మాగాయ పచ్చడి
ఆవకాయ తరువాత ఆంధ్రుల ఇష్టపడే మరో ఊరగాయ మాగాయ.
మామిడి కాయలు వచ్చె సీజన్ లో మాగాయ పెడతారు.
కావలసిన పదార్ధాలు :
మామిడి కాయలు : 5
ఉప్పు : 1/2 కప్
కారం : 1/2 కప్
మెంతి పిండి : 5 స్పూన్లు
పసుపు : 3 స్పూన్లు
నువ్వుల నూనె : 1/ 4 కేజి
పాల ఇంగువ/
LG.. ఇంగువ : 3 గ్రాములు
ఆవాలు : 2 tsp
ఎండు మెరపకాయలు : 8
తయారు చేయు విధానం :
నోట్....
1. అసలు ఏ వూరగాయ కైనా మామిడి కాయలు ఒకే చెట్టు మామిడి కాయలు వుండాలి.
2. మాగాయ మామిడికాయలు పెద్దవిగాను, మరీ పులుపు లేకుండా తక్కువ పులుపు వుండాలి.
3. కొలతలు సరిగా వేసుకోవాలి.
4. కారం అదీ తినే వారి రుచిని బట్టి వేసుకోవాలి.
5. కొన్ని చోట్ల మామిడి కాయ ముక్కలు తరిగాక ఒక చేటలో వేసి దానిని బట్టి ఒక డబ్బా ఉప్పు వేస్తారు.
6. సాధారణంగా మాగాయ పెట్టే పద్ధతి ఒకేలా వున్నా, కొలతలు మాత్రం అటు ఇటుగా వుంటాయి.
7. చాలా మంది ఆవకాయ కంటే మాగాయనే ఎక్కువ ఇష్ట పడతారు.

- మామిడి కాయలని బాగా కడిగి, తడి లేకుండా తుడ వాలి. ఆ తరువాత చెక్కు తీయాలి.
- సన్నగా పొడుగ్గా ముక్కలు తరగాలి.
- ఒక జాడీ లో తరిగిన మామిడి కాయ ముక్కలు వేసి వాటికి పసుపు, ఉప్పు బేసి బాగా కలపాలి.
- వీటిని మూడు రోజుల పాటు అలాగే వుంచాలి.
- నాలుగో రోజు వాటిని కలిపి చేతులతో గట్టిగా పిండి ఒక ప్లాస్టిక్ sheet మీద ముక్కలు పరవాలి . వీటిని ఎండలో పెట్టాలి. ముక్కలతో పాటు జాడి లోని రసం కూడా మూత పెట్టి ఎండలో పెట్టాలి. ఎండ బాగా వుంటే ఒక రోజు చాలు.
- ఊరిన ముక్కల వుటలో కారం, మెంతి పిండి, వేసి బాగా కలపాలి.
- ఆ తరువాత వూటని బట్టి ఎండిన మామిడి కాయ ముక్కలు కలపాలి. రసం బాగా వుంటే అన్ని ముక్కలు పడతాయి. (కొన్ని సార్లు ముక్కలకి రసం సరిగా రాక కొద్దిగా నే వుంటుంది. అటువంటప్పుడు అన్ని ముక్కలు పట్టవు.)
- బాండలి లో నువ్వుల నూనె వేసి కాచాలి. కాగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కాగిన నూనె చల్లార్చాలి. చల్లారిన తరువాత కారం కలిపిన మాగాయ ముక్కలలో వేయాలి.
- ఆ తరువాత నూనె కాచి అందులో ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి వేసి పోపు పెట్టాలి. ఈ పోపును పచ్చడి లో కలపాలి. ఇల్లంతా ఇంగువ, మెంతి పిండి సువాసనలతో నిండిపోతుంది.
- మరునాడు ఘుమ ఘుమ లాడే మాగాయ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ మాగాయ రుచే వేరు.
మాగాయ