సాహితి అభిలాషులకి వందనాలు !
కథ జగత్ లో నేను ఎంచుకున్న కథ:
అంబిక అనంత గారి - కొడగట్టరాని దీపాలు .... కథ లింక్ :
అంబిక అనంత గారి - కొడగట్టరాని దీపాలు .... కథ లింక్ :
ఈ కథ లో రచయిత్రి నేటి సమాజంలో జరుగుతున్న హింస... దానికి కారణమైన ఆధునికత ..... పిల్లలపై దాని ప్రభావం ఎంతో చక్కగా వివరించారు.
చైల్డ్ సై కాలజి పై జరిగిన విశ్లేషణ కథ ఇది.
పిల్లలు entertainment పేరిట కంప్యూటర్ లో ఆడుతున్ననూతన టెక్నాలజీ ఆటలపై
అడిక్ట్ అవుతూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే కథనం ఇది.
పిల్లలు entertainment పేరిట కంప్యూటర్ లో ఆడుతున్ననూతన టెక్నాలజీ ఆటలపై
అడిక్ట్ అవుతూ ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే కథనం ఇది.
నేడు పిల్లలకి అట స్థలాలు కరువైపోయాయి. స్నేహితులు తగ్గిపోతున్నారు చదువుల పేరుతొ పిల్లలకి ఆటవిడుపుగా చదువు తరువాత ఇంట్లోనే వుండి మనో వికాసం పేరుతొ ఎక్కువగా వినోదాన్ని అందిచ్చేది కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయటం మూడు నలుగు సంవత్సరాల నుంచే నేర్చుకుంటున్నారు. కీ బోర్డు పై బుల్లి చేతులు ఆడిస్తూ గేమ్స్ ఆడుతుంటే ఇటు తల్లి తండ్రులు ఆనందిస్తున్నారే తప్ప అభ్యంతర పెట్టటం లేదు.
ఎందుకంటే ఇప్పటినుంచే (ఆ వయసు) నుంచే కంప్యూటర్ నేర్చుకుంటే పెద్దయ్యాక ఈజీ గ కంప్యూటర్ experts అయిపోతారని తల్లి తండ్రుల ఆశ.
ఇక కథాంశాని కొస్తే .....
ఈ నేపధ్యం లో ఈ కథ లో తల్లి తండ్రులు పెద్ద professionals అయి వుండి వారి వారి వృతుల్లో బిజిగా వుంటూ కూడా కొడుకుని జాగ్రత్త చూసుకుంటూ వుంటారు.... కాని పిల్లవాడు విజయ్ ప్రవర్తనలో మారే మార్పుని ఏమాత్రం వాళ్ళు గమనించరు.
***
ఆనంద్ తండ్రి మరణం హత్య అని తెలిసి ఇంత ఘోరం గా ఎవరు చంపి వుంటారో అని అనుకుంటాడు. ఇటు పోలీసులకి కూడా అంతు చిక్కదు ఈ మిస్టరీ .
రక్తపు మరకల్లో తాత శవం చూసి కొడుకు విజయ్ రాత్రిళ్ళు నిద్రపోవటం లేదని అనటం కలవరపెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకు వెడుతుంది డాక్టర్ విమల. తను పెద్ద గైనకలగిస్ట్ అయినా కొడుకుని తనకి సీనియర్, చైల్డ్ స్పెషలిస్టు అయిన డాక్టర్ వర్మ దగ్గరికి తీసుకు వెడుతుంది.
డాక్టర్ వర్మ విజయ్ ని చదువు ఆటలు గురించి ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నల్లో కంప్యూటర్ లో ఆడే ఆతల గురించి అడిగినపుడు "కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు నేనెప్పుడు ఓడిపోలేదు. ఐ యాం ఆల్వేస్ ఎ విన్నెర్" అని అంటున్నపుడు ఉత్షాహం, గర్వం పోటిగా ధ్వనిస్తాయి విజయ్ గొంతులో. మాములుగా ఆడే ఆటలకన్న హింసని ప్రేరేపించే ఆటలంటే విజయ్ కి ఇష్టం అని గ్రహిస్తాడు డాక్టర్ వర్మ. విజయ్ ఆడే ఆటల పేర్లు కూడా విచిత్రం గా వుంటాయి.

