2014 Republic Day celebrations
(గణతంత్ర దినోత్సవ వేడుకలు) నిన్న దేశమంతా జరుపుకుంది.
మన నగరంలోనూ బాగా జరిగాయి.
మూడు రోజులనుంచి జరిగిన HYDERABAD LITERARY FESTIVAL ముగిసింది.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ నగరం లో అనేక స్కూల్స్ లో జరిగింది. ముఖ్యంగా చిన్నారులలో, కథలు చెప్పి క్రియేటివిటీని పెంచటం, పుస్తక ప్రదర్శనలు, క్లే మోడల్స్, చర్చలు, book releases, ప్రముఖ రచయితలూ, ప్రాంతీయ, రాష్ట్రీయ అంతర్జాతీయ రచయితల కొత్త పుస్తకాలు విడుదల చేసారు.
నాట్య ప్రదర్సనలు, నాటకాలు, హైకూలు, సంగీతం, ఫోటోగ్రఫి, కథలు చెప్పటం, పుస్తకాలు అచ్చు ఎలా వేస్తారు? వంటి ఎన్నో సాహిత్య ప్రక్రియలు ప్రముఖులచే ప్రదర్సించబడ్డాయి.
ఈ మూడు రోజుల సాహితీ యాత్రలో పాల్గొన్న ప్రముఖులు ....
మన భారతీయ నాట్య ప్రక్రియలో భాగంగా ప్రముఖ నర్తకి రాజేశ్వరి సాయినాథ్ భరత నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆ కార్యక్రమం 24 జనవరి 2014న సాయంత్రం జరిగింది.
ఫోటోగ్రఫి లో THOMAS LOTTGE (26th)
స్పీకింగ్ ఇన్ మెనీ voices - GITHA HARIHARAN(25th)
Pens & Scalpels - KAVERY NAMBISAN, VIJAY NAGASWAMI (26th)... ఇలా వీరే కాదు ఎందరో ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Hyderabad Literary Festival january, 24-26 వరకు ఉదయం నుంచి జరిగిన ఈ కార్యక్ర మాలలో స్టూడెంట్స్ ఎక్కువగా కనిపించారు. యూత్ చాలా అంశాలలో పాల్గొన్నారు. తల్లి తండ్రులు, ఇంకా ఎందరో సాహితీ ప్రియులు ఇందులో పాల్గొన్నారు.
మేము చివరి రోజైన (26th ) ఈవెనింగ్ 4 గం. కల్పా స్కూల్ లో జరిగిన స్టొరీ టెల్లింగ్ కార్యక్రమం కి హాజరయ్యాము. ఆ కార్యక్రమం దీపా కిరణ్ చెప్పిన కధలతో మొదలైంది.
ఆమె కథ లని పిల్లలు, పెద్దలు బాగా ఆనందించారు. పిల్లలని కూడా కథలో involve చేస్తూ ప్రశ్నలు అడుగుతూ జవాబులు రాబడుతూ ఎంతో ఆక్టివ్ గా కథలు ఆటలు పాటలు డాన్స్ లు చేస్తూ పిల్లలని ఆకట్టు కున్నారు ఆమె .
ఎంతో ఉత్సాహంగా జరిగింది ఆ కార్యక్రమం. పిల్లలకి కథలు చెబితే వారు కూడా ఆలోచించి క్రియేటివిటి తో వారు కూడా చిన్నప్పటి నుంచే కథలు చెప్పటం, రాయటం చేయగలరు. కథలు చెప్పటమా ఇంతేనా అనుకుంటాం కాని పిల్లలు తమ దృష్టిని కథల వేపు కేంద్రికరించేలా చేసి కథలు చెప్పటం చాల కష్టం. దీప కథలు ఎంతో ఆసక్తి తో చెబుతారు. హిందు దినపత్రికలో ఫ్రీ లాన్స్ రైటర్ గా , విధ్యార్ధులకి కథలు చెప్పటం వీరి హాబీ. విద్యార్ధులకి, టీచర్స్ కి, తల్లి తండ్రులకి స్టొరీ టెల్లింగ్ లో వర్క్ షాప్ లు నిర్వహిస్తుంటారు.
HLF లో పాల్గొనటానికి ఈ సారి ఐర్లండ్, సింగపూరు, జర్మనీ, శ్రీలంకా,
యు యస్ ఏ వంటి దేశాల నుంచి రచయితలు పాల్గొన్నారు. మన దేశం నుంచి మహేష్ దత్తాని, రాజ్మోహన్ గాంధి, ఆనంద్ గాంధి, మృదుల గార్గ్ వంటి ఎందఱో ప్రముఖ రచయితలు వివిధ సాహితీ ప్రముఖులు హాజరయ్యారు.
ఏంతో వైభవంగా ముగిసాయి ఈ హైదరాబాద్ సాహిత్య పండుగ రోజులు (ప్రదర్శనలు. )
ఈ కార్యక్రమాలన్నీ ఆషియాన, కల్ప స్కూల్, సప్తపర్ణి లామకాన్, అల్ఫొన్సుస్ (alphonsus)
కళాకృతి వంటి ప్రదేశాల్లో జరిగాయి.
ఎందరినో ఆకట్టుకున్నఈ లిటరరీ ఫెస్టివల్ ద్వారా మన సంస్కృతీ విలువలు, కళలు, వాటి విలువలు నేటి తరానికి అందజేయటం వారిలో ఆలోచనలు రేకెత్తించి ఆయా కళల్లో సిద్ధ హస్తులని చేయటం......
క్లే తో బొమ్మలు తయారు చేయటం, చర్చలు, ప్రముఖుల అనుభవాలు, పసందైన విందులు, చాట్ లు, విదేశీయుల నృత్యాలు, సంగీతాలు దీటుగా మన దేశపు శాస్త్రీయ సంగీతాలు ఎన్నో అంశాలతో పండుగ వాతావరణం తో బంజారా హిల్స్ లోని రోడ్ నం. 8 సందడిగా కనిపించింది.
సాంకేతిక పరంగా పెరుగుతున్న నేటి యుగంలో సృజనాత్మక కళలు కూడా మనిషిలోని మానసికానందాన్ని కలగచేస్తాయి.
ఇది చాలా చిన్న రివ్యూ మాత్రమే!
ఆసక్తి కల వారు ఈ కింది లింక్ లో వారి పూర్తి వివరాలు చూడచ్చు.
http://www.hydlitfest.org
https://www.facebook.com/LitFestHyd