27, మార్చి 2014, గురువారం




శ్రీ తాళ్ళపాక  అన్నమాచార్యుల వారి సంకీర్తనలు నిరంతరం వినండి
http://www.samkeertana.info/annamAchArya/radio.html

16, మార్చి 2014, ఆదివారం

హోలి

హోలీ పండుగ వచ్చింది



వసంత కాలంలో వచ్చే పండుగ హోలీ. భారత దేశం అంతా జరుపుకునే ఈ పండగని దోల్ యాత్రా అని వసంతోత్సవ్ అని కాముని పండగ అని హోలికా దహన్ అనీ రక రకాలుగా పిలుస్తుంటారు. దుల్ హేతి దులంది దులెండి అని కూడా పిలుస్తుంటారు  
మన తెలుగు నాట తక్కువగా జరుపుకునే ఈ హోలీ పండుగ గురించి ఒక్కో చోట ఒక్కో కథనం వుంటుంది 
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది ఈ పూర్ణిమను మహా ఫాల్గుణి హోలికా దాహో హోలికా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఈ పున్నమి రోజు లక్ష్మినారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, చంద్ర పూజ చేస్తుంటారు. ఈ రోజున చంద్రుడు ఉత్తర పాల్గుణీ నక్షత్రం లో వుంటాడు. 

పురాణాల ప్రకారం రాక్షస రాజైన హిరణ్య కశిపుడు విష్ణు భక్తుడైన తన పుత్రుడు  ప్రహ్లదుని చంపించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినపుడు తన సోదరి అయిన 'హోలిక' సాయం కోరుతాడు. ఆమె ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకుని  మంటల్లో కూర్చోమంటాడు. ఆమె కాలి పోకుండా ఆమె ధరించిన ఎర్రటి (దుపట్టా) శాలువా ఆమెని కాపాడుతుంది, ప్రహ్ల్లదుడు మాత్రం మంటల్లో కాలి పోతాడు అని పధకం వేసి ఆమెని మంటల్లో కూర్చోమని అంటాడు. కాని గాలికి ఆమె ధరించిన శాలువా ఎగిరిపోతుంది. చివరికి ఆమె మంటల్లో కాలిపోయి మరణిస్తుంది . ఆ  చున్నీ ప్రహ్లాదుని మీద పడి కాలిపోకుండా రక్షిస్తుంది.  హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల హోలీ పండుగని జరుపుకుంటున్నారు. 

ఈ పండుగని కృష్ణుడు పెరిగిన మధుర, బృందావనం లలో 16 రోజుల పాటు జరుపుకొంటారు. రంగ పంచమి రోజు రాదా కృష్ణుల ప్రేమని కొనియాడతారు.  అలాగే గోపికా కృష్ణ ల రాస లీలలు ఈ రోజే కీర్తిస్తారు. కృష్ణుడు తన వంటి రంగైన నలుపు  గురించి రాధ ఒంటి రంగు గురించి తన తల్లికి ఫిర్యాదు చేసినపుడు   కృష్ణుడి తల్లి రాధ మొహానికి రంగు పూయాలని అనుకున్నదిట. అందుకే ఈ రోజుకీ అందరూ రంగులు పులుముకుంటారని ఓ కథనం కూడా ప్రచారంలో వుంది. వసంత ఋతువు అంటే ప్రేమ వికసించే మాసం లో ఈ పండుగ వస్తుంది. 
మరో కథ మన తెలుగు వారికి తెలిసినది. 
శివ పార్వతుల వివాహం గురించి.....  శివుడు తపస్సు చేస్తుంటే మన్మధుడు (కామా దేవుడు) శివునిపై పూల బాణం వేసినపుడు తప: భంగం కలిగినపుడు  శివునికి కోపం వచ్చి  తన మూడో కన్ను తెరిచి ఆ మంటల్లో  కాముని నాశనం చేస్తాడు.  పతీ వియోగం భరించలేని రతీ దేవి కోరిక మేరకు శివుడు  కామదేవుని బ్రతికిస్తాడు.  కాని భౌతిక రూపం కన్నా  ప్రేమ తత్వాన్ని తెలిపే మానసిక ప్రతిరూపంగానే బ్రతికిస్తాడు.  ఈ సంఘటనని గుర్తు చేస్తూ హోలీ పండుగని జరుపుకుంటారు. 
ఈరోజు రాదా కృష్ణ ప్రేమ గీతాలు, సంప్రదాయ జానపద పాటలు పాడుతుంటారు. 
హోలిక గుర్తుగా రాక్షసుల దహనం పూర్తయిందని భోగి మంటలు హోలీ పండుగ ముందు రోజు వేస్తారు. చాలా మంది ఈ భోగి మంటలు చుట్టూ ప్రదిక్షణలు చేసి పసుపుకుంకుమలు పూలతో పూజిస్తారు. నీటిని చల్లుతూ ప్రదక్షణ చేస్తారు. పూలు, పళ్ళు , కొబ్బరికాయలు వెలిగే మంటల్లో వేసి నమస్కరిస్తారు. చిన్న పెద్ద అందరూ ఏంతో శ్రద్ధగా  పూజ చేస్తారు. ఆ రోజంతా ఉపవాస వుండి సంధ్యా సమయం లో అగ్ని దేవునికి పూజ చేసిన తరువాతనే భుజిస్తారు. 
  హోలీ రోజు ఉదయం ప్రత్యేకమైన పూజలు చేస్తారు.   సంవత్సరంలో సౌభాగ్యవంతమైన దినంగా ప్రజలు భావిస్తారు. హోలీ మిలన్ అని అంటారు. 
    ఈ హోలీ పండుగ రోజే ఎక్కువగా గంజాయిని ఉపయోగించి తండై లేదా భంగ్ అనే పానీయాన్ని తయారు చేస్తారు. 
      ముఖ్యంగా హోలీ పండుగ రోజు చిన్న పెద్దా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, కేరింతలు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునే పండగ ఇది. 




ప్రజల్లో పెరిగిన అవేర్నెస్ ఈ హోలీ పండుగ  జరుపుకునే ఆచారం తగ్గిందనే చెప్పాలి. రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాటలు నృత్యాలు చేస్తూ జరుపుకుంటున్నా రంగులు కొంతమందికి పడక ఎలర్జీ రావచ్చు, కొన్నిసార్లు కళ్ళల్లో పడితే చూపు పోయే ప్రమాదం వుంది. స్కిన్ దురదలు రావచ్చు. పరిమితిలోను, సహజ సిద్ధంగా తయారు చేసే రంగులు వాడటం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చు. నేచురల్ కలర్స్ కన్నా నేడు ఎక్కువగా కెమికల్ కలర్స్ వాడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ పండుగని జరుపుకోవాలి.