"షాడో వారియర్, బ్లడ్ ఆర్మగేద్దన్ ఫ్రాంకినస్తీన్..." ఇలా ఆటల పేర్లు చెప్పేటప్పుడు విజయ్ మొహం ఉద్రేకం తో ఎర్రబడటం విజయ్ పల్ల్స్ చెక్ చేసినపుడు రాపిడ్ గా ఉండి ఎక్సిటేడ్ గా వుండటం గమనిస్తాడు డాక్టర్ వర్మ
విజయ్ లోని మార్పు కొద్దిగా అర్ధం అయిన డాక్టర్ ఆ మరునాడు తన సై కా లజి ఫ్రెండ్ డాక్టర్ రమేష్ ని తీసుకుని వెళ్తాడు. విజయ్ తో గేమ్స్ ఆడటం మొదలు పెట్టి విజయ్ స్కోరు ని దాటి గెలుస్తున్న సమయం లో విజయ్ లో విపరీతమైన మార్పు నివ్వేరపరుస్తుంది..... విజయ్ వెనకనుండి డాక్టర్ రమేష్ మెడ చుట్టూ చేతులు బిగిస్తాడు. ఉద్రేకం తో వుగిపోతుంటాడు . నలుగురు మనుషులు కలిసిన విజయ్ వేరి బలం ముందు ఆగలేక పోతారు. రచయిత్రి పిల్లలల్లో కలిగే మార్పుని ఇక్కడ సహజం గా వర్ణించారు.
విజయ్కి ఏ ఆటల్లోనూ ఎప్పుడు తనే గెలవాలని కోరిక వుంటుంది. వోడిపోవటానికి ఇష్టపడడు. ఎవరైనా గెలుస్తున్నారంటే సహించలేడు .ఆ విపరీత ధోరణితో తన తాతగారు ఆటల్లో గెలుస్తుంటే ఐరన్ బాక్స్ తో తల మీద కొట్టి నపుడు ఆయన చనిపోతాడు.

చిన్నపిల్లలలో ఇటువంటి ధోరణి కొద్ది మందికి మాత్రమే ఎక్కువగా వుంటుంది. తల్లి తండ్రులు అందుకే జాగ్రత్తగా తమ పిల్లలని గమనిస్తూ వుండాలి
ఈ కథలో పిల్లల ప్రవర్తన కంప్యూటర్ లో ఆడే ఆటలు చాల ప్రభావాని చూపుతున్నాయనటానికి ఇదో ఉదాహరణ.
అందులోను పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా రూపొందించే ఆటల్లో పేర్లు, ఆటల విధానం ఎలా వుంటుందో చక్కగా వివరించారు రచయిత్రి.
ఉదాహరణకి
1 .ఈ గేమ్ కార్మెగెడ్డాన్... రోడ్డు మీద మనుషుల్ని కారు క్రింద క్రష్ అవుతుంటే కంప్యూటర్ స్క్రీన్‌మీద నెత్తుటి ముద్దల్లా కనిపిస్తున్న శవాలు పిల్లలపై చూపే ప్రభావం
2 "ప్రాంకిన్‌స్టిన్ త్రూద ఐస్ ఆఫ్ ఎ మాన్‌స్టర్" లో ఒక భయంకరాకారం ఒక అమ్మాయి మెదడుని పుర్రెలో నుండి తీసి, దాన్ని సూప్ చేసుకుని తాగుతున్నవైనం, ఎంతో వాస్తవంగా, జలదరింపు కలిగేలా వుంటుంది.
3 'బ్లడ్' అనే గేమ్‌లో శతృవుకి నిలువెల్లా నిప్పంటించి నృత్యం చేయించే దృశ్యం, తలతో ఫుట్‌బాల్ ఆడే దృశ్యాలు
ఇటువంటి ఆటలు పిల్లలో ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుపుతూ అమెరకలో ఒక బాలుడు నలుగురు పిల్లలని, ఒక టీచర్ ని హత్య చేసిన వుందంతాన్ని రచయిత్రి ఒక పాత్ర ద్వారా వివరిస్తారు . 'చాల మంది పిల్లలు హంతకులుగా మారుతున్నారు' అంటు నేటి సమాజంలో చిన్నారులు వికృత చేష్టలకు ఎలా పాల్పడుతోంది, దానికి కారణాలు చక్కగా వివరించారు. అమాయకంగా వుండే విజయ్ తనకి తెలీకుండానే తన తాతగారిని హత్య చేయటం అనేది సమాజాని ప్రశ్నించేలా వుంది.
సమాజంలో విష సంస్కృతిలా మారుతున్న ఈ కంప్యూటర్ ఆటల ప్రభావాన్నుంచి చిన్నరులని దూరంగా ఉంచేలా చూడవలసిన బాధ్యత తల్లి తండ్రులది, సమాజానిది.
నేటి బాలలే రేపటి పౌరులే అన్న సూక్తి గుర్తుంచుకోవాలని రచయిత్రి గుర్తు చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి