆమెకి 'ఇది ఇలా వుంది కాబట్టే అది అలా వుంటుంది’ అన్న సత్తెమ్మ మాటలు కొత్త కోణాన్ని చూపిస్తాయి.
"ఏ విషయాన్నయినా 'ఇదింతే' అంటూ తీర్మానించడానికీ, నిరసించడానికీ కాస్తంత అహంకారం చాలు. కానీ 'ఇదింతే' అని అంగీకరించడానికీ, ఆచరించడానికీ బోలెడంత సంస్కారం కావాలి" అని నిర్ణయించుకుంటారు.
అంతే కాదు భయం అనే మాటని సత్తెమ్మ ద్వారా చెప్పిస్తారు రచయిత్రి
"భయం వున్నచోట విచక్షణ నశిస్తుందేమో! ఏది చేయకూడదో .. ఏది చేస్తే సరిగ్గా మనం భయపడ్డ విషయం జరుగుతుందో సరిగ్గా అదే చేయడం జరుగుతుందేమో! " అని తనలో తాను విశ్లేషించుకుంటారు రచయిత్రి .
అంతే కాదు భయం అనే మాటని సత్తెమ్మ ద్వారా చెప్పిస్తారు రచయిత్రి
"భయం వున్నచోట విచక్షణ నశిస్తుందేమో! ఏది చేయకూడదో .. ఏది చేస్తే సరిగ్గా మనం భయపడ్డ విషయం జరుగుతుందో సరిగ్గా అదే చేయడం జరుగుతుందేమో! " అని తనలో తాను విశ్లేషించుకుంటారు రచయిత్రి .
ఈ కథలో పాత్రలు ఎక్కువ లేవు. ఫస్ట్ పర్సన్ లో నడిచే ఈ కథనం లో
చక్కటి తర్కం, మనో విశ్లేషణ, చుట్టూ పరిసరాలను నిశితంగా పరిశీలించే చక్కటి మేధో దృష్టి, ధనిక పేద వర్గాల మధ్య జరిగే నిరసన భావం గృహ యజమాని - పనివారి పై జరిపే అధికారం (చిన్ని మాటలు మాత్రమే ఉపయోగించి ) రచయిత్రి పాత్ర ద్వార తన నిరసన, బాధ అన్ని వ్యక్తం చేస్తారు.
"మీరింతే" అనే ఒక్క మాట మీదే అన్ని రచయిత్రి తన భావ జాలం లో చక్కగా తెలిపారు.
చివరికి ఒక పాత్ర సత్తెమ్మ ద్వారా నిజం (సత్యం) తెలుసుకుంటుంది
నాకు తోచిన symbolism (పోలిక)
మార్కెట్ కి ఆమె ముందు వెడుతుంటే వెనక సత్తెమ్మ వచ్చి కలిసినపుడు ఇద్దరు నడుస్తూ సంభాషించుకుంటారు...
కథ చివరికి వచ్చే టప్పటికి సత్తెమ్మ ముందు ఆమె వెంక నడుస్తుంటారు.
కథలో ఆమె ఆలోచనల్లో తనకి తనే విశ్లేషించుకుంటూ తనదే కరెక్ట్ అనుకుంటుంది....
కాని సత్తెమ మాటల్లో ఆమెదే అసలు సత్యం తెలిసి ఆమె ఆలోచనల్లో వచ్చిన మార్పుని రచయిత్రి తెలిపారు
ఈ మనో విశ్లేషణ కథ సత్యం - చదవితే రచయిత్రి అంతరంగం తెలుస్తుంది. ఈ పరిశీలన ఆమె వోక్కరిదే కాదు ప్రతి ఒక్కరు గమనించాలిసిన విషయాలు. ఈ సత్య శోధన నలుగురిని ఆలోచింప చేసేదిగా వుంది.
వసంత సమీరం
మణి కోపల్లె
మణి కోపల్లె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి